»   » కనీసం ఇక్కడైనా న్యాయం జరిగింది.. జూ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ హాపీ!

కనీసం ఇక్కడైనా న్యాయం జరిగింది.. జూ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ హాపీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల ప్రకటించిన సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్(సైమా)-2016 నామినేషన్స్ విషయంలో యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ కు అన్యాయం జరిగింది అనేది చాలా మంది అభిమానుల వాదన. ఎన్టీఆర్ కు కనీసం బెస్ట్ యాక్టర్స్ కేటగిరీలో నామినేషన్ కూడా దక్కక పోవడమే ఇందుకు కారణం.

ఈ విషయమై సోషల్ మీడియాలో చాలా పెద్ద డిబేటే జరిగింది. నామినేషన్ల ఎంపిక సరిగా జరుగలేదని, ఈ విషయంలో నిర్వహకులు పక్షపాతంగా వ్యవహరించారని ఇంటర్నెట్లో ఫ్యాన్స్ వాదించారు. అయితే సైమా నిర్వాహకులు మాత్రం ఈ విషయమై పెద్దగా స్పందించలేదు.

ntr

సైమా తీరుతో అసంతృప్తిగా ఉన్న అభిమానులకు... ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డు నామినేషన్ల ప్రకటనతో చాలా హ్యాపీగా ఉన్నారు. జూ ఎన్టీఆర్ ను 'టెంపర్' చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్స్ నామినేషన్స్ లిస్టులో ఎంపిక చేసారు. టెంపర్ చిత్రంలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టారు. ఈ సారి తమ హీరోకు అవార్డు ఖాయం అని అంటున్నా ఫ్యాన్స్.

ఈ నామినేషన్ల లిస్టుల ఇంకా అల్లు అర్జన్(సన్నాఫ్ సత్యమూర్తి), మహేష్ బాబు(శ్రీమంతుడు), నాని (భలే భలే మగాడివోయ్) , ప్రభాస్(బాహుబలి) లు కూడా ఉన్నారు. ఆన్ లైన్ ఓటింగ్, ఇతర సర్వేల ద్వారా ఎవరు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే వారికే బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కనుంది.

English summary
Tollywood young tiger Jr NTR Name Nominated for Filmfare best actor in telugu awards.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu