Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కళ్యాణ్ సినిమాలు రీమేక్ అంటే.. ఎప్పటికైనా అపాయమే: కళ్యాణ్ దేవ్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోలు చాలా వరకు ఎవరి స్థాయిలో వారు ఒక మార్కెట్ సెట్ చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ బ్రాండ్ ఎంత ఉన్నా కూడా అవి కొన్ని సినిమాల వరకే వారికి ఉపయోగపడ్డాయి. ఇక నెక్స్ట్ మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా అదే తరహాలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవాలని చూస్తున్నాడు.
మెగా హీరోలు సపోర్ట్ చేయకపోయినా..
చిరంజీవి చిన్నల్లుడైన కళ్యాణ్ దేవ్ అసలు ఎక్కడా కూడా మెగా బ్రాండ్ ని వాడుకోవడానికి ఇష్టపడటం లేదు. కానీ ఎప్పటికప్పుడు వాళ్లపై ఎదో ఒక విదంగా స్పందిస్తూనే ఉన్నాడు. ఇక మెగా హీరోలు ఎవరు కూడా ఈ హీరోకు సపోర్ట్ చేయకపోయినా పెద్దగా పట్టించుకోవడం లేదు. అలా ఉంటేనే బెటర్ అంటున్నాడు. ఇక మెగా రీమేక్స్ పై కూడా కళ్యాణ్ తన వివరణ ఇచ్చాడు.
మెగా రీమేక్స్ చేస్తే..
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ ఉన్నాయి. అయితే నేటితరం హీరోలు వారి సినిమాలను ఏమైనా రీమేక్ చేస్తారేమో అని ఆడియెన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ అలాంటి ఆలోచనలు ప్రస్తుతానికి ఏ మెగా హీరోకు లేవని కళ్యాణ్ దేవ్ వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
ఎప్పటికైనా అపాయమే..
కళ్యాణ్ మాట్లాడుతూ.. మెగాస్టార్, పవర్ స్టార్ వారి సినిమాలతో ఒక లెజెండ్స్ అనిపించుకున్నారు. వారి సినిమాలతో ఒక స్పెషల్ గుర్తింపు దక్కించుకున్నారు. అలాంటి వారి సినిమాలు మళ్ళీ చేయాలని అనుకుంటే.. పాజిటివ్ కన్నా నెగిటివ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటితో ఎప్పటికైనా అపాయమే.. టచ్ చేయకుండా ఉంటేనే బెటర్ అని అన్నారు.
రీమేక్ చేయాలని లేదు..
ఇక నా లైఫ్ లో ఆ స్టార్ హీరోల సినిమాలు రీమేక్ చేయాలని లేదు. ఇక సాంగ్స్ రీమేక్ చేయడం అనే పరిస్థితి ఎదురైతే అది పూర్తిగా దర్శకుడి ఇష్టం. మొదటి సినిమా టైటిల్ విజేత కూడా దర్శకుడు కథను రాసుకున్న విధానం బట్టి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ విషయంపై చిరంజీవిగారు కూడా పెద్దగా సందేహించలేదని అన్నారు.
Recommended Video
నా కోరిక అదే..
ఓటీటీలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందా అనే ప్రశ్నకు కూడా కళ్యాణ్ ఒక సమాధానం ఇచ్చాడు. వెబ్ సిరీస్ లలో నటిస్తే అవకాశాలు లేక ఇలా ఓటీటీలోకి వచ్చాడని కొంతమంది అనుకోవచ్చు. అందుకే అలాంటి రిస్క్ తీలుకోవడం కూడా తనకు ఇష్టం లేదని వీలైనంత వరకు సినిమాలతో ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవలన్నదే తన కోరిక అని కళ్యాణ్ తెలియజేశాడు.