»   » కామెడీ స్టార్ అల్లరి నరేష్ పెళ్లి విశేషాలు!

కామెడీ స్టార్ అల్లరి నరేష్ పెళ్లి విశేషాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లోని బ్యాచిలర్ హీరోలంతా ఒక్కొక్కరుగా వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. గడిచిన రెండు మూడేళ్లుగా జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, గోపీచంద్ తదితరులు ఓ ఇంటి వారయ్యారు. మిగిలిన బ్యాచిలర్ హీరోలు సైతం వివాహానికి సిద్దం అవుతున్నారు.

టాలీవుడ్ కామెడీ స్టార్ హీరో అల్లరి నరేష్ విషయానికొస్తే....అల్లరి నరేష్ కుటుంబ సభ్యులు అతడి కోసం సంబంధాలు చూసే పనిలో తలమునకలై ఉన్నారట. అల్లరి నరేష్ అభిరుచికి తగిన అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారట. తనకు మోడ్రన్ ఉంటూ పార్టీలు పబ్బులూ అంటూ తిరిగే అమ్మాయి అవసరం లేదని, కుటుంబ వ్యవహారాలను బాధ్యతగా చక్కబెట్టే సాంప్రదాయ బద్దమైన అమ్మాయి కావాలని అల్లరి నరేష్ కోరుకుంటున్నాడట.

ఈ మేరకు అల్లరి నరేష్ కోరుకుంటున్న లక్షణాలు ఉన్న అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారట. కోస్తాంధ్ర ప్రాంతంలో అల్లరి నరేష్‌కు సరిజోడీగల అమ్మాయి కోసం వెతుకుతున్నారట. అమ్మాయిని చూసే బాధ్యతను నటుడు చలపతిరావుతో పాటు, అల్లరి నరేష్ బంధువైన అమ్మిరాజు అనే వ్యక్తి భుజానేసుకున్నట్లు తెలుస్తోంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆరు నెలలు లేదా ఏడిదిలోపే టాలీవుడ్ అల్లరోడి పెళ్లి భాజా మ్రోగే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా వరుస సినిమాలతో బాక్సాఫీసును తన కామెడీ పంచ్ లతో హోరెత్తించిన అల్లరి నరేష్ జోరు ప్రస్తుతం కాస్త తగ్గింది. ఈ సంవత్సరం నరేష్ నటించిన సినిమాలు రెండు మాత్రమే విడుదలయ్యాయి.

English summary
Allari Naresh marriage plans revealed. According to sources, a vigorous hunt is on to get the right kind of girl for Naresh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu