Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాజమౌళి కోసమే ప్రభాస్ ప్రత్యేకంగా...
త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో నటించేందుకు రాజమౌళి ..ప్రభాస్ ని పిలిచి తనకు ఎట్లాంటి బాడీ కావాలో ప్రభాస్ కి చెప్పినట్లు సమాచారం. దాంతో ప్రభాస్ ప్రస్తుతం కండలు పెంచే పనిలో ఉన్నాడు. అందుకోసం ప్రత్యేకమైన ట్రైనర్ ని పెట్టుకుని,స్పెషల్ డైట్ తో కండలు పెంచుతున్నట్లు వినికిండి. ప్రస్తుతం ప్రభాస్ కనిపించే సన్నటి లుక్ కూడా ఆ డైటింగ్ లో భాగమే అంటున్నారు. ఇందుకోసం స్పెషల్ వర్కవుట్స్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. రాజమౌళి తన ప్రతీ సినిమాలోనూ హీరోను ప్రత్యేకంగా చూపటానికి ఇంపార్టెన్స్ ఇస్తూంటారు. గతంలో ఎన్టీఆర్ సన్నబడేలా చేసి యమదొంగ చిత్రంలో ప్రత్యేకమైన లుక్ తో చూపి ఘన విజయం సాధించేలా చేసారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ కొరాట్ల శివ దర్శకత్వంలో వారధి చిత్రం చేస్తున్నారు.
అలాగే లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న రెబెల్ చిత్రం కూడా షూటింగ్ జరుగుతోంది. మరో ప్రక్క రాజమౌళి తన ఈగ చిత్రంకు హంగులు దిద్దే పనిలో ఉన్నారు. ఇక ప్రబాస్,రాజమౌలి చిత్రం కె.రాఘవేంద్రరావు సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. లాంఛనంగా హైదరాబాద్ సినీమ్యాక్లో ఆ మధ్యన ప్రారంభమైంది.ఈ చిత్రం గురించి ప్రభాస్ మాట్లాడుతూ...'రాఘవేంద్రరావుగారు పెద్దనాన్నగారికి బొబ్బిలి బ్రహ్మన్న హిట్ ఇచ్చారు. ఆయన బ్యానర్లో పని చేయడం అదృష్టం. రెండున్నర సంవత్సరాల క్రితం కథ చెప్పారు. జీవితంలో మళ్ళీ ఇటువంటి సినిమా వస్తుందో రాదో చెప్పలేను. అందుకే ప్రత్యేకంగా తీసుకుంటున్నా'ను అన్నారు.