twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Darja movie review కనకంగా అనసూయ రంగమ్మత్తను మరిపించే ఫెర్ఫార్మెన్స్!

    |

    Rating: 2.75/5

    నటీనటులు: సునీల్, అనసూయ, ఆమని, పృథ్వీ, అక్సాఖాన్,షమ్ము, అరుణ్ వర్మ (సత్తిపండు), శిరీష, షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్, రామ్ సర్కార్ తదితరులు

    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: సలీమ్ మాలిక్
    నిర్మాత: శివశంకర్ పైడిపాటి
    సమర్పణ: డాక్టర్ కామినేని శ్రీనివాస్
    ఎగ్జిక్యూటివ్ అండ్ కో ప్రొడ్యూసర్‌: రవి పైడిపాటి
    కెమెరా: దర్శన్
    సంగీతం: రాప్ రాక్ షకీల్,
    ఎడిటర్: ఎమ్ఆర్ వర్మ,
    కథ: నజీర్
    మాటలు: పీ రాజేంద్రకుమార్, నజీర్, భవానీ ప్రసాద్
    స్క్రిప్టు కో-ఆర్డినేటర్: పురుషోత్తపు బాబీ,
    ప్రొడక్షన్ డిజైనర్ : బందర్ బాబీ
    పీఆర్వో: బీ వీరబాబు
    రిలీజ్ డేట్: 2022-07-21

    దర్జా కథ ఏమిటంటే?

    దర్జా కథ ఏమిటంటే?

    బందరు ప్రాంతంలో సారా, అక్రమ వ్యాపారాలను మాఫియా రాణి కనకం అలియాస్ కనక మహాలక్ష్మి (అనసూయ భరద్వాజ్) నిర్వహిస్తుంటుంది. కనకం అక్రమాలను, అన్యాయాలను ఎదురించడానికి ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్లను, సామాన్య ప్రజలను మట్టుపెడుతుంటుంది. ఆమెకు తోడుగా తన సోదరుడు బళ్లారి (సమీర్) అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటాడు. ఆ క్రమంలో పుష్ప అనే అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని కనకం, బళ్లారి ప్లాన్ చేస్తాడు. కానీ అప్పటికే రంగ అనే మరో అబ్బాయికి పుష్ప మనసు ఇచ్చేస్తుంది. అనూహ్య పరిస్థితుల్లో రంగ హత్యకు గురవుతాడు? ఇలాంటి పరిస్థితుల్లో నిఖార్సైన పోలీస్ ఆఫీసర్ శంకర్ (సునీల్) రంగంలోకి దిగుతాడు.

    దర్జా కథలో ట్విస్టులు ఇలా

    దర్జా కథలో ట్విస్టులు ఇలా


    కనకం ఆగడాలను ఎదురించే పోలీస్ ఆఫీసర్‌ రవి (రవి పైడిపాటి) ఎలా బలయ్యాడు? రంగాను ఎవరు చంపారు? కథలో ఇన్స్‌పెక్టర్ రవికి పోలీసు ఆఫీసర్‌కు లింకేమిటి? ఏ లక్ష్యంతో శంకర్ బందరు ప్రాంతానికి పోస్టింగ్ అవుతాడు? కనకం ఆగడాలకు శంకర్ చెక్ పెట్టాడా? బళ్లారి ఆగడాలకు ఎవరు ముగింపు పలికారు? మాఫియా రాణి కనకం అక్రమ వ్యాపారాలకు దర్జాగా ముగింపు పలికిందా? కనకం పాత్రకు ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే దర్జా సినిమా కథ.

    దర్జా ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    దర్జా ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    దర్జా తొలి భాగం విషయానికి వస్తే.. ఇన్స్‌పెక్టర్ రవి వీరోచితమైన ఎంట్రీతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. ఆ తర్వాత కనకం పాత్ర పరిచయం పవర్‌‌ఫుల్ ఎంట్రీ మరింత థ్రిల్ చేస్తుంటుంది. ఇలా ఆర్టిస్టుల పరిచయాలతో పాటు ఆలస్యం లేకుండా కథలోకి తీసుకెళ్లడం దర్శకుడి ప్రతిభపై ఆసక్తి ఏర్పడుతుంది. కథ రెగ్యులర్‌, రొటీన్‌గానే ఉన్నప్పటికీ రకరకాల లేయర్లతో స్టోరిని తెరమీద మేళవించిన విధానంతో సరికొత్తగా అనిపిస్తుంది. చాలా రకాల పాత్రల పరిచయం, కథలో వేరియేషన్స్ కారణంగా తొలి భాగం కాస్తా నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో కమర్షియల్ ఫార్మాట్‌లో సునీల్ ఎంట్రీ వల్ల సెకండాఫ్‌పై దర్శకుడు సలీమ్ మాలిక్ అంచనాలు పెంచడంలో సఫలమయ్యాడు.

