మొగుడే యుముడు.. వీజే చిత్ర మరణం కేసులో భర్త అరెస్ట్.. షాకింగ్‌గా దారుణాలు వెలుగులోకి!
తమిళ నటి, టెలివిజన్ హోస్ట్ వీజే చిత్ర మరణం కేసులో చెన్నై పోలీసులు పురోగతి సాధించారు. వీజే చిత్ర మరణం తర్వాత అనేక అనుమానాలు వ్యక్తమైన భర్త హేమంత్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వీజే చిత్ర మరణంలో వెలుగు చూస్తున్న వాస్తవాలు ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. వీజే చిత్ర మరణం కేసులో పోలీసులు వెల్లడించిన విషయాలు ఇలా ఉన్నాయి...
Recommended Video

ఆది నుంచి అనుమానాలు భర్తపైనే..
గత మంగళవారం (డిసెంబర్ 9వ తేదీ రాత్రి) చెన్నై పరిసర ప్రాంతంలోని హోటల్‌లో వీజే చిత్ర మరణించడం అభిమానులను, సినీ ప్రముఖులను దిగ్బ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. హోటల్ రూమ్‌లో వీజే చిత్ర ఉరేసుకొని మరణించారనే వార్త బయటకు రాగానే అందరి అనుమానాలు భర్తపైనే పడ్డాయి. అయితే తన కూతురు మరణానికి కారణం భర్త హేమంత్ అంటూ చిత్ర తల్లి మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నారు.

దారుణంగా హింసించడం వల్లే మరణం
తన కూతురు భర్త హేమంత్ చేతిలో గృహ హింసకు గురైంది. నా కూతురును దారుణంగా కొట్టడం వల్లే మరణించింది. అర్ధరాత్రి వరకు షూటింగులో ఉన్నారు. ఆలస్యమవుతుందని నాతో ఫోన్‌లో చెప్పారు. కానీ ఉదయమే ఇలాంటి వార్త వినాల్సి రావడం దారుణం. నా కూతురు మరణం వెనుక వాస్తవాలను బయటపెట్టాలి అంటూ వీజే చిత్ర తల్లి విజయ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆరు రోజులపాటు ఇంటరాగేషన్
చిత్ర తల్లి విజయ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన నిజరత్‌పేట్ పోలీసులు పలు కోణాల్లో కేసును పరిశోధించారు. చనిపోయే సమయంలో చిత్రతోపాటు హోటల్ గదిలో ఉన్న హేమంత్‌ను పలుమార్లు ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేశారు. దాదాపు ఆరు రోజులు ఇంటరాగేషన్ తర్వాత అన్ని ఆధారాలు సేకరించి అరెస్ట్ చేశాం అని నిజరత్‌పేట్ పోలీసులు పేర్కొన్నారు.

టీవీ షోలో సీన్‌పై భర్త అభ్యంతరం..
నిజరత్ పేట్ పరిధిలోని ఏసీపీ సుదర్శన్ మీడియాతో మాట్లాడుతూ.. ఒక టెలివిజన్ షోలో చిత్ర నటించిన సీన్‌పై హేమంత్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సీన్ విషయంలోనే చిత్ర, హేమంత్ మధ్య గొడవ జరిగింది. హోటల్ గదిలో జరిగిన వాగ్వాదంలో ఆమెను బలంగా తోసేశాడు. ఆ కారణంగా ఆమె మరణించిందనే విషయం ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది. ఆమె మరణానికి కారణాలను పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత వెల్లడిస్తాం అని సుదర్శన్ పేర్కొన్నారు.

సీక్రెట్‌గా రిజిస్టర్ మ్యారేజ్
ఇక చిత్ర మరణం తర్వాత చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిత్ర, హేమంత్‌కు ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. కానీ వారిద్దరూ ఎవరికి తెలియకుండా అక్టోబర్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొన్నారు. కానీ జనవరిలో సంప్రదాయ పద్దతుల్లో మళ్లీ వివాహం చేసుకోవాలనుకొన్నారు. కానీ వారిద్దరి మధ్య విభేదాలు పెరిగిపోవడం చిత్ర మరణానికి దారి తీసిందనే విషయం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.


Click it and Unblock the Notifications











