»   » ఇలా కూడా చేస్తారా? ‘కబాలి’ టిక్కెట్లతో ఓటర్లకు ఎర!

ఇలా కూడా చేస్తారా? ‘కబాలి’ టిక్కెట్లతో ఓటర్లకు ఎర!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: సౌత్ లో మధ్య కాలంలో ఏ సినిమాకు రానంత క్రేజ్ రజనీకాంత్ 'కబాలి' సినిమాకు వచ్చిన సంగతి తెలిసిందే. కబాలి టిక్కెట్లకు ఉన్న డిమాండును తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకునేందుకు బెంగుళూరులో కొందరు పొలిటీషియన్స్ ప్రయత్నిస్తుండటం చర్చనీయాంశం అయింది. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందడానికి కబాలి సినిమాను వాడుకుంటున్నారు.

ఇపుడు కబాలి టికెట్లు ఫ్రీగా అందించడం ద్వారా ఎన్నికల సమయానికి ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఓ ప్రముఖ ఆంగ్లపత్రికతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు మాట్లాడుతూ...'మా నియోజకవర్గంలో చాలా మంది రజనీ అభిమానులు ఉన్నారు. యూత్ కబాలి సినిమాను ఫస్ట్ డే షో చూడాలని ఉవ్విల్లూరుతున్నారు. వారికి టికెట్స్ కబాలి టికెట్స్ ఫ్రీగా అందించి సర్ ప్రైజ్ చేయాలనుకుంటున్నారు. రాజేశ్వరి నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కబాలి సినిమా విడుదలవతున్న థియేటర్లో టికెట్స్ బుక్ చేస్తున్నాం' అన్నారు.


అయితే బెంగుళూరులో రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి జరుగడం మామూలే అని, తమిళ ఓటర్ల డామినేషన్ ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది కేవలం రజనీ సినిమాల విషయంలో మాత్రమే కాదు...చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ల అభిమానులను టార్గెట్ చేస్తూ గతంలో టికెట్స్ పంచిన సందర్బాలు సైతం ఉన్నాయని అంటున్నారు.


అయితే బెంగుళూరులో మరో రెండేళ్ల వరకు ఎన్నికలు లేక పోయినా... కబాలి క్రేజ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు పొలిటిషన్లు పోటీ పడుతుండటం చర్చనీయాంశం అయింది. అయితే కొందరు మాత్రం ఇపుడు టికెట్స్ పంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని కొందరు అంటున్నారు.


కబాలి

కబాలి

సినిమా ఈనెల 15 లేదా 22న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.


భారీ అంచనాలు

భారీ అంచనాలు

ట్రైలర్, టీజర్ రిలీజైన తర్వాత కబాలి సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.


దర్శకత్వం

దర్శకత్వం

పా రంజిత్ దర్శకత్వంలో ‘కబాలి' సినిమా రిలీజ్ అవుతోంది. ట్రైలర్ అదిరిపోవడంతో రంజిత్ రజనీని ఎలా చూపిస్తారో? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


200 కోట్ల బిజినెస్

200 కోట్ల బిజినెస్

ఈ సినిమాను ఇండియాలో తమిళం, తెలుగు, హిందీతో పాటు పాటు మలేషియా, సింగపూర్, యూఎస్ఏ ల్లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. సినిమా కనీసం రూ. 200 కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.


English summary
Politicians in Bangalore are busy booking tickets for superstar Rajinikanth's upcoming film Kabali, in an attempt to win votes in the forthcoming elections. Yes, free tickets for Kabali is fast turning into a strategy that is being used by many to bring about a change in the society and for politicians, it is expected to fetch them votes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu