»   » ‘బాహుబలి’ గురించి హాలీవుడ్ రివ్యూ రైటర్ ఇలా...(వీడియో)

‘బాహుబలి’ గురించి హాలీవుడ్ రివ్యూ రైటర్ ఇలా...(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూయార్క్ :దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి'. ‘బాహుబలి ది బిగినింగ్‌'గా పిలవబడుతున్న మొదటి భాగానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ ఇప్పటికే విడుదలై సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కళ్ళు చెదిరే విజువల్స్ తో ఈ ట్రైలర్ విడుదలైన 24గంటల లోపే 1మిలియన్ వ్యూస్ ని దాటింది. ఒక తెలుగు సినిమా ఇది ఇప్పటివరకూ సాధించని అరుదైన రికార్డు. ఇప్పుడు హాలీవుడ్ దృష్టి సైతం ఈ చిత్రం పై పడింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇంటర్నేషనల్ ట్రైలర్స్ పై రివ్యూలు ఇచ్చే హాలీవుడ్ రివ్యూవర్...Grace Randolph కూడా ఈ చిత్రం ట్రైలర్ ని చూసి రివ్యూ ఇవ్వటం జరిగింది. ఆమె ట్రైలర్ ని మెచ్చుకుంటూ, ఓ స్పెషల్ వీడియోని విడుదల చేసారు. మీరు ఆ వీడియోని చూడండి.Grace Randolph ఈ ట్రైలర్ గురించి మాట్లాడుతూ... ఇదొక ఫెయిరీ టేల్ లాగ కనపడుతోంది. హాలీవుడ్ ఆడియన్స్ ని సైతం మెప్పించేలా కనపడుతోందని అన్నారు. ముఖ్యంగా చిత్రంలో వాడిన కాస్ట్యూమ్స్, ఆయుధాల డిజైన్, సెట్స్ , విజువల్ ఎఫెక్ట్ ల గురించి మాట్లాడుతూ... 300 చిత్రం తో పోలుస్తూ రిఫెరెన్స్ తో మాట్లాడారు. ఈ 18 నిముషాల వీడియో ఇప్పుడు బాహుబలి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.


ఇక ఈ చిత్ర హిందీ వెర్షన్ ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు కమ్ నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేశారు. బాహుబలిని ఆర్కా మీడియా సంస్థ నిర్మించింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులు. ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.


Hollywood reviewer about Baahubali

ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.


భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభాస్‌ హీరోగా నటించారు. అనుష్క, తమన్నాహీరోయిన్స్. రానా విలన్ గా కనిపిస్తారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకుడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. కీరవాణి సంగీతం అందించారు.

English summary
Noted reviewer of all the international trailers that release from Hollywood, Grace Randolph of New York, has been praising Rajamouli’s “Baahubali” like anything else. In a special video review of the film’s trailer, she showered huge compliments.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu