Don't Miss!
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Happy Birthday Ajith: నిరాడంబరంగా సూపర్‌స్టార్ జన్మదిన వేడుకలు
తమిళ సూపర్‌స్టార్ అజిత్ 49 జన్మదినాన్ని జరుపుకొంటున్నారు. కరోనా లాక్డౌన్ కొనసాగుతుండటంతో అభిమానులు ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇప్పటికే తలా అజిత్ జన్మదినానికి సంబంధించిన అంశం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా మారింది. గత రెండు రోజులుగా అజిత్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్స్ ట్విట్టర్లో హల్చల్ చేస్తున్నది. అజిత్ జన్మదినం సందర్భంగా ఆయన జీవిత విశేషాలు మీ కోసం..
1990లో ఎన్ వీడు ఎన్ కనవర్ అనే చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అజిత్ ప్రవేశించారు. ఇప్పటి వరకు ఆయన 59 చిత్రాల్లో నటించారు. గత మూడు దశాబ్దాల కాలంలో విభిన్నమైన పాత్రలతో విశేషంగా అభిమానులను సంపాదించుకొన్నారు. ఇప్పటికీ ఆయన అగ్రస్థానంలో కొనసాగుతుండటం గమనార్హం.
దర్శకుడు ఎస్జే సూర్య డైరెక్షన్లో వచ్చిన వాలి చిత్రం అజిత్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. కవలలుగా ద్విపాత్రాభినయం చేసిన ఆయన మూగ, చెవిటి పాత్రలో అద్భుతంగా తన ఫెర్ఫార్మెన్స్‌ను చూపించారు.
ఆ తర్వాత వరలారు: హిస్టరీ ఆఫ్ గాడ్‌ఫాదర్ అనే చిత్రం మరింత పేరు తెచ్చి పెట్టింది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజిత్ త్రిపాత్రాభినయం చేశారు. మిలియనీర్ ఫాదర్‌గా, ఇద్దరు కుమారుల పాత్రలో అజిత్ మెప్పించారు. ఈ చిత్రం ఆయనకు ఫిలింఫేర్ అవార్డును సంపాదించి పెట్టింది.
వాలి, వారలారు చిత్రాలత తర్వాత అజిత్‌కు స్టార్ హోదాను సంపాదించిన పెట్టిన చిత్రం బిల్లా. విష్ణువర్దన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అజిత్‌ను సూపర్‌స్టార్‌గా మార్చేసింది.
ఇక ఆ తర్వాత తమిళంలో అజిత్‌కు అడ్డు లేకుండా పోయింది. ఇంగ్లీష్ వింగ్లీష్, ఆరంభం, వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం, నేర్కొండ పార్వాయి చిత్రాలు సూపర్‌స్టార్ హోదాను మరింత పెంచాయి. ప్రస్తుతం వాలిమై చిత్రం ప్రొడక్షన్లో ఉంది.