twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాలీవుడ్ మూవీ ‘ఎక్స్ మెన్’ విశేషాలు (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అద్భుతమైన హాలీవుడ్ చిత్రాలను రూపొందించే అగ్రగామి సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ సంస్థ అందిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఎక్స్ మెన్-డే ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్'. గతంలో వచ్చిన ఎక్స్ మెన్ సీరిస్ లలో వస్తున్న 7వ చిత్రమిది. తొమ్మిది అద్భుతమైన శక్తులు కలిసి మానవాళిని రక్షించే చిత్రం ఈ 'ఎక్స్ మెన్'.

    రాబోయే కాలంలో ఎలాంటి శక్తుల వల్ల మానవులకు ప్రమాదం వాటిల్లనుందో వాటిని ముందుగానే పసిగట్టి తొమ్మిది చిత్రమైన శక్తులు గల వ్యక్తులతో ప్రపంచ ఫీచర్‌ను మారుస్తారు. గతంలో వచ్చిన ఎక్స్ మెన్ సీరిస్ లలో అనేక విచిత్రమైన క్యారెక్టర్స్‌ని ఒకే చిత్రంలో పొందు పర్చిన చిత్రమిది.

    - వోల్వోరిన్-ఇతను గతంలోకి ఫ్యూచర్‌లోకి వెళ్లగలిగే శక్తిగలిగిన వ్యక్తి.
    - ప్రొఫసర్: ఇతను కళ్లు మూసుకుని గతంలోకి, ఫ్యూచర్‌లోకి వెళ్లి ఏం జరుగుతుందో తెలుసుకుని దానికి తగిన ప్లాన్ చేయగలడు.
    - మ్యాగ్ నెటో: ప్రపంచంలోని అన్ని మెటాలిక్ వస్తువులను అట్రాక్ట్ చేసి దాన్ని శక్తిగా మార్చుకోగలడు. వాటితో యుద్ధం కూడా చేయగలడు
    - మిస్టిక్: ఏ ఆకారంలో అనుకుంటే ఆ ఆకారంలోకి మారగలడు.
    - స్ట్రోమ్: ఈమె ఎలా కావాలంటే అలా విపత్తు సృష్టించగలదు. ఎలాంటి విపత్తు వచ్చినా ఆపగలదు.
    - రోగ్: ఈమె ఏదైనా పట్టుకుంటే అందులోని శక్తులు ఆమెలోకి వస్తాయి.
    - బీస్ట్: ఇతను సూపర్ బలవంతుడు. ఎంత వేగంగానైనా ఒక చోట నుండి మరొక చోటికి వెళ్లగలడు.
    - ఐస్ మెన్: మంచుకొండలను సృష్టించగలడు. అలాంటి కొండలను కరిగించగలడు.
    - బిషప్: ఎంత శక్తినైనా ఎదుటి వారిపై ప్రయోగించగలడు.

    హగ్ జాక్ మెన్

    హగ్ జాక్ మెన్

    హగ్‌జాక్‌మెన్, జేమ్స్ మెక్‌నోవ్ ప్రధాన తారాగణంగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బ్రియన్ సింగర్ దర్శకత్వంలో రూపొందించిన ‘ఎక్స్-మెన్' త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

    గత ఎక్స్ మెన్ సీరిస్ చిత్రాలు

    గత ఎక్స్ మెన్ సీరిస్ చిత్రాలు

    గతంలో వచ్చిన హాలీవుడ్ చిత్రాలు వోల్వోరీన్, ప్రొఫెసర్, మ్యాగ్‌నెటో, మిస్టిక్, స్ట్రోమ్, రోగ్, బీస్ట్, ఐస్‌మెన్, బిషప్ లాంటి చిత్రాలు వచ్చాయి.

    అన్ని శక్తులు కలిపి

    అన్ని శక్తులు కలిపి

    ఇలాంటి విచిత్ర చిత్రమైన ప్రపంచంలో అద్భుత శక్తులతో ఓ కొత్త లోకాన్ని సృష్టించే చిత్రంగా ఎక్స్-మెన్ తొమ్మిదిమంది అద్భుత శక్తులతో రూపొందిందని, ఈ తొమ్మిదిపాత్రలతో రూపొందిన చిత్రమే ‘ఎక్స్-మెన్' అని ఫాక్స్‌స్టార్ స్టూడియో ప్రతినిధి తెలిపారు

    విడుదల తేదీ

    విడుదల తేదీ

    ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మే 23న భారీగా విడుదలకు ముస్తాబు చేస్తున్నామని ఆయన తెలిపారు. మైకేల్ ఫెస్టండల్, జెనీఫర్ లారెన్స్, హెల్‌మెర్రి ఈ చిత్రంలో నటించారు.

    English summary
    This year’s most anticipated and awaited superhero summer flick aka X Men: Days Of Future Past is all set to release on 23rdMay in English Hindi Tamil and Telugu!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X