Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కొడుకుకు హ్యాండించి.. తండ్రికి గ్రీన్ సిగ్నల్.. హాట్ టాపిక్‌గా రకుల్ ప్రీత్ తీరు!
దక్షిణాదిలో రకుల్ ప్రీత్ సింగ్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నది. హిట్టు, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకొంటున్నది. తాజాగా టాలీవుడ్లో రకుల్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. నాగచైతన్యతో సినిమాను వదులుకొని నాగార్జునకు ఓటేయ్యడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..
నాగచైతన్యతో రకుల్ ప్రీత్
మల్టీస్టారర్‌గా రూపొందుతున్న వెంకీ మామ చిత్రంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలు అనే సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగచైతన్యతో రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టాల్సింది. రారండోయ్ వేడుక చూద్దాం తర్వాత చైతూతో రెండోసారి జతకట్టడానికి రెడీ అయ్యింది. అంతలోనే నాగార్జునతో అవకాశం తలుపు తట్టడంతో ఆ సినిమా నుంచి తప్పుకొన్నది.
నాగార్జున మన్మథుడు2 ఓటేసిన రకుల్
ప్రస్తుతం నాగార్జున మన్మథుడు2 సినిమాతో రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి రాహుల్ దర్శకుడు. దాంతో ఆఫర్ బాగుండటంతో రకుల్ ఈ చిత్రానికి పచ్చజెండా ఊపింది. కొడుకు చైతన్యతో కాకుండా తండ్రి నాగార్జునతో నటించడానికి రకుల్ ఇష్టపడటం సినీ వర్గాల్లో ఆసక్తి రేపింది. నాగార్జునతో రకుల్ నటించడం ఇదే తొలిసారి.
వెంకీమామలో రకుల్ స్థానంలో నభ నటేష్
వెంకీ మామ నుంచి రకుల్ తప్పుకోవడంతో ఆ అవకాశం నభ నటేష్‌కు అవకాశం దక్కింది. నన్ను దోచుకుందువటే చిత్రంతో నభ నటేష్ టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక వెంకీ మామలో శ్రీయా సరన్ వెంకటేష్ సరసన హీరోయిన్గా నటించే ఆఫర్‌ను దక్కించుకొన్నది. గతంలో ఈ పాత్ర కోసం పాయల్ రాజ్‌పుత్‌ను ఎంపిక చేసి ఆ తర్వాత ఆమెను తప్పించిన సంగతి తెలిసిందే.
తండ్రి, కొడుకులతో ఒకేసారి అంటే
ఇదిలా ఉండగా, వెంకీ మామ, మన్మథుడు2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఒకవేళ ఈ రెండు చిత్రాలను రకుల్ ప్రీత్ సింగ్ ఒప్పుకొంటే పరిస్థితి దారుణంగా ఉండేదనే మాట వినిపిస్తున్నది. ఒకే సమయంలో కొడుకు, తండ్రిగా రకుల్ కనిపిస్తే ప్రేక్షకులు జీర్ణించుకోవడం కష్టంగా ఉండేదంటున్నారు. రకుల్ వెంకీ మామ నుంచి తప్పుకోవడం మంచిదే అయిందంటున్నారు.