    సెకండాఫ్‌ ఫీల్‌గుడ్‌గా

    సెకండాఫ్‌ ఫీల్‌గుడ్‌గా


    ఇక సెకండాఫ్‌లో సునీల్, అనసూయ మధ్య ఫేసాఫ్ సీన్లు ఆసక్తికరంగా సాగుతాయి. ఇలాంటి పాత్రలు తెరమీద ఇంతకు ముందు చాలా చూసినప్పటికీ.. శంకర్, కనకం పాత్రలను దర్శకుడు మలిచిన విధానమే దర్జాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారుతుంది. కథలో ప్రతీ చిన్న పాత్రకు కూడా బలంగా ప్రాధాన్యం ఉండటం, నటుల పేర్లు తెలియకపోయినా.. గుర్తుండిపోయేలా పాత్రలను దర్శకుడు డిజైన్ చేయడం వల్ల సినిమా సెకండాఫ్ ఫీల్‌గుడ్‌గా ముగుస్తుంది.

    దర్శకుడు సలీమ్ మాలిక్ గురించి

    దర్శకుడు సలీమ్ మాలిక్ గురించి

    దర్శకుడు సలీమ్ మాలిక్ అనుకొన్న పాయింట్, కథను విస్తరించి రాసుకొన్న తీరుతోనే సక్సెస్ సాధించాడని చెప్పవచ్చు. సునీల్, అనసూయ తప్పితే మిగితా వారంతా కొత్తవాళ్లే. కానీ వారి నుంచి టాలెంట్ రాబట్టుకొన్న తీరు ప్రేక్షకుడిని విపరీతంగా ఆకట్టుకోవడానికి కారణమవుతుంది. కథలో చాలా పాత్రల్లో కొత్తవాళ్లే కనిపించినప్పటికీ.. ఆ రోల్స్‌కు కనెక్ట్ అయ్యేలా స్క్రిప్టు సిద్దం చేసుకోవడమే నైతికంగా చిత్ర యూనిట్ విజయం సాధించినంత లెక్క అని చెప్పవచ్చు.

    పుష్ప మూవీలో దాక్షాయనిగా

    పుష్ప మూవీలో దాక్షాయనిగా


    రంగస్థలంలో రంగమ్మత్తగా, పుష్ప మూవీలో దాక్షాయనిగా తన నటనా సామర్ధ్యాన్ని శాంపిల్‌గా రుచిచూపించింది. ఫుల్ లెంగ్త్, పవర్‌ఫుల్ పాత్ర లభిస్తే.. తాను ఎలా చెలరేగిపోతునాననే విషయాన్ని కనకం పాత్రతో అనసూయ నిరూపించింది. దర్శకుడి విజన్‌కు తగినట్టుగా, పాత్రలోని బలాన్ని గుర్తించిన అనసూయ.. పెద్దగా శ్రమ లేకుండానే ఒదిగిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. డైలాగ్ డెలివరీలోను, అలాగే హావభావాలపరంగా అనసూయలో మరో కోణాన్ని చూడవచ్చు.

    సునీల్‌, ఇతర నటీనటులు

    సునీల్‌, ఇతర నటీనటులు

    హీరో పాత్రలు కాకుండా క్యారెక్టర్లను నమ్ముకొన్న సునీల్‌.. శంకర్ లాంటి మంచి పాత్రలో తన మార్కును చూపించాడు. పుష్ప తర్వాత లభించిన పవర్ ఫుల్ పాత్ర అని చెప్పవచ్చు. తెర కేవలం శంకర్ పాత్రలోని తన ప్రజెన్స్‌, స్ట్రెంగ్త్‌ను సునీల్ చూపించడం కారణంగా ఇతర పాత్రలు హైలెట్ కావడానికి దోహదపడింది. ఇక ఇన్స్‌పెక్టర్ రవి, పుష్ప, రంగా, బళ్లారి, కానిస్టేబుల్‌గా షేకింగ్ శేషు, ఇన్స్‌పెక్టర్‌గా షఫీ, బిల్డప్ బాబాయి పృథ్యీ, గీతగా అక్షాఖాన్, రంగగా షమ్ము, మూగ అబ్బాయిగా అరుణ్ వర్మ ఈ సినిమాలో వేటికి అవే ప్రాధాన్యం ఉన్న పాత్రలు అని చెప్పవచ్చు. జర్నలిస్టుగా, పీఆర్వోగా రాణిస్తున్న వీరబాబు అనసూయ సహాయకుడిగా జక్కా పాత్రలో మెరిసాడు.

