Just In
Don't Miss!
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Sports
ఆ రెండు జట్లు సంజూ శాంసన్ ఇవ్వమన్నాయి.. అందుకే రాజస్థాన్ అలా చేసింది!
- Finance
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటా
- News
గ్రేటర్ మేయర్ నోటిఫికేషన్ రిలీజ్.. 11వ తేదీన సభ్యుల ప్రమాణం, అదేరోజు ఎన్నిక
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జూ.ఎన్టీఆర్ అదుర్స్ ( ‘టెంపర్’ కొత్త ఫొటోలు)
హైదరాబాద్: శివబాబు బండ్ల సమర్పిస్తున్న సినిమా ‘టెంపర్'. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేశ్ నిర్మాత. ఈ సినిమా ఈ రోజు ఆడియో ఫంక్షన్ జరగనుంది. దాంతో ఈ చిత్రానికి సంభందించిన కొన్ని కొత్త ఫొటోలు విడుదల చేసారు.
ఈ ఫొటోల లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందని చూసిన వారంతా అంటున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలలో సైతం ఈ ఫొటోలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇదిగో ఇక్కడ ఆ కొత్త ఫొటోలను ఇస్తున్నాం. మీరూ ఓ లుక్కేయండి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది..ఇదిలా ఉంటే...ఈ సినిమా ఆడియో విడుదలపై పలు తేదీలు వార్తల్లో వినిపించాయి. అయితే జనవరి 28న అంటే ఈ రోజు ఈ చిత్ర ఆడియోని విడుదల చేయడానికి ఫైనలైజ్ చేసి , సన్నాహాలు చేస్తున్నారు. సినిమా మాత్రం ఫిబ్రవరి 13న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
ఫొటోలు స్లైడ్ షోలో...

హిట్ అవసరం
ఇప్పుడు ఎన్టీఆర్ కు డెస్పరేట్ గా హిట్ అవసరం..ఈ నేపధ్యంలో ఈ చిత్రం వస్తూండటంతో అందరి దృష్టీ దీనిపైనే ఉంది

డైలాగులు
పూరి అంటేనే పవర్ ఫుల్ డైలాగులు అని అర్దం. ఈ చిత్రంలోనూ అలాంటి డైలాగులకు లోటు ఉండదని అంటున్నారు.

కాజల్ కాంబినేషన్
గతంలోనూ ఎన్టీఆర్, కాజల్ కాంబినేషన్ లో బాద్షా చిత్రం వచ్చింది. దాంతో ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి

పూరి మార్క్
సినిమా టీజర్ లో ఇప్పటికే పూరి మార్క్ డైలాగులు అభిమానులను అలరిస్తున్నాయి.

ఇప్పటికే..
న్యూఇయర్ వేడుకగా ప్రేక్షకులకు టెంపర్ టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌కు యుట్యూబ్‌లో మంచి ఆదరణతో పాటు ఒక్కరోజులోనే రెండు లక్షలకుపైగా క్లిక్స్ వచ్చాయంటే అభిమానులు ఏ రేంజ్‌లో ఈ సినిమాను ఆశిస్తున్నారో అర్ధమౌతుంది.

ప్రకాష్ రాజ్
ఈ చిత్రంపై నటుడు ప్రకాష్‌రాజ్ తనదైన శైలిలో సోషల్ నెట్‌వర్క్‌లో కామెంట్లు చేశారు. ‘‘టెంపర్‌లో కొన్ని సీన్లు చూశాను. డార్లింగ్ తారక్ మెరిసాడు. పూరి, తారక్ కాంబినేషన్‌లో ఇంతకుముందు ఎన్నడూ లేనంత విధంగా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తారు'' అని ట్వీట్ చేశారు.

డిఫెరెంట్ గా...
ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంటుగా, ఎంతో పవర్ ఫుల్‌గా ఉంటుంది.

ప్రతిష్టను..
ఈ సినిమా బేనర్ ప్రతిష్టను మరింత పెంచే సినిమా అవుతుంది.

బండ్ల గణేష్ మాట్లాడుతూ...
అలాగే ఎన్టీఆర్ గారి కెరీర్లో, పూరి జగన్నాథ్ గారి కెరీర్లో, నా కెరీర్లో ‘టెంపర్' బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న నమ్మకం నాకు ఉంది అన్నారు.

పోస్ట్ ప్రొడక్షన్..
ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఆర్ నారాయణ మూర్తి నో
అలాగే.. ‘టెంపర్' చిత్రంలో ఆర్.నారాయణమూర్తికోసం పూరి ఓ అద్భుతమైన పాత్ర డిజైన్ చేశాడట. దీనికోసం నారాయణ మూర్తిని సంప్రదిస్తే అతను దానిని రిజెక్ట్ చేశాడని సమాచారం.

అదరిన డైలాగు
‘‘ ఇద్దరు కొట్టుకుంటే యుద్దం...అదే ఒకడు మీదడిపోతే అది దండ యాత్ర ఇది దయ గాడి దండ యాత్ర'' అనే పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పి సూపర్ యాక్షన్ సీన్‌తో కనిపించి టీజర్‌లో అలరించాడు.

రెండూ కలిస్తే..
పూరి మార్క్‌కి ఎన్టీఆర్ డైలాగులు తోడయితే ఎలా ఉంటుందో చూపించేదే ఈచిత్రం.

ఎంటర్టైనర్
ఫుల్‌లెంగ్త్ కమర్షియల్, మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది.

భారీ అంచనాలు
పూరిజగన్నాథ్, ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.

శాటిలైట్ రైట్స్
మరో ప్రక్క ఓ ప్రముఖ ఛానల్ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని దక్కించుకుందని తెలుస్తోంది.

రైట్స్ రేటు
7.7 కోట్లకు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని ఆ చానల్ దక్కించుకుందట. ఇది భారీ ఆఫర్.

అందుకే..
ఎన్టీఆర్ గత చిత్రాలతో పోల్చితే 'టెంపర్' భారీ శాటిలైట్ ఆఫర్ ని దక్కించుకుంది. సినిమాపై నెలకొన్న అంచనాలే ఈ రేంజ్ శాటిలైట్ ఆఫర్ రావడానికి కారణమని పరిశీలకులు అంటున్నారు.

లుక్, స్టైల్
ఎన్టీఆర్ లుక్, స్టైల్స్ ప్రేక్షకులకు బాగా నచ్చింది.

సిక్స్ ప్యాక్
ఇటీవల విడుదలైన సిక్స్ ప్యాక్ లుక్ కి ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే.

క్యారక్టరైజేషన్
ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంటుగా, ఎంతో పవర్ ఫుల్‌గా ఉంటుంది.

ప్రకాష్ రాజ్
ఈ చిత్రంలో విలన్ గా ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. ఆయన పాత్ర సినిమాకు హైలెట్ అవుతుందంటున్నారు.

తొలిసారి
మొదటి సారి పూరి జగన్నాథ్...వేరే రచయిత కథతో ఈ చిత్రం చేస్తున్నారు. ఆయనే వక్కంతం వంశీ. ఆయన కథలు ఈ మధ్యన బాగా క్లిక్ అవుతున్నాయి.

తెర ముందు
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమా ప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

తెర వెనుక
ఈ చిత్రానికి కథ: వక్కతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మకడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం: పూరి జగన్నాథ్.