For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  క్యాబ్ డ్రైవర్ వేధింపులు, కిడ్నాప్ అనుకున్నా.. సంజనా గల్రానీ సంచలనం.. సినిమాలు లేవంటూ దీనంగా!

  |

  బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంజనా గల్రానీ ఆ తర్వాత అనేక తెలుగు సినిమాల్లో చేసినా పెద్ద క్రేజ్ మాత్రం తెచ్చుకోలేక పోయింది. అయితే కన్నడ ఇండస్ట్రీలో మాత్రం మంచి సినిమాలు చేస్తూ ఈ భామ పేరు తెచ్చుకుంది. కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడో ఎంటర్ అయిన సంజన అక్కడ కలిసి రాకపోవడంతో తెలుగు సినిమాల మీద కూడా దృష్టి పెట్టింది. ఇక ఈ మధ్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలు జీవితం గడిపి వచ్చిన ఆమె ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

  జైలుకు వెళ్ళొచ్చి

  జైలుకు వెళ్ళొచ్చి


  సంజనా గల్రానీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బుజ్జిగాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా తెలుగులో చాలా సినిమాలు చేసినా పెద్దగా ఈ భామకు లక్ మాత్రం కలిసి రాలేదు. గత ఏడాది నుంచి అనేక వివాదాల్లో చిక్కుకుని ఏకంగా డ్రగ్స్ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించిన ఆమె మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి చూస్తోంది.

  ఓలా క్యాబ్‌ డ్రైవర్‌తో గొడవ

  ఓలా క్యాబ్‌ డ్రైవర్‌తో గొడవ


  అయితే తాజాగా నటి సంజన గల్రాని ఈసారి ఓలా క్యాబ్‌ డ్రైవర్‌తో గొడవ పడ్డారు. మంగళవారం ఉదయం షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లడానికి బెంగళూరులోని ఇందిరానగర నుంచి రాజరాజేశ్వరినగరకు సంజన క్యాబ్‌ బుక్‌ చేశారు. క్యాబ్‌లోకి ఎక్కిన తరువాత వెళ్ళాసిన లొకేషన్ మార్చాలని డ్రైవర్‌ సుసయ్‌ మణికి సూచించగా, అతడు కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి అడిగాడు కానీ లొకేషన్‌ మార్చలేదు. దీంతో ఉక్రోషంతో ఊగిపోయిన సంజన డ్రైవర్ పై తిట్ల దండకం మొదలుపెట్టింది.

  రివర్స్ ఫిర్యాదు

  రివర్స్ ఫిర్యాదు

  ఇక ఆ తర్వాత నానా తిట్లు తిడుతూ అతడితో గొడవ పెట్టుకుందని అకారణంగా సంజన తనను దూషించిందని డ్రైవర్‌ ఆరోపించాడు. సంజన తనతో గొడవపడటాన్ని వీడియో తీశాడు. అనంతరం రాజరాజేశ్వరి నగర పోలీసులకు సదరు డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉంటే సదరు క్యాబ్ డ్రైవర్ తాను చెప్పిన చోటుకు తీసుకెళ్లలేదని సంజన సోషల్ మీడియాలో ఆరోపించారు.

  ట్విట్టర్ లో ఏమందంటే?

  ట్విట్టర్ లో ఏమందంటే?

  ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో వెల్లడించారు. కారులో ఏసీని పెంచాలని అడిగితే డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని, కారు డోర్‌ కూడా సరిగాలేదని సంజనా ఆరోపించారు. అడిగినంత డబ్బులు ఇచ్చి కూడా ఇటువంటి డొక్కు కార్ లో వెళ్లాలా అని సంజన రాసుకొచ్చింది. ఈ వివాదంలో తప్పు ఎవరిదైనా పరస్పరం పోలీసు కంప్లైంట్స్ ఇచ్చుకున్న క్రమంలో పోలీసులు ఏం చేయనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

  సినిమాలు కూడా లేవు

  సినిమాలు కూడా లేవు

  ఇక అతను నన్ను కిడ్నాప్ చేస్తాడని నేను భయపడ్డానని అన్నారు. నాకు కారు లేదన్న ఆమె సినిమా షూటింగులు జరగడం లేదని, ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నానని అని సంజన చెప్పారు. 'మహిళలు మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు. అని ఎవరూ అడగకూడదని నేను చెప్తున్నాను. మీరు దానిని తప్పుగా తీసుకుంటే నేనేం చేయలేనని అన్నారు.

  Recommended Video

  Sanjana Galrani డ్రగ్స్‌ కేసు పై స్పందించిన హీరోయిన్ సంజన | Interview Part 3
  నేను చెడ్డదాన్ని అయ్యాను

  నేను చెడ్డదాన్ని అయ్యాను

  ఇక GPS మార్గం ప్రకారం తీసుకు వెళ్లకుండా రాంగ్ రూట్‌కి తీసుకెళ్లాడని నేను ఫిర్యాదు చేస్తే వారి జీవితాలు నాశనం అవుతాయి కానీ ఇప్పుడు డ్రైవర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. నేను చెడ్డదాన్ని అంటూ అతను ఫిర్యాదు చేశాడు. అతను తన తల్లి మరియు సోదరి విషయంలో కూడా ఇలా చేస్తారా? అని ప్రశ్నించారు.

  English summary
  Sanjjanaa Galrani fight with ola Cab Driver and Case Registered in Bengaluru RR Nagar Police Station.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X