Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరోగా రోషన్ మూవీ ప్రారంభం.. సుమ-రాజీవ్ కనకాల ప్లాన్ మామూలుగా లేదు!
రాజీవ్ కనకాల ఆ మధ్య ఓసారి ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చి చాలా విషయాలే చెప్పాడు. సుమ వెబ్ సిరీస్ ప్లానింగ్స్, నిర్మాతగా తాను చేయబోతోన్న ప్రాజెక్ట్‌లు, తన కొత్త యూట్యూబ్ చానెల్, కొడుకు హీరోగా ఎంట్రీ ఇలా ఎన్నో విషయాలపై రాజీవ్ కనకాల స్పందించాడు. మొత్తానికి సుమ రాజీవ్ కనకాల కన్న కల నేడు నిజమైంది. సుమ రాజీవ్‌ల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తనయుడు రోషణ్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
కొత్త వారితో..
రోషన్‌ను హీరోగా ఎంట్రీ ఇప్పించేందుకు కొత్త వారితోనే ప్రయోగం చేయబోతోన్నారు. కొత్త దర్శకుడు విజయ్ చెప్పిన కథకు ఫిదా అయిన సుమ రాజీవ్ తమ కుమారుడిని హీరోగా లాంచ్ చేసేందుకు అంతా రెడీ చేశారు. నేడు ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.
వినాయకుడి గుడిలో..
సుమ రాజీవ్ కనకాలతో పాటు చిత్రయూనిట్ అందరూ వినాయకుడి గుడిలో పూజలు చేశారు. స్క్రిప్ట్‌కు ప్రత్యేకంగా పూజ జరిపించారు. ఆ తరువాత విజయమాలలను దర్శకుడు, నిర్మాతలు, హీరోకు రాజీవ్ వేశాడు. మొత్తానికి ఇలా కొత్త వారితో మంచి ప్రయోగానికే సిద్దమైనట్టు తెలుస్తోంది.
సుమ సైతం..
సుమను కూడా యాక్టింగ్ వైపు మళ్లీ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. ఏదో వెబ్ సిరీస్ కోసం సుమను తీసుకుంటున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా రాజీవ్ సైతం నిర్మాణ రంగంలో దూకుడు ప్రదర్శించేందుకు సిద్దమైనట్టు కనిపిస్తోంది.
యూట్యూబ్‌లో అలా..
రాజీవ్ కనకాల యూట్యూబ్ చానెల్ అయిన మనస్వీని మూవీ మ్యూజిక్ క్రియేషన్స్‌లో వీఐపీ జర్నీ అంటూ సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చేయిస్తున్నాడు. అది కూడా బాగానే క్లిక్ అయింది. ఇప్పుడు సుమ యాంకర్, నటనలో బిజీగా ఉంటోండగా.. రాజీవ్ నిర్మాణ పనుల్లో బిజీ కానున్నాడు. ఇక రోషన్ హీరోగా సినిమా షూటింగ్‌తో బిజీ కానున్నాడు.
రొమాంటిక్ కథ..
కొత్త దర్శకుడు విజయ్ చెప్పింది ఓ రొమాంటిక్ స్టోరీ అని తెలుస్తోంది. నిర్మాతలు ఎవరైనా కూడా.. సుమ రాజీవ్ కనకాల మొత్తం బాధ్యతలు భుజాన వేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.