»   » ఈ రాత్రికే: అక్కినేని అఖిల్‌తో అనసూయ డేటింగ్, లవ్ మ్యాటర్ తేలిందా?

ఈ రాత్రికే: అక్కినేని అఖిల్‌తో అనసూయ డేటింగ్, లవ్ మ్యాటర్ తేలిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: డేటింగ్ అంటే చాలా అర్థాలున్నాయి... పైగా హాట్ యాంకర్ అనసూయతో అంటే ఏదేదో ఊహించుకోవచ్చు అంతా. అయితే ఇపుడు చెప్పబోయేది ఓ టీవీ షోకు సంబంధించి విశేషాలు. తెలుగులో అనసూయకు ఉన్న ఫాలోయింగ్, క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని డేటింగ్ కాన్పెప్టుతో ఓ న్యూస్ ఛానల్‌లో షో ప్రారంభం కాబోతోంది. ఈ రోజు(శనివారం) రాత్రి ఈ షో ప్రసారం కాబోతోంది.

'ఎ డేట్ విత్ అనసూయ' పేరుతో ప్రసారం కాబోతున్న ఈ షో ముఖ్య ఉద్దేశ్యం టాలీవుడ్ స్టార్స్ తో చిట్ చేయడం, వారి సినిమా, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తిర విషయాలపై చర్చించడమే. షోకు రేటింగ్స్ పెంచడానికి... ఆయా స్టార్లకు సంబంధించి ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని సెన్సేషన్ విషయాలు ఈ షో ద్వారా బయట పెట్టబోతున్నారు.

ఈ షోలో తొలుత ప్రసారం అయ్యేది అక్కినేని యంగ్ స్టార్ అఖిల్ కు సంబంధించిన కార్యక్రమమే అని అంటున్నారు. ఆ మధ్య అఖిల్ ప్రేమ వ్యవహారం చాలా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. తను స్వయంగా చెప్పక పోయినా...సదరు అమ్మాయి పేరు, ఫోటోలు కూడా బయటకు బయటకు రావడం, డిసెంబర్లో పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగడంతో అఖిల్ కాస్త ఇబ్బంది పడ్డాడు.

అనసూయ డేటింగ్ షో ద్వారా... తన ప్రేమ వ్యవహారానికి సంబంధించిన విషయాలపై, పెళ్లి గురించి అంశాలపై పూర్తి క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు...

ఎన్నో ఆసక్తికర విషయాలు..

ఎన్నో ఆసక్తికర విషయాలు..

ఎ డేట్ విత్ అనసూయ కార్యక్రమంలో అఖిల్ ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పబోతున్నారు. సినిమా, పర్సనల్ లైఫ్ కు గురించి అంశాలే ఈ షోలో ప్రస్తావనకు రానున్నాయి.

ప్రేమ వ్యవహారం గురించి..

ప్రేమ వ్యవహారం గురించి..

అఖిల్ ప్రేమించిన అమ్మాయి పేరు శ్రీయ భూపాల్ అని ఆ మధ్య ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ షోలో ఆమెకు సంబంధించిన వివరాలు అఖిల్ బయట పెట్టబోతున్నాడట.

పెళ్లి గురించి క్లారిటీ..

పెళ్లి గురించి క్లారిటీ..

ఈ ఏడాది చివర్లో నాగ చైతన్య, సమంత వివాహం జరుగబోతోందని... వీరితో పాటు అఖిల్-శ్రీయ భూపాల్ పెళ్లి కూడా జరుగబోతున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై అఖిల్ క్లారిటీ ఇవ్వబోతున్నాడు.

చేతిపై టాటూ..

చేతిపై టాటూ..

అఖిల్ చేతిపై ఓ టాటూ ఉంది. ఆ టాటూ వెనక ఉన్న అసలు కారణం ఏమిటీ అనేది అందరిలోనూ ఆసక్తి ఉంది. ఈ షోలో ఈ ప్రశ్నకు సమాధానం దొరక బోతోంది.

నెక్ట్స్ మూవీ..

నెక్ట్స్ మూవీ..

భారీ అంచనాలతో లాంచ్ అయిన అఖిల్ తొలి సినిమా పెద్ద ప్లాప్ కావడంతో రెండో సినిమా విషయం చాలా లేటవుతుంది. ఎలాంటి కథను ఎంచుకోవాలనే దానిపై అయోమయంలో ఉన్నాడు. తన తర్వాతి సినిమాకు సంబంధించిన విషయాలు అఖిల్ ఈ షో ద్వారా బయట పెట్టబోతున్నారు.

 అనసూయ

అనసూయ

అనసూయ చేస్తున్న షో కావడం, ఇటీవల ఈ షోకు సంబంధించిన ప్రోమోలు ఆసక్తికరంగా ఉండటంతో.... ‘ఎ డేట్ విత్ అనసూయ' కార్యక్రమం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈషోకు ప్రధాన బలం

ఈషోకు ప్రధాన బలం

ఈ షోకు ప్రధాన బలం అనసూయ అందం, ఆమె హాట్ అండ్ సెక్సీ యాటిట్యూడే అంటున్నారంతా. దాన్ని బేస్ చేసుకునే ఈ షోను డిజైన్ చేసారు.

టాప్ పేయిడ్ యాంకర్

టాప్ పేయిడ్ యాంకర్

ప్రస్తుతం టాలీవుడ్లో అనసూయ టాప్ పేయిడ్ యాంకర్లలో ఒకరిగా ఉంది. ఈ షోకు కూడా ఆమె భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటోంది.

English summary
Tollywood actor Akhil Akkineni said a very big thank you to Rajamouli when anchor Anasuya asked about his reaction if Rajamouli has offered him a role in his next movie. Akhil said that he will be careful not to be embroiled in gossips. Akhil was surprised to know when Anasuya spoke about his affair. Watch entire special programme called A Date with Anasuya on Saturday night.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu