twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాప్ 10లో భరత్ అనే నేను.. ట్రెండింగ్‌లో అరవింద సమేత, రంగస్థలం.. సౌత్‌లో టాప్ అతడే!

    |

    ఈ ఏడాది దక్షణాది చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. సౌత్ ని ఎక్కువగా డామినేట్ చేసేది మాత్రం తెలుగు, తమిళ చిత్రాలే. ఈ ఏడాది ఎక్కువగా ట్విట్టర్ లో ట్రెండ్ అయిన ఇండియన్ సినిమా హ్యాష్ ట్యాగులలో కొన్ని సౌత్ ఇండియన్ చిత్రాలు మొదటి 10 స్థానాల్లో చోటు దక్కించుకోవడం విశేషం. ఊహించనట్లుగానే ఇందులో స్టార్ హీరోల సినిమాలే ట్రెండింగ్ లో నిలిచాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిత్రాలు టాప్ 10 లో చోటు దక్కించుకున్నాయి. కానీ అగ్రస్థానంలో తమిళ హీరో విజయ్ నిలిచాడు.

     అగ్రస్థానంలో దళపతి

    అగ్రస్థానంలో దళపతి

    ఇటీవల విడుదలైన దళపతి విజయ్ నటించిన సర్కార్ చిత్ర హ్యాష్ బ్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్ లో అగ్రస్థానంలో నిలిచింది. సర్కార్ చిత్రం నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయాన్ని అందుకుంది. వివాదాలతో ఈ చిత్రం ఇంకా పెద్ద చర్చనీయాంశంగా మారింది. దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రాన్ని రాజకీయం అంశాలతో తెరకెక్కించారు. సర్కార్ చిత్రం తర్వాతి స్థానంలో ఇంకా విడుదల కూడా కానీ అజిత్ విశ్వాసం హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో నిలవడం విశేషం.

    భరత్ అనే నేను

    భరత్ అనే నేను

    టాప్ 10లో మూడు తెలుగు చిత్రాలకు చోటు దక్కడం విశేషం. విశ్వాసం తర్వాత మూడవ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రం నిలిచింది. కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మహేష్ బాబు ఈ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో నటించడం విశేషం. ప్రస్థుం ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలని ఎత్తిచూపుతూ చక్కటి మెసేజ్ ని కొరటాల శివ అందించారు.

    సత్తా చాటిన ఎన్టీఆర్, రాంచరణ్

    సత్తా చాటిన ఎన్టీఆర్, రాంచరణ్

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రం కూడా టాప్ 10లో చోటు దక్కించుకుంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అరవింద సమేత తర్వాతి స్థానంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ రంగస్థలం చోటు దక్కించుకుంది. తెలుగులో బాహుబలి తరువాత బిగ్గెస్ట్ హిట్ గా రంగస్థలం నిలిచింది.

    ఆ హ్యాష్ ట్యాగ్స్ కూడా

    ఆ హ్యాష్ ట్యాగ్స్ కూడా

    బాలీవుడ్ లో మీటూ ఉద్యమం పెను దుమారం సృష్టించింది. అత్యంత ప్రభావం చూపిన హ్యాష్ ట్యాగ్స్ జాబితాలో మీటూ ఒకటిగా నిలవడం విశేషం. డీప్ వీర్ వెడ్డింగ్, కేరళ ఫ్లడ్స్ లాంటి హ్యాష్ ట్యాగ్స్ కూడా ట్రెండింగ్ లో నిలిచాయి. ఇక సూపర్ స్టార్ రజని కాలా చిత్రానికి తొలిసారి ఎమోజి సృష్టించారు. ఈ హ్యాష్ ట్యాగ్ కూడా అదరగొట్టింది.

    English summary
    South Indian movies in top 7 Twitter India hashtags, Vijay’s ‘Sarkar’ in first place. ‘Sarkar’ also bagged the top spot in Twitter India’s most ‘influential moments’, followed by the Me Too movement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X