twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Alia Bhatt and Ranbir Wedding కోసం సర్వం సిద్దం.. మెహందీ, సంగీత్, రిసెప్షన్ ఎప్పుడంటే?

    |

    బాలీవుడ్‌లో యువ హీరో, హీరోయిన్లు ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ పెళ్లికి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది అత్యంత క్రేజీగా మారిన ఈ పెళ్లి కోసం ఆర్‌కే స్టూడియోస్, కృష్ణ రాజ్ కపూర్ నివాసాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. కళ్లు మిరుమిట్లు గొలిపే విధంగా లైటింగ్, డేకరేషన్‌తో అలంకరిస్తున్నారు. ఏప్రిల్ 14న జరుగనున్నట్టు వార్తలు వస్తున్న ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ పెళ్లికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్లోకి వెళితే..

    ఎంత మంది అతిథులంటే?

    ఎంత మంది అతిథులంటే?

    ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ పెళ్లికి ఆహ్వానితుల జాబితాపై భారీగా చర్చ జరుగుతున్నది. అంగరంగ వైభవంగా జరిగే వేడుక కోసం 45 నుంచి 50 మంది గెస్గులను ఆహ్వానించినట్టు సమాచారం. అయితే ఆలియాభట్ సోదరుడు రాహుల్ భట్ మాత్రం కేవలం 28 మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నాం అని చెప్పడం గమనార్హం.

    ఈ పెళ్లికి కపూర్, భట్ కుటుంబానికి సంబంధించిన కొద్ది మంది మాత్రమే హాజరవుతారని వార్తలు వెలువడుతున్నాయి. ఆహ్వానితుల జాబితాలో కరణ్ జోహర్, ఆయన్ ముఖర్జీ తదితరులు ఉన్నట్టు సమాచారం.

    మెహందీ, హల్దీ వేడుకలు తేదీలు ఇలా.

    మెహందీ, హల్దీ వేడుకలు తేదీలు ఇలా.

    రణ్‌బీర్, ఆలియా పెళ్లిలో భాగంగా మెహందీ, సంగీత్, హల్దీ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలను చెంబూర్‌లోని ఆర్కే హౌస్‌లో నిర్వహించనున్నట్టు సమాచారం. ఏప్రిల్ 13న మెహందీ, ఏప్రిల్ 14న హల్దీ వేడుకలు నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

    సంగీత్ కోసం భారీగా ఏర్పాట్లు

    సంగీత్ కోసం భారీగా ఏర్పాట్లు

    పెళ్లికి ముందు ఇరు కుటుంబాల సభ్యులు హాజరయ్యే సంగీత్ వేడుక కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు సమాచారం. ఇక రణ్‌బీర్, ఆలియా పెళ్లి పంజాబీ మత ఆచారం ప్రకారం సంప్రదాయంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

     మనీష్ మల్హోత్రా, సవ్యసాచి డిజైనర్ దుస్తులు

    మనీష్ మల్హోత్రా, సవ్యసాచి డిజైనర్ దుస్తులు

    ఆలియా భట్, రణ్‌బీర్ పెళ్లి కోసం డిజైనర్ దుస్తులు కూడా సిద్దమయ్యాయి. ఆలియాభట్ కోసం సవ్యసాచి డిజైన్ చేస్తున్నారు. అలాగే మనీష్ మల్హోత్రా కూడా కొన్ని దుస్తులు సిద్దం చేసినట్టు సమాచారం. ఆలియా కోసం మనీష్ ప్రత్యేకంగా లహెంగా, దుపట్టా డిజైన్ చేశారు. ఈ డిజైనర్ దుస్తుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

    రిసెప్షన్ ఎక్కడ? ఎప్పడంటే?

    రిసెప్షన్ ఎక్కడ? ఎప్పడంటే?

    పెళ్లి తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు భారీగా విందును రణ్‌బీర్, ఆలియా భట్ ఇవ్వనున్నారు. ఈ విందు కోసం ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్‌ సిద్దమవుతున్నది. ఆలియా, రణ్‌బీర్ రిసెప్షన్ ఏప్రిల్ 17వ తేదీన జరుగుతుందని సన్నిహితులు పేర్కొన్నారు.

    English summary
    Bollywood stars Alia Bhatt and Ranbir Kapoor Wedding will happend on April 14th. Reception will be held at Taj Mahal palace on April 17th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X