twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్టోబర్ 1న 'ఆర్య-2'

    By Staff
    |

    'పరుగు' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత అల్లు అర్జున్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం 'ఆర్య 2'. కాజల్ కథానాయిక. నవదీప్, శ్రద్ధాదాస్ మరో జంటగా నటిస్తున్నారు. ఆదిత్య ఆర్ట్స్ బ్యానర్ పై ఆదిత్య బాబు, భోగవల్లి ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2004లో విజయవంతమైన 'ఆర్య' చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక పబ్ సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ పాటను శుక్రవారం నుంచి అన్నపూర్ణా స్టూడియోస్ లో వేసిన పబ్ సెట్ లో చిత్రీకరిస్తామని ఆదిత్యబాబు తెలిపారు.

    యూత్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారనీ, 'ఆర్య' చిత్రం తరహాలోనే ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టకుంటుందనీ ఆయన చెప్పారు. దేవీశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతంను అందజేశారనీ, త్వరలోనే ఆడియో విడుదల చేసి అక్టోబర్ 1న సినిమా రిలీజ్ చేస్తామని తెలిపారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తొలిసారి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రను పోషిస్తుండగా, తమిళ హీరో ఆర్య విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో గుండు హనుమంతరావు, జెన్నీ, తిలక్, వినోద్, జూనియర్ రేలంగి, అన్నపూర్ణ తదిరులు నటిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X