»   » ఆ ఇద్దరు దూరమయ్యారు.. హరికృష్ణను తలుచుకొని.. నాగార్జున ఉద్వేగం

ఆ ఇద్దరు దూరమయ్యారు.. హరికృష్ణను తలుచుకొని.. నాగార్జున ఉద్వేగం

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'. ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో నాగవంశీ.ఎస్‌, పి.డి.వి.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

  ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. గత నెల నా మనసుకు దగ్గరైన ఇద్దరూ వదలి వెళ్లిపోయారు. హరి అన్నయ్య. ఎవరినైనా నేను అన్నా!.. అని పిలుస్తాను అంటే తననే. మా బాధ్య, బంధం మీకు చెప్పుకోలేను. ఆయన వెళ్లిపోయిన రోజు.. నా పుట్టినరోజు. పొద్దున నిద్ర లేవగానే తెలిసిన న్యూస్‌. ఎలా కనెక్ట్‌ చేసుకోవాలో అర్థం కావడం లేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.

  Harikrishna death: Nagarjuna gets emotional in Shailaja Reddy Alludu pre release

  అలాగే మా ఆత్మీయుడు, అక్కినేని అభిమాన సంఘం అధ్యక్షుడు రవీందర్‌ రెడ్డి గారు కొద్దిరోజుల క్రితం మరణించారు. ఆయన మా నుంచి దూరం కావడంతో చాలా మిస్‌ అవుతున్నాం. మాకు సంబంధించి ఏ ఫంక్షన్‌ ఉన్నా ఆయన ముందుండేవారు. ఆయన ఆత్మకు కూడా శాంతి కలగాలి.

  నాన్న గారి దగ్గరనుంచి రవీందర్ రెడ్డి మా ఫ్యామిలీకి అభిమానిగా ఉన్నారు. నేను సినిమాల్లోకి వస్తున్నాను అంటే మొదట కంగ్రాట్స్ చెప్పింది ఆయనే అని నాగ్ గుర్తు చేసుకున్నారు. ఆయన మరణించడంతో ఇటీవలే వారి ఫ్యామిలీని కూడా కలిశానని నాగ్ తెలిపారు.

  ఇక సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా నిండా నవ్వులే. ఎక్కడా సాంగ్‌ ఉండాలి. ఎక్కడ ఫైట్‌ ఉండాలి. ఎక్కడ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండాలో తెలిసిన దర్శకుడు మారుతి చేసిన సినిమా. చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

  English summary
  Shailaja Reddy Alludu starring Naga Chaitanya, Ramya Krishnan & Anu Emmanuel, Directed by Maruthi has completed its entire Shoot (except one song) and gearing up for August 31st Release. The film is produced by Naga Vamsi S & PDV Prasad under Sithara Entertainments, Presented by S. Radha Krishna(Chinababu). On September 9th, this movie's pre release event organised. In this occassion, Nagarjuna Akkineni speech went emotionally.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more