Don't Miss!
- News జగన్‌ను ఓడించడానికి ఒక్కటైన ఇద్దరు సీఎంలు
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మామను వెతుక్కుంటూ పోర్చుగల్ వెళ్లిన సమంత!
అక్కినేని కోడలు సమంత... మామ నాగార్జునను వెతుక్కుంటూ పోర్చుగల్ బాట పట్టారు. అక్కడ జరుగుతున్న 'మన్మధుడు 2' షూటింగులో జాయిన్ కాబోతున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
స్వయంగా నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో నిర్మిస్తున్న చిత్రం కావడంతో షూటింగ్ లేనపుడు భర్తతో సరదాగా గడిపేందుకు అమల కూడా ఇటీవలే పోర్చుగల్ ఫ్లైట్ ఎక్కారు. ఇపుడు సమంత కూడా వెళ్లడంతో 'మన్మధుడు 2' షూటింగ్ అక్కినేని ఫ్యామిలీ రీ యూనియన్ మాదిరిగా ఉందని అంటున్నారు.
'మన్మధుడు 2'లో వెరీ ఇంట్రెస్టింగ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాను. నా పాత్ర గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. కానీ నా రోల్ ఈ స్టోరీలో చాలా ముఖ్యమైందిగా ఉంటుందనే హామీ ఇవ్వగలను.' అని సమంత కొన్ని రోజుల క్రితం తన పాత్రపై క్లారిటీ ఇచ్చారు.
'మన్మధుడు 2' చిత్రంలో లక్ష్మీ, వెన్నెల కిషోర్, రావు రమేష్, నాజర్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. గతంలో నాగార్జున హీరోగా రూపొందిన సూపర్ హిట్ ఫిల్మ్ 'మన్మధుడు' చిత్రానికి ఇది సీక్వెల్