»   » మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య నెక్ట్స్ ‘మంచోడు’

మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య నెక్ట్స్ ‘మంచోడు’

Posted By:
Subscribe to Filmibeat Telugu
Naga Chaitanya Next Movie Announced నాగ చైతన్య ఎంత ‘మంచోడు’..

చిన్న సినిమాలు చేస్తూ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతి త్వరలో నాగ చైతన్య హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. 'బాబు బంగారం, ప్రేమమ్' వంటి సినిమాలను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

తొలినాళ్లలో మారుతి చిన్న సినిమాలతో సక్సెస్ సాధించినా... అతడి సినిమాల్లో బూతు కంటెంటు ఎక్కువగా ఉందనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రూటు మార్చిన మారుతి ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ సినిమాలు చేయడం మొదలు పెట్టారు. 'భలే భలే మగాడివోయ్', 'బాబు బంగారం', 'మహానుభావుడు' లాంటి ఫ్యామిలీ ఎంటర్టనర్స్ రూపొందించారు.

 Naga Chaitanya and Maruthi film titled Manchodu

నాగ చైతన్య హీరోగా తెరకెక్కించనున్న తన తదుపరి సినిమాకి కూడా టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి 'మంచోడు' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో కథానాయికగా మేఘా ఆకాశ్ పేరు వినిపిస్తోంది.

ప్రస్తుతం మారుతి 'మహానుభావుడు' పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత 'మంచోడు' ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

English summary
Naga Chaitanya and director Maruthi are coming together for a special film. The script of the film is in its final shape.The film titled Manchodu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu