For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మేము సెక్స్ బానిసలమా? ఆ నరకం మీకు తెలుసా? ఆ పనిపై ధ్యాస తప్ప.. అమలాపాల్ ఫైర్

  |

  అందాల నటి అమలాపాల్‌కు నిత్యం ఏదో వార్తల్లో నానుతుండటం అలవాటుగా మారినట్టు కనిపిస్తున్నది. కొద్ది రోజుల క్రితం రెండో పెళ్లి చేసుకొన్నారంటూ దక్షిణాదిలో సంచలన రేపిన ఈ భామ.. ఆ తర్వాత తన పెళ్లిపై క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. ఇలా సినిమాపరంగా కాకుండా ఇతరత్రా విషయాలతో మీడియాలో ఏదో ఒక రూపంలో వార్తల్లో కనిపిస్తున్నారు. తాజాగా మహిళల హక్కులు, ప్రెగ్నెన్సీ అంశాలపై భావోద్వేగంగా స్పందించారు. లాక్‌డౌన్ సమయంలో ఇలాంటి విషయాలపై అమలాపాల్‌కు స్పందించాల్సిన అవసరం ఏమింటంటే..

   ఓషో ‘ది బుక్ ఆఫ్ ఉమెన్' ప్రభావంతో

  ఓషో ‘ది బుక్ ఆఫ్ ఉమెన్' ప్రభావంతో

  లాక్‌డౌన్‌ పిరియడ్‌లో ఇంటికే పరిమితమైన అమలాపాల్ రకరకాల వ్యాపకాలతో కాలాన్ని గడుపుతున్నారు. ఆ క్రమంలోనే ప్రస్తుతం పుస్తక పఠనంలో మునిగిపోయారు. ఇటీవల ఓషో రాసిన ఆమె ది బుక్ ఆఫ్ ఉమెన్ చదవటం, ఆ పుస్తక ప్రభావం ఆమెపై స్పష్టంగా పడినట్టు కనిపిస్తున్నది. ఆ పుస్తకంలోని కొన్ని అంశాల ప్రభావంతో సమాజంలో మహిళలకు జరుగుతున్న కొన్ని అన్యాయాలపై సోషల్ మీడియాలో స్పందించారు.

  మేము సెక్స్ బానిసలమా?

  మేము సెక్స్ బానిసలమా?

  మహిళలతో నేటి సమాజం ప్రవర్తిస్తున్న తీరు సరిగాలేదు, ప్రేమ, పెళ్లి లాంటి అంశాల్లో అమ్మాయిలకు అన్యాయం జరుగుతున్నదంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు. మహిళలంటే సెక్స్ బానిసలా? ప్రెగ్నెన్సీ వారిలో పసితనాన్ని చంపేస్తుంది. మహిళలను సెక్స్ వస్తువులుగా చూస్తున్నారు. లైంగిక కోరికలు తీర్చే వస్తువులుగా భావిస్తున్నారు అని అమలాపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

  మాకే ఎందుకు ఉండాలి?

  మాకే ఎందుకు ఉండాలి?

  మహిళలపై ప్రేమ, పెల్లి, పిల్లలు, బాహ్య, అంతర్గత క్షోభ, బాధలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇవన్నీ పురుషులకు కాకుండా కేవలం మహిళలకే ఎందుకుండాలి? ఆర్థిక విషయాల్లో మరొకరిపై ఆధారపడి ఉండాల్సి రావడం, అనేక విషయాల్లో మానసిక క్షోభ, గృహ బానిసత్వం లాంటి అంశాలతో బాధల్లోనే బతుకుతున్నారు. ప్రెగ్నెన్సీ అనేది మహిళలకు శాపంగా మారుతున్నది. ఆ సమయంలో లోపల ఉన్న బిడ్డ ఆహారం తినడానికి కూడా అనుమతించదు. దాంతో కలిగే వాంతుల వల్ల ఎలాంటి నరకం అనుభవిస్తున్నారో తెలుసా? అంటూ అమలాపాల్ ప్రశ్నించారు.

  ప్రెగ్నెన్సీ నరకం గురించి తెలుసా?

  ప్రెగ్నెన్సీ నరకం గురించి తెలుసా?

  ప్రెగ్నెన్సీ సమయంలో కడుపులో తొమ్మిది నెలలపాటు బిడ్డ పెరుగుతుంటే దాని వల్ల కలిగే నరకం గురించి ఎవరికైనా పట్టింపు ఉందా? ఒక ప్రసవం నుంచి బయటపడకముందే మగాడు మరోసారి ఆమెను గర్బవతిగా చేసేందుకు రెడీగా ఉంటాడు. తొమ్మిది నెలల కాలంలో ఆమె అనుభవించే కష్టాలు ఆయనకేమి తెలుస్తాయి? ఆ బాధలో కొంతైనా మగాళ్లకు తెలుసా? అని అమలాపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

  Akkineni Akhil Message To His Fans On His Birthday

  మహిళలపై నిజంగా ప్రేమ ఉందా?

  జీవిత భాగస్వామిని ఐ లవ్ యూ అనే ఒక పదంతో మగాళ్లు కట్టిపడేస్తుంటారు. ఒకవేళ మహిళలపై మగాళ్లకు నిజంగా ప్రేమ ఉంటే.. సరిగా అర్ధం చేసుకొంటే ఈ ప్రపంచంలో ఇంత జనాభా పెరిగే అవకాశం ఉందా? ప్రేమిస్తున్నాను అని చెప్పే మగాడి మాటలో శూన్యం తప్ప మరోటి ఉండదనే విషయాన్ని తెలుసుకోవాలి? మహిళను ఓ పశువుగా మాత్రమే చూస్తున్నారు అని తీవ్రస్థాయిలో అమలాపాల్ స్పందించారు.

  English summary
  South Indian actress Amala paul talks about pragnancy complication which suffers by Women. She influenced by Osho's The Book of Women in lockdown period. She wrote in her instagram that.. All the best questions in THE PROPHET are asked by women- about love, about marriage, about children, about pain-authentic, real.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X