»   »  రణబీర్ కపూర్-కత్రినా కైఫ్ విడిపోయారా?

రణబీర్ కపూర్-కత్రినా కైఫ్ విడిపోయారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ గత కొంత కాలంగా హీరోయిన్ కత్రినా కైఫ్ తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కొంత కాలంగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇరు కుటుంబాల నుండి వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, త్వరలో ఇద్దరూ వివాహం ద్వారా ఏకం అవ్వబోతున్నారంటూ కొంత కాలంగా మీడియాలో ఇందుకు సంబంధించిన హడావుడి జరుగుతోంది.

అయితే తాజాగా పరిస్థితి పూర్తిగా మారి పోయింది. ఇద్దరూ ఇపుడు ఆ ఇంటిని ఖాళీ చేసి ఎవరి ఇంటికి వారు వెళ్లి పోయినట్లు సమాచారం. ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందని, అందుకే ఎవరి దారి వారు చూసుకున్నారని టాక్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కత్రినా మాట్లాడుతూ... ‘రణబీర్ ఒక మాటమీద నిలబడే వ్యక్తి కాదు. తన నిర్ణయాలు ఎప్పుడూ మార్చుకుంటూ ఉంటాడు. ఓ రిలేషన్ షిప్ కు కమిట్ అయ్యే వ్యక్తిత్వం కాదు' అని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య ‘సం'బంధం తెగిపోయిందనే ప్రచారం జరుగుతోంది.

అయితే ఇద్దరి మధ్య విడిపోయేంత పెద్ద గొడవ ఏం జరిగింది? అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయితే రణబీర్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వాడితో జీవితాంతం కలిసి ఉండటం కష్టమని కత్రినా భావిస్తున్నట్లు ప్రచారం జరుగున్నా....మరికొన్ని కారణాలు కూడా వినిపిస్తున్నాయి. తమాషా చిత్రంలో తన మాజీ ప్రియురాలు దీపికతో కలిసి నటించిన రణబీర్ ఆమెతో క్లోజ్ ఉండటమే కారణమని ఓ వాదన, కత్రినా- సల్మాన్ ఖాన్ మధ్య క్లోజ్ నెస్ పెరగడమూ ఓకారణమని ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

రణబీర్-కత్రినా

రణబీర్-కత్రినా


ఇటీవల జిక్యూ మేగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణబీర్ తో రిలేషన్ షిప్ గురిచి కత్రినా వివరించింది.

తొలి సినిమా

తొలి సినిమా


రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ తొలిసారిగా ‘అజబ్ ప్రేమ్ కి గజబ్ కహాని' చిత్రంలో కలిసి నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.

రణబీర్ ప్రపోజ్

రణబీర్ ప్రపోజ్


‘అజబ్ ప్రేమ్ కి గజబ్ కహాని' సినిమా షూటింగ్ సమయంలోనే రణబీర్ కత్రినాకు ప్రపోజ్ చేసాడు.

కత్రినా-సల్మాన్

కత్రినా-సల్మాన్


రణబీర్ కపూర్ కంటే ముందు కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ తో సీరియస్ రిలేషన్ షిప్ లో ఉంది.

రణబీర్-దీపిక

రణబీర్-దీపిక


తన మాజీ ప్రియురాలు దీపిక పదుకోన్ విషయంలో కత్రినాను రణబీర్ మోసం చేసాడనే ప్రచారం జరుగుతోంది.

English summary
We know that you are shocked after reading this and trust us, we are also not happy. But after dating each other for six long years Ranbir Kapoor and Katrina Kaif have finally decided to end their relationship.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu