ప్రకాశ్ రాజ్‌కు విషాదం.. తనకు అత్యంత సన్నిహితుడు మరణంతో..

దక్షిణాది సినీపరిశ్రమ మరో ప్రముఖుడిని కోల్పోయింది. నటుడు, నిర్మాత, ఫిల్మ్ క్రిటిక్, యూట్యూబర్, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మేనేజర్ వెంకట్ సుభ మరణించడం సిని ప్రముఖులను విషాదంలోకి నెట్టింది. ఆయన మరణంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురైన సినీ ప్రముఖులు తమ సంతాప సందేశాలను సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. వెంకట్ సుభ వ్యక్తిగత వివరాలు, మరణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

నిర్మాతగా, నటుడిగా

నిర్మాతగా, నటుడిగా

వెంకట్ సుభ విషయానికి వస్తే.. మోజీ, అజగియా తీయే, కందా నాల్ ముధల్ తమిళంలో నిర్మించారు. పలు తమిళ సినిమాల్లో నటించారు. క్రికెటర్ హర్బజన్ సింగ్‌ను దక్షిణాది సినిమా పరిశ్రమకు పరిచయం చేస్తూ.. ఫ్రెండ్‌షిప్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానున్నది.

కరోనావైరస్‌తో బాధపడుతూ..

కరోనావైరస్‌తో బాధపడుతూ..

అయితే కొద్ది రోజుల క్రితం వెంకట్ సుభకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దాంతో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారు. అయితే ఆయన కోలుకొంటున్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకొన్నారు. కానీ ఆయన ఊహించని విధంగా మరణించడం దిగ్బ్రాంతికి గురిచేసింది.

ప్రకాశ్ రాజ్ తీవ్ర దిగ్బ్రాంతి గురై

ప్రకాశ్ రాజ్ తీవ్ర దిగ్బ్రాంతి గురై

తనకు అత్యంత ఆప్తుడు, స్నేహితుడు, మేనేజర్‌గా వ్యవహరించిన వెంకట్ సుభ మరణంపై ప్రకాశ్ రాజ్ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఓహో ఇది నిజం కావొద్దని ఫీలింగ్ కలుగుతుంది. చాలా బాధకరంగా ఉంది. నా స్నేహితుల్లో, కుటుంబంలో ఒక్కొక్కరిని కోల్పుతుంటే ఏమీ చేయలేనా అనే పరిస్థితి వెంటాడుతున్నది. వారి మెమొరీస్‌తో గుండె బాధతో బరువు ఎక్కుతు్నది. నా జీవన ప్రయాణంలో భాగమైనందుకు థ్యాంక్యూ. నా స్నేహితుడి ఆత్మకు శాంతి చేకూరాలి అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

Recommended Video

Milind Soman And Ankita Are Going To Participate In Bigg Boss
రాధిక శరత్ కుమార్ ఆవేదనతో

రాధిక శరత్ కుమార్ ఆవేదనతో

వెంకట్ సుభ మరణంతో తమిళ సినీ ప్రముఖులు షాక్‌ గురవుతున్నారు. నటుడు, డైరెక్టర్ మనోబాలా ట్విట్టర్‌లో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాధిక శరత్ కుమార్ ట్విట్టర్‌లో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. విషాదంతో వెంకట్‌కు గుడ్‌బై చెబుతున్నాను. నా సంస్థ రాధాన్‌తో అనేక సంవత్సరాలు పనిచేశారు. ఆయన కరోనావైరస్ నుంచి బయటపడటానికి తీవ్రంగా పోరాటం చేశారు అంటూ రాధిక ఎమోషనల్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X