»   » మహిళా సాధికారత అంటే సెక్స్ కాదు: దీపికకు సోనాక్షి కౌంటర్

మహిళా సాధికారత అంటే సెక్స్ కాదు: దీపికకు సోనాక్షి కౌంటర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్త్రీల వస్త్రధారణ, ఉద్యోగాల ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని బేరీజు వేసే విధానాన్ని మగవారు మానుకోవాలని దీపిక పదుకోన్ ‘మై చాయిస్' పేరుతో ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. హోమి అదజనియా దర్శకత్వంలో రూపొందిన ఈ వీడియో దేశంలోని 99 మంది వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రముఖులు భాగస్వామ్యం అయ్యారు.

నేను ఎలా జీవించాలి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, నా శరీరం ఎలా ఉండాలన్నది పూర్తిగా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. పెళ్లికి ముందు సెక్స్, పెళ్లి తర్వాత సెక్స్ అనేది పూర్తిగా నా ఇష్టం. నా వివాహం నాకు నచ్చినట్లు జరుగడమే కాదు..నా జీవితాన్ని పురుషుడితో పంచుకోవాలా? లేక స్త్రీతో పంచుకోవాలనేది కూడా పూర్తిగా నా ఇష్టం..అంటూ బాలీవుడ్ నటి దీపిక పదుక్ ఇటీవల మహిళా సాధికారత అంశాన్ని ప్రస్తావిస్తూ ‘మై చాయిస్' పేరుతో ఈ వీడియో విడుదల చేసారు.

Women empowerment mean employment, strength: Sonakshi

సోనాక్షి కౌంటర్
అయితే దీపిక పదుకోన్ ‘మై చాయిస్' వీడియోకు తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చింది మరో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా. ‘ మహిళా సాధికారత అంటే....వివాహేతర సంబంధం, నచ్చిన విధంగా బట్టలేసుకోవడం, నచ్చిన వారితో శృంగారంలో పాల్గొనడం లాంటివి కాదు. మహిళా సాధికారత అంటే.. ఉద్యోగం, మానిసిక స్థైర్యం' అని స్పష్టం చేసింది. మహిళా సాధికారత ఎవరికి అవసరమో వారికి కల్పించాలి తప్ప విలాసాల్లో పుట్టిపెరిగిన తమలాంటివాళ్లకు కాదని స్పష్టం చేసింది. దీపిక వాదనను పురుష వ్యతిరేకమని, వివాహేతర సంబంధాలను ప్రోత్సహించేదిగా ఉందని చాలామంది వ్యా ఖ్యానిస్తున్నారు.

English summary
"Women empowerment is not always about the kind of clothes you wear, not about who you want to have sex with or stuff like that. It's about employment, strength," Sonakshi said here on Tuesday on being asked about her opinion on the 'My Choice' video.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu