twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందులో ఆరితేరిన పూజా హెగ్డే.. లాక్ డౌన్‌లో హీరోయిన్ చేసే పనులివే!

    |

    పూజా హెగ్డే వ్యవహారం గత వారం ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పడం, గంట తరువాత మళ్లీ సమస్య తొలగిందని పేర్కొనడం ఎంతగానో వైరల్ అయింది. అయితే మొదట ఈ వార్తలు నిజమే అనుకున్నారు అంతా. ఆ కాసేపటి అసలు విషయం బయటకు వచ్చింది. సమంతపై చేసిన కామెంట్‌ నుంచి తప్పించుకోవడానికి హ్యాకింగ్ అంటూ నాటకం ఆడిందని సోషల్ మీడియాలో అసలు విషయం బయటకు వచ్చింది. తాజాగా పూజ తనలోని ప్రతిభను అందరికీ పరిచయం చేసింది. అదేంటో ఓ సారి చూద్దాం.

     లాక్ డౌన్‌లో బిజీగా..

    లాక్ డౌన్‌లో బిజీగా..

    పూజా హెగ్డే లాక్ డౌన్‌లో ఫుల్ బిజీగా ఉంటోంది. క్షణం తీరిక లేకుండా గడిపే హీరోయిన్స్.. ఇలా ఖాళీగా దొరికిన సమయాన్ని చక్కగా వాడుకుంటున్నారు. ఫ్యామిలీతో చక్కగా సమయాన్ని గడుపుతున్నారు. తమలో దాగి ఉన్న ప్రతిభను అందరికీ పరిచయం చేస్తున్నారు.

    గరిట తిప్పుతూ..

    గరిట తిప్పుతూ..

    పూజా హెగ్డే వంట గదిలో దూరి గరిటతిప్పుతోంది. ఆ మధ్య ఇంటి సభ్యుల కోసం పిజ్జాను తయారు చేసింది. తండ్రికి బర్త్ డే సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు కేక్ తయారుచేసింది. మధ్యలో స్వీట్ హల్వాను చేసింది. ఇవే కాకుండా గిటార్ వాయించడం కూడా నేర్చుకుంది.

    తాజాగా వివాదం..

    తాజాగా వివాదం..

    సమంత అందంగా లేదని కామెంట్ చేసిన పూజా హెగ్డేపై విపరితీమైన ట్రోలింగ్ నడిచింది. సమంతకు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆమె ఫ్యాన్స్ పట్టుబట్టారు. చిన్మయి, నందినీరెడ్డి వంటి వారు ఈ వ్యవహారంలోకి దూరడంతో పూజాకు మద్దతు పెరిగింది.

    Recommended Video

    #Prabhas20Firstlook : Prabhas 20 Title Might Be Annouce This June!
    ఆరితేరిన పూజా..

    ఆరితేరిన పూజా..

    తాజాగా కొత్త రకం వంటను ట్రై చేసింది పూజా. ఎంతో నేర్పుతో, ఓర్పుతో ఆ వంటను చేసిన విధానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే కాకుండా తండ్రి పియానో వాయిస్తుంటే చక్కగా వింటోంది.. బామ్మతో కలిసి సరదాగా గడుపుతోంది. తాను లాక్ డౌన్‌లో చేసే పనులివే అని చెప్పకనే చెబుతోంది.

    English summary
    Pooja Hegde Become Good Chef In Lockdown
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X