Don't Miss!
- News
vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Deepika Padukone అరుదైన గౌరవం.. 3000 మందిలో ఏకైక వ్యక్తిగా అంతర్జాతీయ అవార్డు
బాలీవుడ్‌లో అగ్రతారగా వెలుగొందుతున్న దీపిక పదుకోన్‌కు అరుదైన అవార్డు దక్కింది. అంతర్జాతీయ వేదికపైన అందుకొనే ఈ అవార్డును సాధించిన మొదటి భారతీయ సెలబ్రిటీగా దీపిక ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. ఇటీవల కాలంలో ఉత్తమ ప్రతిభను చాటుతున్న హీరోయిన్ల నామినేషన్లను పరిశీలించిన కమిటీ దీపిక పదుకోన్‌కు ఈ అవార్డును అందించాలని నిర్ణయిం తీసుకొన్నది. ఈ అవార్డు వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌లో నటిగా, నిర్మాతగా
బాలీవుడ్‌లో గత కొద్దికాలంగా హీరోయిన్ ఓరియెంటెట్ పాత్రలు ధరించడమేకాకుండా నిర్మాతగా కూడా ప్రయోగాలు చేస్తున్నారు. తాను నటించే సినిమాల్లో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకొంటూ ముందుకెళ్తున్నారు. బాలీవుడ్‌లో హీరోలకు సమానంగా ఉండే పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. ఇలా తన కెరీర్‌ను ఉన్నత స్థాయిలో డిజైన్ చేసుకొంటున్న దీపికకు అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ది గ్లోబల్ అచీవర్స్ అవార్డు 2021
ప్రపంచవ్యాప్తంగా
సినీ
రంగంలో
ఉత్తమ
ప్రతిభను
చాటిన
వారికి
ఇచ్చే
ది
గ్లోబల్
అచీవర్స్
అవార్డు
2021
పురస్కారం
కోసం
ఈ
ఏడాది
3000కుపైగా
నామినేషన్లు
వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా
వివిధ
విభాగాల్లో
సక్సెస్‌ఫుల్
ట్రాక్
రికార్డును
అందుకొన్న
వారిని
షార్ట్
లిస్టు
చేసి
దీపికను
ఎంపిక
చేశారు.
దీపిక
పదుకోన్‌కు
బెస్ట్
యాక్ట్రెస్
ఇన్
బాలీవుడ్
పేరిట
ది
గ్లోబ్
అవార్డు
2021
అందజేయనున్నారు.
ఇప్పటి
వరకు
ఈ
అవార్డును
అందుకొన్న
తొలి
వ్యక్తిగా
దీపిక
పదుకోన్
ఓ
రికార్డును
నెలకొల్పారు.

దశాబ్దకాలంగా విభిన్నమైన పాత్రలతో
గత
దశాబ్దకాలంలో
దీపిక
పదుకోన్
భారీ
బడ్జెట్‌తో
సక్సెస్‌ఫుల్
చిత్రాల్లో
నటించారు.
రామ్‌లీలా,
తమాషా,
పద్మావత్
లాంటి
చిత్రాలు
ఆమె
ప్రతిభకు
అద్దంపట్టాయి.
వెండితెరపై
తన
నటనతో
ప్రేక్షకుల
హృదయాల్లో
సుస్థిర
స్థానం
సంపాదించుకొన్నారు.
దాంతో
భారతీయ
సినిమా
పరిశ్రమలో
అగ్రశ్రేణి
హీరోయిన్‌గా
దీపిక
తనకంటూ
ఓ
స్థానాన్ని
సంపాదించుకొన్నారు.

గతంలో కూడా అంతర్జాతీయ అవార్డులు
దీపిక పదుకోన్‌కు ఇలాంటి అవార్డులు రావడం కొత్తేమి కాదు. ప్రపంచవ్యాప్తంగా టైమ్ మ్యాగజైన్ రూపొందించిన 100 మంది ప్రతిభావంతుల జాబితాలో దీపిక పదుకోన్ చోటు సంపాదించింది. అలాగే దావోస్ 2020 సదస్సులో 26వ వార్షిక క్రిస్టల్ అవార్డును అందుకొన్నారు. ఇలాంటి అవార్డును అందుకొన్న తొలి భారతీయ నటిగా అప్పట్లో ఘనతను సాధించారు.

దీపిక పదుకోన్ కెరీర్ ఇలా..
నిర్మాతగా
దీపిక
పదుకోన్
కేఏ
ప్రొడక్షన్
విసయానికి
వస్తే.
2018లో
ఈ
సినీ
నిర్మాణ
సంస్థను
ప్రారంభించారు.
యాసిడ్
దాడి
బాధితురాలి
కథతో
ఛపాక్
అనే
చిత్రాన్ని
తెరకెక్కించారు.
హీరోయిన్‌గా
దీపిక
పదుకొన్
కెరీర్
విషయానికి
వస్తే..
ఆమె
నటించిన
కపిల్
దేవ్
బయోపిక్
83
చిత్రం
విడుదలకు
సిద్ధంగా
ఉంది.
నాగ్
అశ్విన్,
ప్రభాస్
కాంబినేషన్‌లో
తెరకెక్కనున్న
చిత్రంలో
నటించడం
ద్వారా
దీపిక
పదుకొన్
తెలుగులో
అడుగుపెట్టనున్నారు.
అలాగే
శకున్
బాత్రా
చిత్రంలో,
షారుక్
ఖాన్‌తో
పఠాన్,
రణ్‌వీర్
సింగ్‌తో
సర్కస్
అనే
మరో
చిత్రంలో
నటిస్తున్నారు.
STXfilms,
Temple
Hill
Productions
బ్యానర్‌తో
కలిసి
ఓ
హాలీవుడ్
చిత్రంలో
నటించడమే
కాకుండా
నిర్మాతగా
వ్యవహరిస్తున్నారు.