    టెక్నికల్‌ విభాగాల పనితీరు

    టెక్నికల్‌ విభాగాల పనితీరు


    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. దర్జా మూవీలో ఫుల్ మార్కులు కొట్టేయడానికి ఆస్కారం ఉన్న నిపుణుడు సినిమాటోగ్రాఫర్ దర్శన్. రకరకాల లేయర్ల ఉన్న కథను బ్లెండ్ చేయడం, ప్రతీ లేయర్‌కు అవసరమైన లైటింగ్‌ను, కలర్ ప్యాటర్న్‌ను ఉపయోగించిన విధానం సినిమాకు బ్యూటీని తెచ్చిపెట్టింది. నలుగైదు రకాల లేయర్లు ఉన్న కథలో లింకులు తెగిపోకుండా సినిమాటోగ్రాఫర్ దర్శన్, ఎడిటర్ ఎమ్ఆర్ వర్మ సమన్వయం ఈ సినిమాకు ప్లస్ అయింది. నంబర్ ఆఫ్ క్యారెక్టర్లు ఉన్నప్పటికీ.. ఎలాంటి అడ్డంకులు లేకుండా కథ చకచకా పరుగులు పెట్టించడంలో ఎడిటర్ సక్సెస్ అయ్యారు. రాప్ రాక్ షకీల్ సంగీతం బాగుంది. ఇక స్పెషల్ సాంగ్‌ తెరమీద బాగా పండింది. కొన్ని చోట్ల కథకు, సీన్లకు అవసరం లేకున్నా బీజీఎం పెంచడం కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఆర్ట్ విభాగం పనితీరు కూడా చాలా బాగుంది. పీ రాజేంద్రకుమార్, నజీర్, భవానీ ప్రసాద్ రాసిన మాటలు సందర్బోచితంగాను, ఎక్కడ అతిగా లేకుండా ఆకట్టుకొనేలా, పలు చోట్ల పవర్‌ఫుల్‌గా ఉన్నాయి.

    నిర్మాణ విలువలు

    నిర్మాణ విలువలు

    దర్జా కథను నమ్మి.. ఆయా పాత్రలకు నటీనటులను ఎంపిక చేసుకొన్న విధానంతో నిర్మాతల అభిరుచి ఏమిటో చెప్పకనే తెలుస్తుంది. శివశంకర్ పైడిపాటి, రవి పైడిపాటి, సమర్పకుడు డాక్టర్ కామినేని శ్రీనివాస్ అనుసరించిన నిర్మాణ విలువలు బేషుగా ఉన్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా పెట్టిన ప్రతీపైసా తెరమీద కనిపించేలా ఉంటుంది. కంటెంట్ పరంగా, క్వాలిటీ పరంగా ఈ సినిమాను రిచ్‌గా నిర్మించారని చెప్పవచ్చు.

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?


    అన్నా- తమ్ముడు, అక్కా-చెల్లెలు, అక్కా-తమ్ముడు లాంటి బంధాలతో పెనవేసుకొన్న కథ దర్జా చిత్రం. మీడియం రేంజ్ బడ్జెట్‌లో సెంటిమెంట్, ఎమోషన్స్, యాక్షన్, కమర్షియల్ వ్యాల్యూస్ పుష్కలంగా ఉన్న చిత్రమని చెప్పవచ్చు. కథ రెగ్యులర్ ఫార్మాట్ అయినప్పటికీ అనుసరించిన కథనం ఆకట్టుకొనేలా ఉంటుంది. ముఖ్యంగా నటీనటులు ఫెర్ఫార్మెన్స్ దర్జా సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లితే.. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ మీకు థ్రిల్లింగ్ అందించడమే కాకుండా మంచి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ అందించే చిత్రంగా చెప్పుకోవచ్చు. అనసూయ, సునీల్ కోసం దర్జాగా వన్ టైం వాచ్ మూవీ అని చెప్పవచ్చు.

    English summary
    Anasuya Bharadwaj's latest movie Darja. The movie hits the theatre on July 22nd. Sunil and Amani in lead characters.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X