twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రంగ్ దే మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    3.0/5
    Star Cast: నితిన్, కీర్తీ సురేష్, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, నరేష్
    Director: వెంకీ అట్లూరి

    దర్శకత్వం: వెంకీ అట్లూరి
    నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
    రచయిత: వెంకీ అట్లూరి, పీ సతీష్ చంద్ర
    మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
    సినిమాటోగ్రఫి: పీసీ శ్రీరాం
    ఎడిటింగ్: నవీన్ నూలీ
    బ్యానర్: సితారా ఎంటర్‌టైన్‌మెంట్
    రిలీజ్ డేట్: 2021-03-26

    రంగ్ దే కథ

    రంగ్ దే కథ

    అర్జున్ (నితిన్), అనుపమ (కీర్తి సురేష్) చిన్ననాటి స్నేహితులు. పక్క పక్క ఇంట్లో ఉండే ఫ్యామిలీ ఫ్రెండ్స్. చదువుల్లో అర్జున్ అంతంత మాత్రంగా ఉంటే.. అనుపమ ఎప్పుడూ టాప్ స్కోరర్‌గా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిద్దరి మధ్య స్నేహం, ప్రేమతోపాటు ద్వేషం కూడా కొనసాగుతుంటుంది.

    అయితే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకొన్న అనుపమ కోరికకు తల్లి (రోహిణి) అడ్డుపడి పెళ్లికి ఏర్పాట్లు చేస్తుంది. అర్జున్ మీద ప్రేమను చంపుకోలేక.. ఇష్టం లేని వివాహం చేసుకోలేక పెళ్లి పీటల మీద నుంచి లేచి రావడం స్నేహితుడిని పెళ్లాడటం చకచకా జరిగిపోతాయి. తన ప్రమేయం లేకుండా పెళ్లి జరిగిన క్రమంలో అసంతృప్తితో ఉన్న అర్జున్‌, అనుపమ ఉన్నత విద్య కోసం దుబాయ్‌కి వెళ్తారు.

    రంగ్ దే సినిమాలో ట్విస్టులు

    రంగ్ దే సినిమాలో ట్విస్టులు

    దుబాయ్‌కి వెళ్లిన అర్జున్, అనుపమ మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయి. దుబాయ్‌లో వారి కాపురం ఎలా సాగింది? ఎలాంటి పరిస్థితుల్లో అనుపమ ప్రెగ్నెంట్ అవుతుంది? ప్రెగ్నెంట్ తర్వాత అర్జున్‌కు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకొంటుంది? విడాకులకు సిద్ధమైన అనుపమతో రాజీ చేయడానికి అర్జున్ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నారు? అప్పటి వరకు ఓ రకమైన ఫీలింగ్‌లో ఉన్న అర్జున్‌లో అనుపమపై ఎందుకు సడెన్‌గా కొండంత ప్రేమ కలిగింది అనే ప్రశ్నలకు సమాధానమే రంగ్ దే.

    ఫస్టాఫ్ ఎలా సాగిందంటే..

    ఫస్టాఫ్ ఎలా సాగిందంటే..

    రంగ్ దే సినిమా విషయానికి వస్తే అర్జున్, అనుపమ చిన్ననాటి లైఫ్‌తో ఓ ఫీల్‌గుడ్ నోట్‌తో కథ ప్రారంభమవుతుంది. టిట్ ఫర్ టాట్ లాంటి సీన్లు, సింగిల్ లైనర్స్ కామెడీతో సరదాగా సినిమా సాగిపోతుంటుంది. ఇప్పటికే పలు సీన్లు చూసిన ఫీలింగ్ కలిగినప్పటికీ.. కొత్తగా రాసుకొన్న డైలాగ్స్, ట్రీట్‌మెంట్‌తో ఫ్రెష్‌గా అనిపిస్తుంది. తొలిభాగంలో అభినవ్ గోమటం, సుహాస్ తమ వంతుగా మంచి కామెడీని అందించారు. వారిద్దరి కామెడీ టైమింగ్ బ్రహ్మండంగా పేలింది. కీర్తీ సురేష్ పెళ్లి సీన్‌తో మంచి ట్విస్ట్‌తో తొలి భాగం సరదాగా ముగిసిపోతుంది. ఫస్టాప్ కొన్ని సీన్లు రొటీన్‌గా సాగిందనే ఫీలింగ్ కలిగినప్పటికి దానిని ఫ్యామిలీ ఎలిమెంట్స్ కవర్ చేయడంతో కొంత అసంతృప్తి తగ్గుతుంది.

    ఎమోషన్స్ ప్యాక్డ్ సెకండాఫ్

    ఎమోషన్స్ ప్యాక్డ్ సెకండాఫ్

    ఇక సెకండాఫ్‌కు వస్తే దుబాయ్‌లో అర్జున్, అనుపమ మధ్య టిట్ ఫర్ టాట్ సీన్లు రిపీట్ అవుతాయి. రచయితగా దర్శకుడు తన సౌలభ్యానికి తగినట్టుగా సీన్లను అలా పేర్చుకొంటూ పోయారు. చివర అర్ధగంటలో దర్శకుడు ప్రయోగించిన ఎమోషన్ అనే అస్త్రం ఆకట్టుకొనేలా సాగింది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్‌ వరకు సాగే కథా ప్రయాణంలో కీర్తీ సురేష్ తన పెర్ఫార్మెన్స్‌తో సినిమాను మరొ లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. దానికి తోడు నితిన్ పరిణతితో కూడిన నటన ఆకట్టుకొనేలా ఉంటుంది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్లస్‌గా మారిందని చెప్పవచ్చు.

    దర్శకుడిగా వెంకీ అట్లూరి

    దర్శకుడిగా వెంకీ అట్లూరి

    దర్శకుడిగా వెంకీ అట్లూరి కొత్తగా ప్రయోగాలు చేయకుండా తన వద్ద ఉన్న లవ్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తోనే సరిపెట్టుకొన్నారు. కానీ రచయితగా హ్యూమర్, ఎమోషనల్ అంశాలను పక్కగా పండించడంలో సఫలమయ్యారని చెప్పవచ్చు. మహానటి తర్వాత సక్సెస్ పరంగా తడబాటుకు గురవుతున్న కీర్తీ సురేష్‌కు బలమైన పాత్రను అందించారు. అలాగే నితిన్‌లో కొత్త ఫెర్ఫార్మర్‌ను చూపించాడు. నరేష్, రోహిణి, వినీత్ లాంటి క్యారెక్టర్లతో ఫ్యామిలీ ఎలిమెంట్స్, అభినవ్, వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ బాగా పండించాడు.

     నితిన్ పెర్ఫార్మెన్స్

    నితిన్ పెర్ఫార్మెన్స్

    ఇప్పటి వరకు నితిన్ రొమాంటిక్, లవర్ బాయ్‌గా కనిపించిన నితిన్ ఇటీవల కాలంలో ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలకు మొగ్గుచూపుతున్నారనే విషయం చెక్, రంగ్ దే రుజవైంది. అర్జున్‌గా ఓ డిఫరెంట్ రోల్‌లో ఒదిగిపోయాడు. సెకండాఫ్‌లో నితిన్‌ నటనలో అనూహ్యమైన మార్పు కనిపిస్తుంది. బలమైన, భావోద్వేగమైన సీన్లలో మెప్పించాడు.

     కీర్తి సురేష్ మెరుపులు

    కీర్తి సురేష్ మెరుపులు

    ఇక కీర్తి సురేష్ విషయానికి వస్తే అనుపమ పాత్రతో మెరుపులు మెరిపించారు. తొలి భాగంలో గ్లామర్ పాత్రలో గిలిగింతలు పెట్టింది. ఇక సెకండాఫ్‌లో సినిమాను తన భుజాల మీద మోస్తూ ఆడియెన్స్‌ను భావోద్వేగానికి గురిచేసింది. చివరి 40 నిమిషాల్లో కీర్తీ సురేష్ నటన మరోస్థాయిలో ఉంటుంది. మహానటి తర్వాత మళ్లీ ప్రేక్షకులను మెప్పించడానికి సరైన పాత్ర లభించింది. రంగ్ దే సినిమా సక్సెస్ క్రెడిట్‌లో కీర్తి సురేష్‌కే ఎక్కువ వాటా లభిస్తుంది.

    వెన్నెల కిషోర్, అభినవ్ కామెడీ

    వెన్నెల కిషోర్, అభినవ్ కామెడీ

    రంగ్ దే సినిమాకు వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం కామెడీ ప్రధాన ఆకర్షణ. సుహాస్‌తో కలిసి అభివన్ తొలి భాగంలో తన మార్కును చూపించగా... సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్ మరోసారి కామెడీ టైమ్‌తో ఆకట్టుకొన్నాడు. తొలిభాగంలో రొటీన్‌గా సాగే సీన్ల మధ్య వీరిద్దరి హాస్యం బాగా వర్కవుట్ అయింది. లేకపోతే సినిమా పరిస్థితి మరోలా ఉండేది. వీరద్దరి కామెడీ, సింగిల్ లైన్ పంచులతో సినిమా ఫుల్‌మీల్స్‌లా అనిపిస్తుంది. ఎప్పటి లానే నితిన్ తండ్రి పాత్రతో నరేష్, కీర్తి సురేష్ తల్లి పాత్రతో రోహిణి అదరగొట్టేశారు. వినీత్ ఫర్వాలేదనిపించారు.

    పీసీ శ్రీరాం, దేవీ శ్రీ ప్రసాద్

    పీసీ శ్రీరాం, దేవీ శ్రీ ప్రసాద్

    ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్స్. సెంటిమెంట్‌తో కూడిన ఎమోషనల్ సీన్లలో లైటింగ్, కలర్ కాంబినేషన్స్ సినిమాకు పాజిటివ్‌గా మారాయి. కీర్తి సురేష్, నితిన్‌ను మరింత గ్లామర్‌గా చూపించారు. దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌తో తన మార్కును చూపించాడు. సిట్యువేషనల్‌గా వచ్చే సాంగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు ఒకే అనిచెప్పవచ్చు.

     ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    కీర్తి సురేష్ పెర్ఫార్మెన్స్

    నితిన్ యాక్టింగ్
    ఫ్యామిలీ ఎమోషన్స్
    సినిమాటోగ్రఫి
    మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్

    మైనస్ పాయింట్స్
    ఫస్టాఫ్‌లో రొటీన్ సీన్లు
    కొంత సాగదీసినట్టు

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    రొమాంటిక్ డ్రామాగా రూపొందిన మూవీ రంగ్ దే. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్, ఆహ్లాదకరమైన కామెడీ, హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన బలం. ఎలాంటి అంచనాలు లేకుండా సకుటుంబ పరివారంగా ఎంజాయ్ చేయడానికి పుష్కలంగా అంశాలు ఉన్నాయి. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మంచి ఫలితాన్ని సాధించే అవకాశం ఉంది. వారాంతం తర్వాత కూడా కలెక్షన్ల ప్రవాహం కొనసాగితే బాక్సాఫీస్ వద్ద ధమాకా చూపే అవకాశం లేకపోలేదు. ఓవరాల్‌గా రంగ్ దే చిత్రం పక్కా ఎంటర్‌టైనర్ అని చెప్పవచ్చు.

    English summary
    Rang De review: Rang De starring Nithiin and Keerthy Suresh in the lead roles, is releasing grandly worldwide on March 26th. The film is produced by Sithara Entertainments while it is written and directed by Venky Atluri. Ahead of the release, Telugu filmibeat brings exclusive review
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X