Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Finance Uday Kotak: కోటక్ బ్యాంక్ స్టాక్ క్రాష్.. పాపం ఉదయ్ కోటక్.. ఎంత నష్టపోయారంటే..
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విక్రమ్ తో పోటీనా అని ఆ హీరోని...
జాతీయ ఉత్తమనటుడు విక్రమ్ కి నటుడుగా ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు విశాల్ ని ఎక్కడకి వెళ్ళినా మీడియా సమావేశాల్లో మీరు విక్రమ్ తో పోటీ పడాలని ప్రయత్నిస్తున్నారా అని అడుతున్నారుట. దాంతో విశాల్ కి ఏమి చెప్పాలో అర్ధం కాని సిట్యువేషన్ ఏర్పడుతోందిట. బాల దర్శకత్వంలో విశాల్ చేసిన వాడు వీడు చిత్రం ని దృష్టిలో పెట్టుకుని అంతా ఆ ప్రశ్నను సంధిస్తున్నారు. మరో ప్రక్కన నాన్న చిత్రంతో విక్రమ్ మరో సారి తన నట విశ్వరూపం చూపటంతో వీరద్దరూ నేషనల్ బెస్ట్ యాక్టింగ్ అవార్డుకి పోటీ పడతారు అని మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి.
దీనిపై విశాల్ స్పందిస్తూ..విక్రమ్ వంటి నటుడుతో పోల్చటం సంతోషమే. అయితే అవార్డులు ఆశించి ఆ సినిమా చేయలేదు. పాత్ర నచ్చింది. బాల సార్ చెప్పినట్లు కష్టపడ్డాను అంతే అని వినయం చూపిస్తూ చెప్తున్నాడు. అయినా అవార్డుల విషయానికి చాలా టైమ్ ఉంది. అప్పటివరకూ ప్రేక్షకాదరణ మాత్రమే నాకు ముఖ్యం అని తేల్చేసాడు. అయితే ఇప్పుడు విశాల్ కి నటనకి అవకాశం ఉన్న పాత్రలు, విభిన్నమైన పాత్రలు ఉన్న స్క్రిప్టులు తో దర్శకులు కలుస్తున్నారుట. దాంతో విశాల్ తను మళ్ళీ కమర్షియల్ దారిలోనే ప్రయాణించాలా లేక ఇలాగే కంటిన్యూ అవ్వాలా అనే కన్ఫూజన్ లో ఉన్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.