ఈ రోజే ముంబైలో ...'బాహుబలి' రచ్చ

By Srikanya

హైదరాబాద్: ముంబయి కామిక్‌కాన్‌ ఉత్సవంలో 'బాహుబలి' సందడి చేయబోతున్నాడు. అందులో 'బాహుబలి' నిర్మాణానికి సంబంధించిన మూడు నిముషాల ప్రత్యేకమైన వీడియోను ప్రదర్శిస్తారు. ఈ రోజు( 21న) ముంబయిలో ఆ ప్రదర్శన జరగబోతోంది. చిత్రం హీరో రానాతో పాటు కళా దర్శకుడు సాబు సిరిల్‌, వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాస్‌ మోహన్‌ తదితరులు పాల్గొంటారు. కామిక్‌ కాన్‌లో జరగనున్న ప్యానెల్‌ చర్చావేదికలోనూ యూనిట్ పాల్గొంటుంది. సినిమాకు సంబంధించిన అనుభవాల్ని ఆ వేదికపై పంచుకొంటుంది యూనిట్.

https://www.facebook.com/TeluguFilmibeat

'Baahubali' video at Comic Con, Mumbai ; Rana Daggubati to Attend

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బాహుబలి'. ప్రభాస్‌ హీరో. అనుష్క, తమన్నా, రానా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. బల్గేరియాలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ ప్రభాస్‌, తమన్నాపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఆ షెడ్యూల్‌ పూర్తయిన వెంటనే నిర్మాణానంతర కార్యక్రమాలపై దృష్టిపెడతారు.

మనిషి తలచుకుంటే సాధించలేనిది లేదు. అయితే ఆ తలపు అత్యాశతో కూడినదైతే ఆ మనిషికి రేపు అనేది ఉండదు. ఈ అంశంతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. గతంలో రాజుల నేపథ్యంలోనూ ఇలాంటి కథలు తీశారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఇలాంటి అంశంతోనే 'బాహుబలి'ని రూపొందిస్తున్నారు.

'Baahubali' video at Comic Con, Mumbai ; Rana Daggubati to Attend

ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రధారులు. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. ఈ చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్‌, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X