మహానటిపై రాజమౌళి స్పందన.. అతడికి ఫ్యాన్ అయిపోయా, కీర్తి ఇమిటేట్ చేయలేదు!
సినీ ప్రముఖుల్లో, అభిమానుల్లో ఆసక్తి రేపిన మహానటి చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లెజెండరీ నటి సావిత్రి జీవిత చరిత్రని నాగ అశ్విన్ మహానటిగా తెరకెక్కించాడు. నేడు విడుదలైన మహానటి చిత్రానికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర రావు, రాజమౌళి తొలిరోజే ఈ వీక్షించారంటే మహానటి చిత్రంపై సెలెబ్రెటీల్లో ఉన్న ఆసక్తి అర్థం అవుతుంది.
రాజమౌళి సినిమా చూసిన వెంటనే తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. కీర్తి సురేష్ నటనని రాజమౌళి ఆకాశానికెత్తేశారు. తాను చూసిన అద్భుతమైన పెర్ఫామెన్స్ లలో కీర్తి సురేష్ నటన ఒకటని అన్నారు. కీర్తి సురేష్ సావిత్రి ఇమిటేట్ చేయలేదని, స్వయంగా సావిత్రినే మన కళ్ళముందుకు తీసుకువచ్చిందని ప్రశంసించారు.

దుల్కర్ సల్మాన్ నటనకు తాను ఇప్పటి నుంచి ఆయన అభిమానిగా మారిపోయానని రాజమౌళి తెలపడం విశేషం. చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ ని కూడా రాజమౌళి అభినందించారు.


Click it and Unblock the Notifications











