»   » స్కైజోన్ పార్కులో రవితేజ ఆటపాట.. జోరుగా నేల టిక్కెట్టు పాటలు

స్కైజోన్ పార్కులో రవితేజ ఆటపాట.. జోరుగా నేల టిక్కెట్టు పాటలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాస్ మహారాజా 'రవితేజ' హీరోగా 'నేల టిక్కెట్టు' సినిమాకి సంబంధించిన పాటల చిత్రీకరణ నృత్య దర్శకుడు రాజ సుందరం నేతృత్వంలో గండిపేటలో జరుగుతున్నది. ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో క్లాస్ మాస్ అంశాల మేళవింపుతో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాటను దేశంలోని మొట్టమొదటి స్కైజోన్ ట్రాంపోలిన్ పార్కులో మూడు రోజులుగా జరుగుతున్నది. నిర్మాతలు షూటింగ్ వేగంగా పూర్తి చేసి మే 24న విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

Ravi Tejas Nela Ticket song shoot at Sky Zone park

రవితేజ సరసన మాళ్వికా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.

English summary
Mass Maharaja Ravi Teja's new movie "Nela Ticket" produced by Ram Talluri under SRT Entertainments banner and directed by Soggade Chinni Nayana, Raarandoi Veduka Chuddam fame Kalyankrishna Kurasala is wrapping up the song shoot. Composed by dance master Raju Sundaram currently a song is being shot from 3 days in India's first trampoline park "Sky zone" in Gandipet, Hyderabad. Makers are quickly completing the shooting to release the movie on May 24th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X