twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెంచుల ఆహారపు అలవాట్లు.. అది సరైన పద్దతి కాదు.. ఉపాసన కామెంట్స్ వైరల్

    |

    మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌‌గా ఉంటుందో.. సమాజానికి ఉపయోగపడే మంచి పనులు ఎంతలా చేస్తుందో అందరికీ తెలిసిందే. ఆరోగ్య చిట్కాలు, సామాజిక సమస్యలపై అవగాహన వీడియోలు చేస్తూ అందరి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తుంది. కరోనా వైరస్ మహహ్మారి గురించి ముందే ఊహించి మొదటగా అందరికీ ఎన్నో సూచనలిచ్చింది. తాజాగా చెంచు తెగల మధ్య తిరుగుతూ వారి గురించి ఎంతో గొప్పగా చెప్పింది. ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం.

    సోషల్ మీడియా ద్వారా..

    సోషల్ మీడియా ద్వారా..

    ఉపాసన సోషల్ మీడియా ద్వారా ఎంతో మందికి దగ్గరైంది. నిత్యం సమాజ శ్రేయస్సు, ప్రకృతి, జంతువుల గురించి ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఉంటుంది. స్వతహాగా ఉపాసన జంతు ప్రేమికురాలు. ప్రకృతి ఒడిలో సేద తీరాలని ఆకాంక్షిస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టే ఉపాసన గ్రామీణ జీవనాన్ని ఎంతో ఆనందిస్తుంది.

    సేంద్రియ వ్యవసాయంలో మెలుకువలు..

    సేంద్రియ వ్యవసాయంలో మెలుకువలు..


    ఉపాసన ఈ లాక్ డౌన్ సమయాన్ని బాగానే వినియోగించుకుంటుంది. సేంద్రియ వ్యవసాయంలోని మెలుకువలు నేర్చుకుంది. తండ్రితో కలిసి పొలంలో పనులు చేసింది. ఈ మేరకు పేడ ఎత్తిన ఫోటోలు, ఆవుకు దాన పట్టిన ఫోటోలను షేర్ చేసింది. తాజాగా చెంచు తెగల ప్రజల జీవన శైలిని దగ్గరుండి గమనించింది.

    గిరిజన తెగ ప్రజల మధ్య..

    గిరిజన తెగ ప్రజల మధ్య..


    మహబూబ్ నగర్, శ్రీశైలం అటవీ ప్రాంతంలో చెంచులు అనే గిరిజన తెగలు నివసిస్తున్నారు. తాజాగా వారిని కలుసుకుని వారితో తిరిగి వారి ఆహారపు అలవాట్లు జీవన శైలి గురించి తెలుసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఓ పోస్ట్ చేసింది. దాని సారాంశం ఏంటంటే..

    బుజ్జిమేకలు ఆహారంగా..

    బుజ్జిమేకలు ఆహారంగా..

    "ఈ బుజ్జి మేకలు కొన్నాళ్ల తర్వాత చెంచు గిరిజనులకు రుచికరమైన ఆహారంగా మారిపోతాయేమో. ప్రజల ఆహారపు అలవాట్లను వారి సంస్కృతిని అర్థం చేసుకోవడం గౌరవించడం నేర్చుకుంటున్నాను. ఈ చెంచులు నిజంగా అద్భుతమైన ప్రజలు. ప్రకృతి మాత పట్ల వారి ప్రేమ నిరుపమానం.

    Recommended Video

    Watch : Ram Charan Learning To Make Butter With His Grandmother
    అది సరైన పద్దతి కాదు..

    అది సరైన పద్దతి కాదు..

    మన నమ్మకాలు అభిప్రాయాలను ఇతరులపై రుద్దడం సరైన పద్దతి కాదు. మాంసం తినడం, సంప్రదాయమైన ఆహారపు అలవాట్లను సూచించండి. మాంసం తినండి.. కానీ మితంగా! మనకు ఈ వనరులు ఎక్కడ్నించి వస్తున్నాయో తెలుసుకుని మసలుకుందాం. అందుకే ఎంపిక చేసుకున్న ఆహారం తీసుకుందాం. మన భూమండలానికి మనకు అవసరమైనంత మేర నైతికతతో కూడిన ఆహారపు అలవాట్లకు సంబంధించి సందేశాన్ని వ్యాప్తి చేద్దాం'అని పేర్కొంది.

    English summary
    Upasana Konidela About Chenchu Tribes. These cute little lamb are going to end up becoming a hearty meal for this Chenchu tribe sometime soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X