For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Priyanka Chopra డ్రస్‌పై దారుణంగా ట్రోలింగ్.. ఇంత చెండాళంగానా? ఆమె గర్బవతి అంటూ

  |

  బాలీవుడ్‌ తార నుంచి గ్లోబల్ ఐకాన్‌గా మారిన ప్రియాంక చోప్రా విదేశీగడ్డ మీద తన అందాలతో మ్యాజిక్ చేస్తున్నది. కేవలం నటనతోనే కాకుండా తన ఫ్యాషన్‌తో గ్లామర్ పంట పండిస్తున్నది. గతంలో ఎన్నోసార్లు తన దుస్తులతో మైమరిపించడమే కాకుండా తాను ధరించిన డ్రెసెస్‌తో ట్రోలింగ్‌కు గురైంది. తాజాగా మరోసారి ఆమె డ్రెస్సింగ్ వ్యవహారాన్ని నెటిజన్లు చీల్చి చెండాడారు. ఆ వివరాల్లోకి వెళితే...

  వింబుల్డన్‌లో మెరిసిన ప్రియాంక చోప్రా

  వింబుల్డన్‌లో మెరిసిన ప్రియాంక చోప్రా

  తాజాగా జరుగుతున్న వింబుల్డన్ టెన్నిస్ టోర్ని సందర్భంగా ఓ మ్యాచ్‌కు ప్రియాంక చోప్రా హాజరైంది. అయితే ఆ సమయంలో ఆమె ధరించిన దుస్తులను చూసి కేట్ మిడిల్టన్ అనే హాలీవుడ్ తారను అనుకరించారంటూ నెటిజన్లు భగ్గుమన్నారు. నాసిరకమైన, నాణ్యత లేని, టేస్ట్‌ లేని డ్రస్సును ప్రియాంక చోప్రా వేసుకొన్నదంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు.

  బ్రిటన్ రాజకుటుంబం, టెన్నిస్ లెజెండ్స్‌తో

  బ్రిటన్ రాజకుటుంబం, టెన్నిస్ లెజెండ్స్‌తో

  లండన్‌లో జూలై 10వ తేదీన ఆష్లీ బార్టీ, కరోలినా ప్లిస్కోవా మధ్య జరిగిన మ్యాచ్‌కు తన స్నేహితురాలు నటాషా పూణేవాలాతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె డ్యుక్ అండ్ డచ్ ఆఫ్ కేంబ్రిడ్జి ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్టన్‌, టెన్నిస్ లెజెండ్ మార్టినా నవ్రతిలోవా, బిల్లీ జీన్ కింగ్‌తో కలిసి రాయల్ బాక్స్‌లో కూర్చొన్నారు. ఆ సమయంలో ముఖం నుంచి కాలి పాదాల వరకు ముసుగు వేసుకొన్నట్టు డ్రెస్ ధరించడంపై నెటిజన్లు, అభిమానులు చాలా అప్‌సెట్ అయ్యారు.

  ముసుగేసుకొన్నట్టు ప్రియాంక చోప్రా

  ముసుగేసుకొన్నట్టు ప్రియాంక చోప్రా

  ప్రియాంక చోప్రా తనను ఎవరూ గుర్తుపట్టనంతగా విచిత్రమైన వేషాదారణతో ముస్తాబయ్యారు. చేతిలో ఖరీదైన బ్యాగ్, చెవిలకు ఓ రకమైన రింగులు, నడుము చుట్టు బెల్ట్ కట్టుకొని మెడ కూడా కనిపించని విధంగా డ్రస్ వేసింది. సాధారణంగా పబ్లిక్‌లోకి వస్తే అందాలను యదేచ్ఛగా ఆరబోసే ఈ ముద్దుగుమ్మ ఇలాంటి దుస్తులు ధరించారేమిటని ముక్కును వేలేసుకొన్నారు. అంతటితో ఆగకుండా దారుణంగా కామెంట్లతో ట్రోల్ చేశారు.

  ఇలా నాసిరకమైన డ్రస్సుల్లోనా?

  ఇలా నాసిరకమైన డ్రస్సుల్లోనా?

  సోషల్ మీడియాలో పోస్టు చేసిన ప్రియాంక చోప్రా ఫోటోలపై దారుణంగా కామెంట్స్ చేశారు. అచ్చం అమ్మమ్మలాగా కనిపిస్తున్నారు. ఆమెకు మంచి దుస్తులను ధరించే టేస్టే లేదు. ఆమె మరింత అందంగా, మేలిరకమైన దుస్తులు ధరించడానికి ఒక ఫ్యాషన్ డిజైనర్‌ను నియమించుకోవాలి. ఆమె చాలా సార్లు దారుణంగా డ్రస్సులు వేసుకొంటుంది. ప్రియాంక చోప్రా ఫ్యాషన్ విషయంలో తన మైండ్ సెట్ మార్చుకోవాలి. ఆమె హెయిర్‌స్టయిల్ చూస్తే పక్కున నవ్వొస్తుంది అంటూ నెటిజన్లు దారుణంగదా చీల్చి చెండాడారు.

  ప్రియాంక చోప్రా గర్బవతి అంటూ

  ప్రియాంక చోప్రా గర్బవతి అంటూ

  అయితే ప్రియాంక చోప్రాపై ఓ నెటిజన్ అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె గర్బవతినా?.. ప్రెగ్నెన్సీని దాచుకోవడానికి ఇలాంటి డ్రెస్ వేసిందా? ఇది మాత్రం అభిమానులను ఆకట్టుకొనే డ్రస్ మాత్రం కాదు అంటూ తీవ్రమైన అసహాన్ని వ్యక్తం చేస్తూ నిరుత్సాహానికి గురయ్యారు.

  Harbhajan Singh Says Yes For Ranveer Singh, Geeta Basra Disagrees
  ప్రియాంక చోప్రా కెరీర్ ఇలా..

  ప్రియాంక చోప్రా కెరీర్ ఇలా..

  ఇదిలా ఉండగా, ప్రియాంక చోప్రా సినీ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ది వైట్ టైగర్ అనే చిత్రంలో ఆదర్శ్ గౌరవ్, రాజ్ కుమార్ రావుతో కలిసి నటించింది. ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాలు మ్యాట్రిక్స్ 4, టెక్ట్స్ ఫర్ యూ అనే సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే అవెంజర్‌ను రూపొదించిన జో, ఆంథోని రుస్పో నిర్మిస్తున్న సిటాడెల్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రిచర్డ్ మ్యాడెన్ హీరోగా నటిస్తున్నారు. త్వరలోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

  English summary
  Bollywood actor and Global Icon Priyanka Chopra trolled heavily on in her dress during Wimbolden Match. Priyanka sat with Duke and Duchess of Cambridge Prince Willaim and Kate Middleton. Priyanka sat with Tennis legends Martina Navratilova, Priyanka sat with Tennis legends Billie Jean King in royal box.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X