Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
యంగ్ హీరోయిన్‌కు భారీ షాకిచ్చిన సోహెల్: తన పార్ట్నర్ అంటూ పరిచయం.. ఏకంగా అలా కనిపించడంతో!
టీనేజ్లోనే సినిమాల్లోకి ప్రవేశించి.. దాదాపు పదేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించాడు సింగరేణి ముద్దుబిడ్డ సయ్యద్ సోహెల్ రియాన్. అయితే, గుర్తింపును మాత్రం అంతగా దక్కించుకోలేకపోయాడు. కానీ, బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఎనలేని గుర్తింపును అందుకున్నాడు. దీని తర్వాత ఏకంగా హీరోగా సినిమాను కూడా మొదలు పెట్టేశాడు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఇలాంటి సమయంలోనే యంగ్ హీరోయిన్‌కు సోహెల్ భారీ షాక్ ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆ సంగతులు మీకోసం!
ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫ్రెండ్‌గా సినిమాలు
టీనేజ్లోనే 'కొత్త బంగారు లోకం' అనే సినిమాతో యాక్టర్‌గా కెరీర్‌ను ఆరంభించాడు సయ్యద్ సోహెల్ రియాన్. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్', అల్లు అర్జున్ చిత్రం 'సరైనోడు' వంటి బడా మూవీలలో పాటు చిన్న సినిమాల్లోనూ నటించాడు. అదే సమయంలో కొన్ని సీరియళ్లలోనూ నటించి పేరు తెచ్చుకున్నాడు. కానీ, సరైన గుర్తింపును మాత్రం అందుకోలేదు.
బిగ్ బాస్ ఆఫర్.. ఆమెతో సీక్రెట్‌గా ఎంటర్
సినిమాల్లో నటిస్తూనే.. బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే పలు సీరియళ్లలో నటించాడు. అలా వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశాన్ని అందుకున్నాడు. అయితే, మిగిలిన కంటెస్టెంట్లలా కాకుండా ఆరియానా గ్లోరీతో కలిసి సీక్రెట్‌గా ఎంట్రీ ఇచ్చాడతను. అక్కడ రచ్చ రచ్చ చేసి ఆ తర్వాత హౌస్‌లోకి ప్రవేశించాడు.
అన్నింట్లోనూ అదుర్స్.. ఫినాలేకు చేరాడు
బిగ్
బాస్
హౌస్‌లోకి
అడుగు
పెట్టినప్పటి
నుంచే
తన
మార్క్
చూపించేందుకు
ప్రయత్నించాడు
సోహెల్.
ఇందులో
భాగంగానే
అద్భుతమైన
ఆటతీరుతో
ఆకట్టుకున్నాడు.
ఏ
టాస్క్
అయినా
తానే
నెంబర్
వన్
అనేలా
ఆడుతూ
వచ్చాడు.
అదే
సమయంలో
తోటి
కంటెస్టెంట్లతో
గొడవలు
పడుతూ
విమర్శల
పాలయ్యాడు.
మొత్తానికి
ప్రేక్షకుల
మద్దతులో
ఫినాలేలో
అడుగు
పెట్టాడతను.
ఆ పని చేసిన మొదటి కంటెస్టెంట్‌గా రికార్డ్
గ్రాండ్ ఫినాలేలో టాప్-3లో ఉన్న సమయంలో బిగ్ బాస్ ఇచ్చిన రూ. 25 లక్షల ఆఫర్‌కు ఓకే చెప్పి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు సోహెల్. తద్వారా ఇలా షో చరిత్రలో డబ్బులు తీసుకుని వచ్చిన మొదటి కంటెస్టెంట్‌గా నిలిచాడు. అంతేకాదు, రోజు వారి రెమ్యూనరేషన్‌తో కలిపి దాదాపు రూ. 50 లక్షల వరకూ సంపాదించాడట సోహెల్. అంటే విన్నర్ ఫ్రైజ్‌మనీతో సమానంగా.
వచ్చిన వెంటనే సినిమా.. బాలీవుడ్ కూడా
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన వెంటనే 'జార్జిరెడ్డి' టీమ్‌తో కలిసి ఓ సినిమాను ప్రారంభించాడు సోహెల్. ఇందులో రూప కొడువయూర్ హీరోయిన్గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మేరకు హోళీ పండుగను పురస్కరించుకుని ఓ రొమాంటిక్ పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. అంతేకాదు, ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్‌లోనూ కీలక పాత్రను పోషిస్తున్నాడు.
పార్ట్నర్ పరిచయం.. ఇప్పుడు ఆమె పోస్ట్
సయ్యద్ సోహెల్ రియాన్ హీరోగా నటిస్తోన్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఇందులో భాగంగా హీరో హీరోయిన్ల తో పాటు బ్రహ్మాజీపై కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూప తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సోహెల్‌ను హగ్ చేసుకున్న ఫొటోను షేర్ చేసి 'నా క్రైమ్ పార్ట్నర్' అంటూ క్యాప్షన్ పెట్టింది. దీన్ని సింగరేణి బిడ్డ స్టోరీగా పెట్టుకోవడం విశేషం.
యంగ్ హీరోయిన్‌కు భారీ షాకిచ్చిన సోహెల్
సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఫన్నీ వీడియోను సోహెల్ షేర్ చేశాడు. ఇందులో రూప కొడువయూర్ బొమ్మ అంటూ పేపర్‌పై పిచ్చి గీతలు గీశాడతను. అంతేకాదు.. 'చూడు.. అచ్చం నీలాగే ఉంది. ఎందుకబ్బా నా లాంటి టాలెంట్ ఉన్నోళ్లను తొక్కేస్తున్నారు' అంటూ కామెంట్ కూడా చేశాడు. ఇక, ఆ ఫొటో చూసిన హీరోయిన్ వెంటనే షాకైపోయి నోరెళ్లబెట్టేయడం గమనార్హం.