Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Finance Uday Kotak: కోటక్ బ్యాంక్ స్టాక్ క్రాష్.. పాపం ఉదయ్ కోటక్.. ఎంత నష్టపోయారంటే..
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వేశ్య వాళ్ల కోసం బట్టలిప్పితే.. ఈయన మాత్రం.. అర్నబ్‌పై వర్మ దారుణంగా కామెంట్స్
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం నేషనల్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామిని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. అర్నబ్: ద న్యూస్ ప్రాస్టిట్యూట్ అని ఒక సినిమాను కూడా ఎనౌన్స్ చేసిన వర్మ అందుకే సంబంధించిన పోస్టర్లతో మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాడు. టైటిల్ ట్యాగ్ లైన్ కి తగ్గట్టుగా ఆయన ఇటీవల రిలీజ్ చేసిన మరో మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గట్టిగా వాడుతున్నాడు..
పోస్టర్స్ రిలీజ్ చేయడమే కాకుండా ఆర్జీవి ఊహించని కామెంట్స్ కూడా చేస్తున్నారు. మొన్నటివరకు వరకు ఇతర సినిమాలో పేర్లను మార్చి ఎలాంటి వివాదాలలో చిక్కుకోకుండా కాంట్రవర్సీ క్రియేట్ చేసిన ఆర్జీవి అర్నబ్ సినిమా విషయంలో మాత్రం దాదాపు డైరెక్ట్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వాయిస్ లను కూడా గట్టిగా వాడుతున్నారు.
ఇతరుల బట్టలు విప్పేస్తాడు
రీసెంట్
గా
చేసిన
ట్వీట్
లో
వర్మ
ఈ
విధంగా
వివరణ
ఇచ్చారు.
ఒక
నార్మల్
ప్రాస్టిట్యూట్
ఇతరుల
ఆనందం
కోసం
తన
బట్టలు
విప్పేస్తుంది.
అయితే
ఇతను
మాత్రం
తనలోని
ఆనందం
కోసం
ఇతరుల
బట్టలు
విప్పేస్తాడాని
రామ్
గోపాల్
వర్మ
ఘాటైన
ట్వీట్
చేశారు.
అదే
ఆ
రెండిటిలో
ఉన్నా
తేడా
అని
వర్మ
వివరించిన
విధానం
సోషల్
మీడియాలో
హాట్
టాపిక్
గా
మారింది.
సుశాంత్ మృతి చెందినప్పటి నుంచి
సుశాంత్ సింగ్ మృతి చెందినప్పటి నుంచి కూడా అర్నబ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బడా స్టార్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నెపోటిజమ్ విమర్శలు ఎదుర్కొంటున్న స్టార్స్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరు సోషల్ మీడియాలో అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి.
Recommended Video
మోషన్ పోస్టర్ వైరల్
అదే విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన రామ్ గోపాల్ వర్మ అర్నబ్ పై సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. ఇక రీసెంట్ గా మోషన్ పోస్టర్ ని విడుదల చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశారు. ప్రస్తుతం వర్మ వివిధ కాంట్రవర్సీ కాన్సెప్ట్ లతో ఓటీటీ కోసం సినిమాలు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు లోకల్ ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ అయ్యేలా చేసిన ఆర్జీవి ఇప్పుడు నేషనల్ వైడ్ గా అందరూ తనవైపు చూసేలా అర్నబ్ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. మరి ఆ కాన్సెప్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.