For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  9 years of gabbar singh: పవన్ కళ్యాణ్ దెబ్బకు సల్మాన్ షాక్.. అతను కలవకపోయి ఉంటే ఇలా ఉండేది కాదు!

  |

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా గురించి కొంతమంది తక్కువ చేసిన మాట్లాడుతున్న రోజులవి. ఎవరి ఎన్ని మాటలన్నా కూడా అభిమానులు మాత్రం ఆయనను ఫాలో అవ్వడం మానలేదు. ఆకలి మీద ఉన్న పులికి బాక్సాఫీస్ లాంటి జంతువు ఆహారంగా దొరికితే ఎలా ఉంటుందో గబ్బర్ సింగ్ సినిమాతో అర్థమైపోయింది. 2012లో మే 11న విడుదలైన ఈ మూవీ విడుదలై నేటికి 9 ఏళ్లవుతోంది. అయితే ఒక వ్యక్తి పవన్ ను కలవకపోయి ఉంటే సినిమా హడావుడి ఈ రోజు వరకు అంతగా కనిపించేది కాదేమో..

  మొదటికే మోసం వస్తుందని

  మొదటికే మోసం వస్తుందని

  గబ్బర్ సింగ్ సినిమా హిందీ మూవీ దబాంగ్ కథకు రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ నటించిన ఆ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఇక తెలుగులో ఆ సినిమాను చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నప్పటికీ దర్శకుడు ఎ మాత్రం పొరపాటు చేసినా మొదటికే మోసం వస్తుందని వేరే హీరోలు దాని ఉసే ఎత్తలేదు.

  ఆ సినిమా డిజాస్టర్ కావడంతో

  ఆ సినిమా డిజాస్టర్ కావడంతో

  ఈ సినిమా కంటే ముందు నిర్మాత బండ్ల గణేష్ తో పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో బండ్ల గణేష్ కు మరొక హిట్టివ్వాలని డిసైడ్ అయ్యాడు. వెంటనే బండ్ల గణేష్ దబాంగ్ రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. అయితే దర్శకుడు ఎవరనే విషయంలో చాలా రకాలుగా ఆలోచించారు.

  డైరెక్టర్ ఎవరనే విషయంలో..

  డైరెక్టర్ ఎవరనే విషయంలో..

  డైరెక్టర్ ఆప్షన్ కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయంతోనే ఫైనల్ చేశారు. కొంతమంది సీనియర్ దర్శకులను అనుకున్నప్పటికి వాళ్లేవారు వద్దని హరీష్ శంకర్ ను ఫిక్స్ చేశాడు. హరీష్ ను ఫిక్స్ చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. మిరపకాయ్ సినిమాను మొదట పవన్ తోనే చేయాలని రొమాంటిక్ రిషి అనే టైటిల్ తో కథ చెప్పాడు. కథ బావుంది గాని అందులో కాస్త రొమాన్స్ ఎక్కువగా ఉందని పవన్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ అప్పటికే హరీష్ ఏమిటో పవన్ ముందే పసిగట్టారు.

   మిరపకాయ్ కథ చెప్పకపోయి ఉంటే..

  మిరపకాయ్ కథ చెప్పకపోయి ఉంటే..

  మొత్తానికి మిరపకాయ్ హిట్టయిన తరువాత గబ్బర్ సింగ్ రీమేక్ చేయమని చెప్పగానే హరీష్ తెలివిగా తన అభిమాన హీరోను ఎలా అయితే చూడాలని అనుకున్నాడో ఆ విధంగా ప్రజెంట్ చేయాలని డిఫరెంట్ గా ట్రై చేశాడు. ఆ విధంగా మిరపకాయ్ కథ చెప్పకపోయి ఉంటే పవన్ - హరీష్ కలయికలో గబ్బర్ సింగ్ వచ్చి ఉండేది కాదు. ఒకవేళ గబ్బర్ సింగ్ ను వేరేవాళ్ళు డైరెక్ట్ చేసి ఉంటే ఈ రేంజ్ లో హిట్టయ్యేది కాదేమో.

  Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
  షాక్ అయిన సల్మాన్

  షాక్ అయిన సల్మాన్

  ఇక సినిమా రిజల్ట్ గురించి తెలుసుకున్న సల్మాన్ ఖాన్ ఒక్కసారిగా సినిమా మేకింగ్ విధానానికి షాక్ అయినట్లు అప్పట్లో బాలీవుడ్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఉన్నది ఉన్నట్లుగా డిఫరెంట్ గా ట్రై చేసిన విధానం సల్మాన్ కు బాగానే నచ్చిందట. ఇక సినిమాకు దేవిశ్రీప్రసాద్ అంధించిన సంగీతం ఏ రేంజ్ లో వర్కౌట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కెవ్వు కేక సినిమా కోసం అప్పట్లో మలైకా అరోరా హీరోయిన్ కంటే ఎక్కువగా భారీ స్థాయిలో పారితోషికం అందుకున్నట్లు టాక్ వచ్చింది.

  English summary
  These are the days when some people talk less about power star Pawan Kalyan's stamina. No matter how many words someone said, the fans did not stop following him. With the film, Gabbar Singh understands what it would be like to find a box office-like animal feeding on a hungry tiger. The movie was released on May 11, 2012 and is now 9 years old. However, if a person had not met Pawan, the movie rush would not have been so visible till today.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X