twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐసోలేషన్ వార్డులో డాక్టర్లు అలా చేసేవారు.. కరోనా స్వీయ అనుభవాలు చెప్పిన నాగబాబు

    |

    మెగా బ్రదర్ నాగబాబు కరోనాను జయించిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న నాగబాబు ప్లాస్మాను దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈ కరోనా తన భార్యకు కూడా సోకిందని, కరోనా కోసం చికిత్స తీసుకుంటున్న సమయంలో ఎదుర్కొన్న అనుభవాలు, బాధలను నాగబాబు తాజాగా వెల్లడించాడు. అసలు కరోనా నుంచి ఎలా కోలుకున్నాడు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడో చెప్పుకొచ్చాడు.

    యోధుడినని చెప్పుకోను..

    యోధుడినని చెప్పుకోను..

    ‘కరోనాని జయించిన యోధుడిని అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. అంటువ్యాధి నుంచి కోలుకున్న ఓ రోగిని మాత్రమే అంటూ చాలా సింపుల్‌గా నాగబాబు తన గురించిచెప్పేశాడు. ఇక కరోనా సమయంలో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్, డాక్టర్ల చికిత్స ఐసోలేషన్ వార్డు కష్టాలను నాగబాబు వివరించాడు.

    ఆస్తమా ఉండటంతో..

    ఆస్తమా ఉండటంతో..

    ఆస్తమా ఉన్న కారణంగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సమయంలో కంగారుపడ్డానని పేర్కొన్నాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చేరాను. మొదట్లో కొన్నిసార్లు ఊపిరాడక ఇబ్బందిపడ్డాను.. మూడో రోజుకి వాసన గుర్తించే లక్షణాన్ని కోల్పోయాను అని నాగబాబు వెల్లడించాడు.

    ఐసోలేషన్ వార్డులో..

    ఐసోలేషన్ వార్డులో..

    ఐసోలేషన్ వార్డులో డాక్టర్లు దూరంగా ఉండే చికిత్స అందించేవారు. దగ్గరకు వచ్చే వారు కాదు. వైద్యం అలా చేయడమే కరెక్ట్. కానీ నాకు ఐసోలేషన్ వార్డులో ఒంటరిననే ఫీలింగ్ వచ్చింది. అలాంటి సమయంలో ఎంతో పాజిటివ్‌గా ఉండాలి. ఆ సమయంలో నేను టీవీ చూసుకుంటూ, ఫన్నీ వీడియోలు చూసుకుంటూ గడిపేశాను.

    డిశ్చార్జి అయ్యాక..

    డిశ్చార్జి అయ్యాక..

    వైద్యులు ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడిన తర్వాత కొన్నిరోజులకు కరోనా లక్షణాలు తగ్గాయని, దీంతో వైద్యులు నన్ను ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారని తెలిపాడు. ఇంటికి వచ్చాక మరో వారం రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉన్నానని పేర్కొన్నాడు. అయితే తన భార్య పద్మజకు కూడా పాజిటివ్ అని నిర్దారణ రావడం, ఇంట్లోనూ వేర్వేరు గదుల్లో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.

    పరీక్షలు చేయించుకోండి..

    పరీక్షలు చేయించుకోండి..

    స్వల్ప లక్షణాలు కనిపించినా కరోనా పరీక్షలు చేయించుకోవాలని నాగబాబు సూచించాడు. ఎందుకంటే మీ శరీరం కరోనాను తట్టుకోవచ్చు కానీ మీ పక్కవాళ్లు తట్టుకోలేకపోవచ్చు.. అందుకే నిర్లక్ష్యం చేయకండి నాగబాబు సూచించాడు.

    English summary
    Nagababu ABout Covid Treatment In Isolation Ward, When you’re in the isolation ward, even your doctors check on you from a distance. I was utterly alone. I realised that being in isolation can test your mental resolve
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X