twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదే మన అత్యున్నత బాధ్యత.. రక్తదానం చేసిన నాగబాబు

    |

    నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం. ప్రపంచంలోని కొన్నింటిని మార్చలేం. అది కాక పోతే ఇది, ఇది కాకపోతే అది చాయిస్ ఉండొచ్చు. కానీ మనిషి రక్తానికి మాత్రం ఆ అవకాశం లేదు. మనిషి బతకాలంటే రక్తం కావాల్సిందే. అందుకే రక్తానికి, రక్తం దానం చేసే వారిని సమాజంలో ఎంతో విలువ ఉంటుంది. రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు. రక్తం విలువ తెలిసిన వాడు కాబట్టే మెగాస్టార్ చిరంజీవి అందరి కంటే ముందుగా వచ్చాడు. ఓ మంచిపనికి శ్రీకారం చుట్టాడు. తనకున్న అశేష అభిమాన గణం చేత రక్తదానం చేయింది ఎన్నో లక్షల మందికి ప్రాణాలు పోశాడు.

    నేటి ఈ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మెగా ఫ్యామిలీ ఓ సందేశాన్ని ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఇంతవరకు తాను రక్తదానం చేసిన ఫోటోలన్నీ కలిపి వీడియో రూపంలో వదిలాడు. దీంతో పాటు.. ఒకరి ప్రాణాన్ని కాపాడటం కంటే సంతృప్తికరమైన గొప్ప విషయం మరొకటి ఏం ఉంటుంది.. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని, ప్రజలు రక్తదానం చేస్తున్నారని విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది, దేవుడు మానవాళికి ఇచ్చిన సూపర్ పవర్ ఇదే అంటూ రక్తదానం చేస్తున్న శక్తివంతులకు కృతజ్ఞతలు రక్తదానం చేయండి ప్రాణ దాతలు కండి అంటూ మెగాస్టార్ ఓ సందేశాన్ని ఇచ్చాడు.

    Nagababu Donated Blood On World Blood Donor Day 2020

    తాజాగా మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. తాను రక్తదానం చేసిన విషయాన్ని తెలిపాడు. ఈ మేరకు ఓ పోస్ట్ చేస్తూ.. ఓ ప్రాణాన్ని కాపాడేందుకు రక్త దానం చేయండి. కోవిడ్ 19 లాంటి క్లిష్ట పరిస్థితిలోనూ రక్త దానం చేయడమనేది అత్యున్నత బాధ్యత. ఈ విపత్కర పరిస్థితి వల్ల రక్తం దానం చేసే వారి సంఖ్య తగ్గింది. కానీ రక్తం అవసరమైన వారి సంఖ్య మాత్రం అలాగే ఉంది. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని గుర్తించండి. నా వంతుగా అన్ని జాగ్రత్తలు తీసుకుని రక్త దానం చేశాను. మీరు కూడా చేయాలని కోరుతున్నా'ని తెలిపాడు.

    English summary
    Nagababu Donated Blood On World Blood Donor Day 2020. He says that “Donate your blood for a reason, let the reason be life”Donating blood amidst Covid-19 is our highest responsibility... The donation has reduced due to the pandemic but the requirement for blood remains the same.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X