twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    #ఆర్ఆర్ఆర్: రామ్ చరణ్- ఎన్టీఆర్ పాత్రల సీక్రెట్ లీక్, నరనరాల్లో దేశభక్తి...

    |

    రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ విషయంలో కొంతకాలంగా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన విషయాలు బయటకు పొక్కకుండా రాజమౌళి, చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

    ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలు సినిమాలో ఎలా ఉండబోతున్నాయి? వారి గెటప్స్ ఏమిటి? అనే విషయంలో క్యూరియాసిటీ ఓవైపు హై రేంజిలో ఉండగా.... తాజాగా ఓ ఆసక్తికర కథనం ప్రచారంలోకి వచ్చింది. అందులోని విషయాలు అభిమానులను ఉత్తేజ పరిచే విధంగా ఉన్నాయి. ఇందులో నిజం ఎంత? అనేది తేలాల్సి ఉంది.

    సినిమా బ్యాక్ డ్రాప్ ఏమిటంటే...

    సినిమా బ్యాక్ డ్రాప్ ఏమిటంటే...

    ఈ సినిమా బ్యాక్‌ డ్రాప్ విషయానికొస్తే... 1920 నాటి కథాంశంతో ఈ సినిమా ఉండబోతోందని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగే పోరాటం నేపథ్యంలో సినిమా ఉంటుందని అంటున్నారు. ఇందులో దేశ భక్తులుగా చరణ్, ఎన్టీఆర్ కనిపించబోతున్నారట.

    దొంగ పాత్రలో ఎన్టీఆర్

    దొంగ పాత్రలో ఎన్టీఆర్

    బ్రిటిష్ వారి సంపదను కొల్లగొట్టే దొంగ పాత్రలో ఈ చిత్రంలో ఎన్టీఆర్ కనిపిస్తారని సమాచారం. బ్రిటిష్ వారిని ముప్పతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లుతాగించే రేంజిలో యంగ్ టైగర్ రోల్ ఉంటుందని టాక్.

    పోలీస్ పాత్రలో రామ్ చరణ్

    పోలీస్ పాత్రలో రామ్ చరణ్

    బ్రిటిష్ ప్రభుత్వంలో పని చేసే పోలీస్ పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడని, అయితే బ్రిటిష్ వారి తరుపున పని చేస్తున్నా నరనరాల్లో దేశ భక్తితో ఉండే పాత్రలో మెగా పవర్ స్టార్ కనిపించబోతున్నారని అంటున్నారు.

    విజేంద్ర ప్రసాద్ అద్భుతమైన స్టోరీ

    విజేంద్ర ప్రసాద్ అద్భుతమైన స్టోరీ

    బాహుబలి సినిమాకు కథ అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. స్టోరీ సైతం ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా ఉంటుందని, కల్పిత కథే అయినా స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన అంశాలు అద్భుతంగా ఉంటాయని టాక్.

    గండిపేటలో స్పెషల్ సెట్స్

    గండిపేటలో స్పెషల్ సెట్స్

    ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అప్పటి కాలానికి సంబంధించి సెట్స్ గండిపేట ప్రాంతంలో నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మేజర్ షెడ్యూల్ ఇక్కడే జరుగుతుందని తెలుస్తోంది.

    రూ. 300 కోట్ల భారీ బడ్జెట్

    రూ. 300 కోట్ల భారీ బడ్జెట్

    రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బడ్జెట్ ఈ రేంజిలో ఉందంటే సినిమా ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాను మించిపోయేలా ఈ చిత్రం ఉండటం ఖాయం.

    English summary
    The latest buzz is that Rajamouli's RRR movie is a periodic drama set against the backdrop of the 1920s. Ram Charan and NTR are said to be playing as patriotic individuals. It is rumoured that Jr NTR will appear as a thief, while Ram Charan essays the role of as a cop, who works for the Britishers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X