కీర్తీ సురేష్ ఊరమాస్ డ్యాన్స్.. దళపతి విజయ్ కోసం స్టెప్పులతో కేక... (వీడియో)

తమిళ సూపర్ స్టార్, ఇళయ దళపతి విజయ్ పుట్టిన రోజును అభిమానులు, సినీ ప్రేక్షకులు, సినీ తారలు ఘనంగా జరుపుకొంటున్నారు. విజయ్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకొనేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అభిమానులు అన్నదానాలు, రక్తదానాలు, కరోనా బాధితులకు సహాయం చేస్తూ ముందుకెళ్తున్నారు. చెన్నైతోపాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో అభిమానులు తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఇదిలా ఉంటే.. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ కీర్తీ సురేష్ తనకు నచ్చిన సినీ హీరో విజయ్‌ బర్త్ డే సందర్బంగా గొప్పగా ఓకానుకను అందించారు. సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దళపతికి వీరాభిమాని ఆల్ తోట్ట భూపతి కోసం ఈ డ్యాన్సింగ్ వీడియో అంటూ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

విజయ్ చిత్రంలోని ఓపాటను ఎంచుకొని మాస్ స్టెప్పులతో అల్లాడించారు. మాస్ స్టెప్పులతో కేక పుట్టించారు. తన స్నేహితుడితో కలిసి తీన్మార్ స్టెప్పులతో ఆలరించారు. అనంతరం ఆ వీడియోను ట్వీట్ చేస్తూ... విజయ్ సార్. మీరు పెర్ఫార్మెన్స్‌లోనే బెస్ట్ కాదు. ఎంటర్‌టైన్‌మెంట్‌లో మీరు బీస్ట్ అంటూ తన అభిమానాన్ని చాటుకొన్నారు. హ్యపీ బర్త్ డే తలపతి విజయ్ అంటూ హ్యాష్ ట్యాగ్‌తో పోస్టు పెట్టారు.

ఇళయ దళపతి విజయ్‌తో సర్కార్ చిత్రంలో కీర్తీ సురేష్ నటించిన సంగతి తెలిసిందే. విజయ్‌తో ఆమె పండించిన కెమిస్ట్రీ అభిమానులను మెప్పించింది.

HBD Thalapathy Vijay: Keerthy Suresh dedicated dancing video for Vijay

ఇదిలా ఉండగా, విజయ్ బర్త్ డేను పురస్కరించుకొని తాను నటిస్తున్న తదుపరి చిత్రం బీస్ట్ ఫస్ట్‌లుక్‌ను అభిమానులకు కానుకగా అందించారు. ఫస్ట్‌లుక్ రిలీజైన కొద్ది సేపట్లోనే ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌గా మారింది. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తన్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X