»   » ఇక డైరెక్షన్ ఆపేస్తానంటున్న సుకుమార్!

ఇక డైరెక్షన్ ఆపేస్తానంటున్న సుకుమార్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ లీగ్ లో కొనసాగుతున్న దర్శకుల్లో సుకుమార్ ఒకరు. రోటీన్ సినిమాలకు భిన్నంగా, ఇంటలిజెంట్ కాన్సెప్టుతో సినిమాలు చేయడం ఆయన ప్రత్యేకత. అందుకే స్టార్ హీరోలంతా సుకుమార్ డైరెక్షన్లో చేయాలని ఉవ్విల్లూరుతుంటారు. అయితే మరో రెండు సినిమాల తర్వాత సుకుమార్ ఇక దర్శకత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జీవి ఇంటర్వ్యూలో ఆయన ఈ మాట అన్నారట. మరి ఆయన నోట నుండి ఇలాంటి మాట ఎందుకు వచ్చింది? అనేది పూర్తి ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత తేలనుంది.

గతంలోనూ ‘1 నేనొక్కడినే' సినిమా సమయంలో లైవ్ షోలలో సుకుమార్ మాట్లాడుతూ కాస్త అసహనానికి గురయ్యారు. తన సినిమాలు అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేని వారు నా సినిమాలు చూడొద్దనే విధంగా వాదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘నాన్నకు ప్రేమతో' సినిమా బాగానే ఆడుతూ, మంచి వసూళ్లు సాధిస్తున్నప్పటికీ కొందరికి ఈ సినిమా అర్థం కాలేదనే వాదన కూడా ఉంది. ఈ క్రమంలోనే జీవి ఇంటర్వ్యూలో సుకుమార్ ఈ మాట అన్నట్లు తెలుస్తోంది.

Sukumar To Quit Direction After Two Films

త్వరలో మహేష్ బాబుతో హిట్ సినినిమా చేస్తానని సుకుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒక సినిమా ఫ్లాప్‌ అయితే ఆ డైరెక్టర్‌ని ఆ సినిమా హీరోగానీ, నిర్మాతలుగానీ ఎలా చూస్తారో నాకు తెలీదు గానీ, మహేష్‌ నన్ను ఎంత అభిమానిస్తాడో మాటల్లో చెప్పలేను. అలాగే 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాతలకు కూడా నేనంటే ఎంతో అభిమానం. ‘1 నేనొక్కడినే' సినిమా ఫలితానికి రివెంజ్‌ తీర్చుకోవాలని వుంది. మహేష్‌తో ఒక మంచి సూపర్‌హిట్‌ మూవీ తియ్యాలన్నది నా గోల్‌. నా నెక్స్‌ట్‌ మూవీ అదే అని నేను చెప్పడం లేదు. మహేష్‌ నన్ను పూర్తిగా నమ్మాడు. 1 సినిమా కు నేను అతన్ని మోసం చేశాను అనుకుంటున్నాను. అందుకే అతనికి ఒక హిట్‌ సినిమా చేస్తాను అన్నారు.

ప్రస్తుతం సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే....ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆయన్ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా నిర్మించబోతున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనునప్నారు.

English summary
Director Sukumar, one of the most loved and critically acclaimed directors of current times, is thinking to quit direction after his next two films. To the shock of everyone, he revealed his thoughts in an exclusive interview with Idlebrain.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu