Ustaad Bhagat Singh Teaser Review: ఇది భగత్ గీత.. దమ్ముంటే దాటొచ్చు.. ఉస్తాద్ టీజర్‌‌తో పవన్ అరాచకం

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత దాదాపు 14 ఏళ్లకు హరీశ్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలుత మార్చి 26వ తేదీన రిలీజ్‌ను ఖరారు చేసుకున్న ఈ చిత్రం అనూహ్య పరిణామాల మధ్య ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకురానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా మార్చి 7వ తేదీన ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ టీజర్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎలా ఉంది? అనేది పరిశీలిస్తే..

Also Read
Trisha - Vijay: త్రిషతో విజయ్ రిలేషన్‌‌పై రూమర్స్.. దళపతి బాడీగార్డ్ సెన్షేషనల్ పోస్ట్
Trisha - Vijay: త్రిషతో విజయ్ రిలేషన్‌‌పై రూమర్స్.. దళపతి బాడీగార్డ్ సెన్షేషనల్ పోస్ట్

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంత?
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌లు దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, చమ్మక్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

Ustaad Bhagat Singh Trailer Review  Pawan Kalyan s Action lifts film with unmatched aura

ఇక టీజర్‌ను పరిశీలిస్తే.. దాదాపు 43 సెకన్ల నిడివితో ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్‌ టీజ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రారంభంలోనే ఓ దట్టమైన అటవీ ప్రాంతంలో జీపుపై పవన్ కళ్యాణ్ నిలబడి ఉంటాడు. వెనుక బ్యాక్‌డ్రాప్‌లో ఘంటసాల గారి భగవద్గీతలోని ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమునా అవతారం దాల్చుచున్నాను అని శ్లోకం ప్లే అవుతుంది. ఆ వెంటనే ఓ డెన్‌లోకి పవన్ కళ్యాణ్ ఓ బల్లెం లాంటి ఆయుధాన్ని పట్టుకుని స్టైలీష్‌గా నడుచుకుంటూ వెళ్తాడు. అక్కడున్న రౌడీలతో ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భగత్ గీత. దమ్ముంటే దాటొచ్చు అని పవర్‌ఫుల్ డైలాగ్‌తో గూస్‌బంప్స్ తెప్పించాడు.

Recommended For You
Varanasi Overseas Business: ఓవర్సీస్‌లో వారణాసి సంచలనం... ఏకైక హీరోగా మహేశ్ రికార్డ్, బిజినెస్ ఎన్ని కోట్లంటే?
Varanasi Overseas Business: ఓవర్సీస్‌లో వారణాసి సంచలనం... ఏకైక హీరోగా మహేశ్ రికార్డ్, బిజినెస్ ఎన్ని కోట్లంటే?

ఇక టీజర్ చివరిలో పవన్ కళ్యాణ్ పోలీస్ యూనిఫాంలో చేసిన భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను, అలాగే లుంగీ కట్టుకుని ఓ అడ్డాలో అడుగుపెట్టే సీన్స్‌పై దర్శకుడు హింట్ ఇచ్చారు. మొత్తంగా టీజర్ .. ఉస్తాద్ భగత్ సింగ్‌పై అంచనాలను పెంచేసిందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్‌ బద్రీ నాటి కౌబాయ్ క్యాప్‌తో స్టైలీష్‌గా చాలా అందంగా ఉన్నారు. పోలీస్ గెటప్‌లోనూ గబ్బర్ సింగ్ నాటి వింటేజ్ ఆరాను చూపించారు. థమన్ నేపథ్య సంగీతం అదిరిపోయింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు బాగున్నాయి.

You May Also Like
'మా రిలేషన్‌ని చెడగొట్టాలని కుట్ర... నా బాయ్‌ఫ్రెండ్‌‌ని ఆమె అలా ట్రాప్’
'మా రిలేషన్‌ని చెడగొట్టాలని కుట్ర... నా బాయ్‌ఫ్రెండ్‌‌ని ఆమె అలా ట్రాప్’

ఒక గిరిజన యువకుడు పోలీస్ అధికారిగా మారి సమాజంలో జరుగుతున్న అరాచకాలను ఎలా ఎదిరించాడు అన్న ఇతివృత్తంతో ఉస్తాద్ భగత్ సింగ్‌ను హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. అందుకు తగినట్లుగానే టీజర్ స్టార్టింగ్‌లో అటవీలో ఫైట్ చూపించి.. అక్కడి నుంచి హీరో సిటీకి ఎలా వచ్చాడు? ఎవరిని ఎదుర్కొన్నాడు? అనేది సస్పెన్స్‌గా ఉంచారు దర్శకుడు. మొత్తం మీద ఉస్తాద్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేక గత కొంతకాలంగా ఆకలితో ఉన్న పవన్ అభిమానులకు హరీశ్ శంకర్ విందు భోజనం పెట్టారనే చెప్పొచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్ థియేట్రికల్ ట్రైలర్‌ను బహుశా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేసే అవకాశం ఉందని ఫిలింనగర్ వర్గాల టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X