కుర్ర హీరోల్లో నానీ ఫస్ట్.. ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీ..అధికారిక ప్రకటన కూడా!
వీ సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే సినిమాలో నటించారు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూసివేత గురించి ముందే ఊహించిన సినిమా యూనిట్ సినిమాని వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయం త్వరలో ప్రకటిస్తామని కూడా నాని వాయిదా ప్రకటనలో చెప్పుకొచ్చాడు. అయితే ఫిల్మ్ షూట్స్ తిరిగి ప్రారంభించడంతో విషయాలు సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ, ఇప్పటికీ థియేటర్స్ విషయంలో అనిశ్చితి కొనసాగుతుంది.
ఈ అస్పష్టతతో, కొన్ని పెద్ద సినిమాలు OTT విడుదలకు వెళ్ళాయి. అయితే, నాని మాత్రం అలా చేయడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. కుర్ర హీరోలల్లో నాని మొదటి సాహసం చేస్తున్నాడని అంటున్నారు. తాజా సమాచారం మేరకు టక్ జగదీష్ థియేట్రికల్ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమాని జూలై 30న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. యూనిట్ త్వరలో ప్రచార కార్యక్రమాలకు సన్నద్ధమవుతుంది మరియు ఈ విషయంలో త్వరలో ఒక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. ఇక నాని ఈ సినిమాతో పాటు శ్యామ్ సింగరాయ్ అనే సినిమా కూడా చేస్తున్నారు.

పూర్తిగా కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల పాటు పశ్చిమ బెంగాల్ లో జరిపారు. అయితే అక్కడ ఎన్నికల నేపథ్యంలో షూటింగ్ కు అంతరాయం కలగడంతో యూనిట్ అంతా తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ కొన్నాళ్ల పాటు గోదావరి జిల్లాల్లో జరిగింది. గోదావరి నది ఒడ్డున ఈ సినిమా షూటింగ్ జరగగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ అంతా హైదరాబాద్ లో జరుగుతోంది. కరోనా కుదుట పడడంతో మళ్ళీ ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టారు. ఈ విషయాన్ని నాని స్వయంగా సోషల్ మీడియా వేదికగా కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు.


Click it and Unblock the Notifications











