Don't Miss!
- News
Plan B: చీటింగ్ కేసులో ప్రముఖ రాజకీయ నాయుడు అరెస్టు, ఒకరు ఆత్మహత్య, మరోకరి దెబ్బతో!
- Sports
WFI అధ్యక్షుడు, కోచ్ లైంగికంగా వేధిస్తున్నారు.. వినేశ్ ఫొగాట్ సంచలన ఆరోపణలు!
- Finance
Capex: కేంద్రం ఊతమిస్తున్నా, రాష్ట్రాలు వాడుకోవట్లే...??
- Lifestyle
వాస్తు ప్రకారం ఇంట్లో ఈ మొక్కలు అస్సలే పెంచొద్దు, లేకుంటే తీవ్రంగా నష్టపోతారు
- Technology
ఈ షియోమీ ఫోన్లలో 5G ఫీచర్ ఉన్న కూడా ..! Jio 5G పనిచేయదు. ఎందుకంటే ..!
- Travel
బిష్ణుపూర్.. అదోక అందమైన బొమ్మల నగరం!
- Automobiles
బైక్పై వెళ్ళేటప్పుడు పిల్లులు అవసరమా.. వీడియో చూసి మీరే చెప్పండి
Upasana: బేబీ బంప్ తో ఉపాసన ఫొటోలు.. ఆ పుకార్లకు చెక్ పెట్టిన రామ్ చరణ్ సతీమణి!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తండ్రి ఎప్పుడవుతాడా అని మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. వారి నిరీక్షణ ఫలించినట్లుగా రామ్ చరణ్-కొణిదెల ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని ఇటివల మెగాస్టార్ చిరింజీవి సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేశారు. ఇలా మెగా ఫ్యామిలీ నుంచి అధికారికంగా క్లారిటీ రావడం అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది.
ఇక ఒక్కసారిగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా వారసుడు వస్తున్నాడంటూ కామెంట్సు సైతం చేశారు మెగా ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఉపాసన ఏ పద్ధతి ద్వారా తల్లి కానుందని మరో చర్చకు దారి తీసింది. దీనిపై అందరికి క్లారిటీ వచ్చేలా ఉపాసన ఫొటో వైరల్ గా మారింది.

2012లో ఘనంగా వివాహం..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్-ఉపాసన ఇద్దరు కూడా రెండు ఉన్నతమైన కుటుంబాలుకు చెందినవారు. వీరిది పెద్దలకు కుదిర్చిన వివాహమైనప్పటికీ కూడా వారు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతనే సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నారు. 2012లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే పెళ్లయి పదేళ్లయినా వారి మొదటి ప్రెగ్నెన్సీ విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో అనేక రకాల కథనాలు వచ్చాయి.

పిల్లల పెంపకం అనేది చాలా ముఖ్యం..
అనేక ఇంటర్వ్యూలో ఉపాసన పిల్లలను కనడంపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు. ప్రముఖ ఆద్యాత్మిక వేత్త సద్గురు వద్ద ఉపాసన మాట్లాడిన మాటలు వైరల్ గా కూడా మారాయి. అంతేకాకుండా ఓ ఇంటర్వ్యూలో ప్రెగ్నెన్సీ, పిల్లల పెంపకంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. జీవితంలో పిల్లల పెంపకం అనేది చాలా ముఖ్యమైనదిగా ఆమె పేర్కొన్నారు. అది లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్ అని 20 ఏళ్ల పాటు పిల్లలను జాగ్రత్తగా పెంచాలన్నారు. అన్నేళ్లు తల్లిదండ్రులు తమ జీవితాలను పిల్లల కోసం త్యాగం చేయాలని అన్నారు.

శ్రీ హనుమాన్ దీవెనలతో..
పిల్లలను పెంచి పెద్ద చేయడానికి శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలని ఉపాసన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల.. శ్రీ హనుమాన్ దీవెనలతో ఉపాసన అలాగే రామ్ చరణ్ వారి మొదటి బిడ్డను కనడానికి సిద్ధంగా ఉన్నారు అని మెగాస్టార్ చిరింజీవి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలియజేశారు. ఇక ఆ పోస్ట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిపోయింది. మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ దంపతులకు ప్రత్యేకంగా విషెస్ అందించారు.

సరోగసి పద్ధతి ద్వారా
రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నరన్న వార్తతో మెగా ఫ్యామిలీ సంతోషంలో మునిగిపోయింది. ఆ తర్వాత నెట్టింట వైరల్ అయిన కొన్ని పుకార్లు వారిని కాస్తా ఇబ్బందికి గురి చేసింది. అదేంటంటే.. ఉపాసన సరోగసి ద్వారా బిడ్డకు జన్మ ఇవ్వనుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సరోగసి వార్తలపై ఇటు రామ్ చరణ్.. అటు ఉపాసన కానీ ఎవరు స్పందించలేదు. కానీ తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఉపాసన ఫొటోలు ఆ వార్తలకు చెక్ పెట్టాయి.

బేబీ బంప్ తో ఉపాసన..
తాజాగా రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఓ ఫ్యామిలీ పార్టీ కోసం థాయ్ లాండ్ కు వెళ్లారు. అక్కడ ఆ ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపారు. అందులో భాగంగా కొన్ని ఫొటోలు కూడా దిగారు. ఆ ఫొటోల్లో రెడ్ డ్రస్ వేసుకున్న ఉపాసన బేబీ బంప్ తో కనిపిస్తోంది. దీంతో ఉపాసన కొణిదెల సరోగసి ద్వారా పిల్లలకు జన్మనివ్వట్లేదని తెలుస్తోంది. ఆ ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.