కోరుకోని కోరికేదో తీరనున్నది.. రంగ్ దే అంటూ కీర్తి సురేష్‌తో నితిన్ రొమాన్స్
భీష్మ లాంటి సూపర్ హిట్ తర్వాత యువ హీరో నితిన్, మిస్ ఇండియా తర్వాత కీర్తి సురేష్ కలిసి నటించిన చిత్రం రంగ్‌దే. ఇటీవల యూత్ స్టార్ నితిన్ పెళ్లి సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ రంగ్ దే చిత్రం నుంచి ఓ వీడియోను రిలీజ్ చేయగా... దాదాపు 14 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించడం విశేషంగా మారింది. తాజా దీపావళీ పండుగ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి తొలి గీతాన్ని వీడియో రూపంలో చిత్ర యూనిట్ విడుదల చేసింది.
యువతీ, యువకులును విశేషంగా ఆకట్టుకొనే విధంగా రంగ్ దే పాటకు రచయిత శ్రీమణి సాహిత్యం అందించారు. గాయకులు హరిప్రియ, కపిల్ కపిలన్ గీతాన్ని ఆలపించారు. దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ గీతానికి అందించిన స్వరాలు సంగీత ప్రియులను ఎంతగానో అలరించేలా ఉన్నాయి. ఇక పాట విషయానికి వస్తే.. 'ఏమిటో ఇది వివరించలేనిది, మది ఆగమన్నది తనువాగనన్నది, భాష లేని ఊసులాట సాగుతున్నది, అందుకే ఈ మౌనమే ఓ భాష అయినది, కోరుకోని కోరికేదో తీరుతున్నది' అంటూ పాట సాగింది. ఈ పాటను నితిన్, కీర్తి సురేష్‌పై రొమాంటిక్ మెలోడీ గీతంగా దర్శకుడు వెంకీ అట్లూరి చిత్రీకరించారు.

రంగ్ దే చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను త్వరలోనే దుబాయ్‌లో చిత్రీకరించనున్నారు. దాంతో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. పరిస్థితులన్నీ సానుకూలంగా ఉంటే 2021 సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల చేయాలనే ప్లాన్‌తో యూనిట్ ముందుకెళ్తున్నది. హీరో నితిన్, హీరోయిన్ కీర్తి సురేష్ కలిసి నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' నిర్మిస్తున్నది.
నటీనటులు: నితిన్, కీర్తి సురేష్, నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు
నిర్మాత:సూర్యదేవర నాగవంశీ
రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి
సమర్పణ: పిడివి ప్రసాద్
సినిమాటోగ్రఫి: పిసి శ్రీరామ్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్: నవీన్ నూలి
అర్ఠ్: అవినాష్ కొల్లా.
అడిషనల్ స్క్రీన్ ప్లే: సతీష్ చంద్ర పాశం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం (వెంకట్)


Click it and Unblock the Notifications











