»   » ‘మా’ ఎన్నికలు దారుణంగా ఉన్నాయి : జయసుధ

‘మా’ ఎన్నికలు దారుణంగా ఉన్నాయి : జయసుధ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికలు ఇంత దారుణంగా ఉంటాయని అనుకోలేదని ‘మా' అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జయసుధ వ్యాఖ్యానించారు. మురళీ మోహన్ పోటీ చేయమంటేనే పోటీ చేస్తున్నాను, అలా అని ఆయన చెప్పినట్లే వింటాను అనుకోవద్దు అన్నారు. శుక్రవారం ఫిల్మ్ చాంబర్లో జయసుధ తన ప్యానెసల్ సభ్యులైన పరుచూరి వెంకటేశ్వరరావు, నరేష్, శివకృష్ణ తదితరులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

జయసుధ మాట్లాడుతూ...మా ఎన్నికల ఇంత దారుణంగా ఉంటాయని అనుకోలేదు, సినీ పరిశ్రమలో మంచి చెడూ నాకు తెలుసు, ప్రస్తుత రాజకీయాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అని వ్యాఖ్యానించారు. ఉన్న కళాకారుల్లో ఎవరికి ఏది అవసరమో అదే చేస్తాం, దొంగ హామీలు ఇవ్వం అని వ్యాఖ్యానించారు.

అసోసియేషన్లొ అవకతవకలు ఎక్కడ జరిగాయన్నది తెలుసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. గెలిచిన తర్వాత ఇత చేస్తాను అంత చేయాలని చెప్పను. ఇదేమీ రాజకీయ ఫ్లాట్ ఫాం కాదు అన్నారు జయసుధ. సినీ పరిశ్రమలో పిల్లల పెళ్లిళ్లు చేయడానికి సహకరిస్తామన్నారు.

Jayasudha pressmeet about MAA election

‘మా' ఎన్నికల కోసం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవాల్సిన పని లేదన్నారు. వివిధ ప్రాంతాల్లో కల్చరల్ పోగ్రాములు చేసి ఫండ్ కలెక్ట్ చేస్తామన్నారు. ‘మా' అసోసియేషన్ కోసం బిల్డింగు కంటే ముందు పెన్షన్లు, ఇన్సూరెన్సు, ఎమర్జెనీ వస్తే ఎంత మందికి హెల్ప్ చేయగలం అనే విషయాల గురించి ఆలోచిస్తామన్నారు. సినీ కార్మికుల కోసం గ్రీవెల్స్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. పేద కళాకారులకు సహాయం చేస్తాం. అసోసియేషన్ సభ్యుల్లో చిన్నా పెద్దా తేడా ఏమీ లేదన్నారు. నన్ను ఉద్దేశించి ఎగతాళి మాట్లాడుతున్నారు. నేనూ మాట్లాడగలను...నేను మాట్లాడటం మొదలు పెడితే చాలా మంది బాధ పడతారు. పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జయసుధపై నమ్మకం ఉంది, ఆమెలో కసి కనిపిస్తోంది....ఆమె ‘మా' అధ్యక్షకురాలిగా ఎన్నికయితే కళాకారులకు మంచి జరుగుతుందన్నారు.

Read more about: tollywood, jayasudha, rajendra prasad
English summary
Jayasudha panel pressmeet held today at film chamber about MAA election.
Please Wait while comments are loading...