Bigg Boss Telugu 5 first week Nominations: ఫస్ట్ వీక్‌లో 6గురు కంటెస్టెంట్లు.. ఎవరెవరూ నామినేట్ అయ్యారంటే!

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 19 మంది కంటెస్టెంట్లతో హ్యాపీ నోట్‌లో ప్రారంభమైంది. అయితే ఇంట్లో ఇంకా సర్దుకోక ముందే ఇంటి సభ్యుల మధ్య నామినేషన్ ప్రక్రియతో చిచ్చుపెట్టేందుకు బిగ్‌బాస్ రంగం సిద్ధం చేశారు. తొలి వారం ఇంటి నుంచి బయటకు వెళ్లే సెలబ్రిటీ కోసం నామినేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఈ ప్రక్రియలో ఎవరు నామినేట్ అయ్యారంటే

ఇంటి సభ్యుల మధ్య విభేదాలు

ఇంటి సభ్యుల మధ్య విభేదాలు

నామినేషన్ ప్రక్రియకు ముందు సంతోషంగా ఒకరికొకరు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇంటి సభ్యుల మధ్య విభేదాలు సృష్టించడంలో నామినేషన్ ప్రక్రియ సఫలమైంది. ఒకరోజు కాకముందే ఇంటి సభ్యుల మనసులో ఉన్న విషయాలు బయటకు వచ్చాయి. తమకు తోచిన కారణాలను చెబుతూ ఇంటి సభ్యులన నామినేట్ చేశాడు.

వరుసగా లైన్‌లో నిలబెట్టి ప్లాస్టిక్ బ్యాగులతో

వరుసగా లైన్‌లో నిలబెట్టి ప్లాస్టిక్ బ్యాగులతో

బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టిన వెంటనే కంటెస్టెంట్లు అందరూ వరుసగా లైన్‌లో నిలబడ్డారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఒక్కక్కొరి కోసం వారి ముందు ప్లాస్టిక్ బ్యాగులు ముందు పెట్టారు. ఎవరినైతే నామినేట్ చేయాలనుకొంటారో.. వారి గురించి చెబుతూ ప్లాస్టిక్ బ్యాగ్‌ను చెత్తకుండిలో వేయాలని నామినేషన్ ప్రక్రియ రూల్ చెప్పారు. దాంతో నామినేషన్ ప్రక్రియ మొదలైంది.

తొలివారం ఎలిమినేషన్‌ కోసం..

తొలివారం ఎలిమినేషన్‌ కోసం..

తొలివారం నామినేషన్ ప్రక్రియను శ్రీ రామచంద్ర మొదలుపెట్టి మానస్, మోడల్ జస్వంత్‌ను నామినేట్ చేశారు. ఆ తర్వాత 7 ఆర్ట్స్ సరయు నామినేషన్ ప్రక్రియలో పాల్గొని కాజల్, యాంకర్ రవిని నామినేట్ చేశారు. అనంతరంశ్వేతా వర్మ ప్రక్రియలో పాల్గొంటూ ఫమీదా, నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేశారు. మోడల్ జస్వంత్, మానస్‌ను యాక్టర్ విశ్వ నామినేట్ చేశారు. సిరి హన్మంతును, మోడల్ జస్వంత్‌ను అనీ మాస్టర్ నామినేట్ చేశారు. యాక్టర్ విశ్వను, హమీదాను మోడల్ జస్వంత్ నామినేట్ చేశారు. నటరాజ్ మాస్టర్‌ను, మానస్‌ను యాంకర్ రవి నామినేట్ చేశాడు.

ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియ

ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియ

కార్తీకదీపం సీరియల్ ఫేమ్ ఉమాదేవీ నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ ఆర్జే కాజల్‌ను, మోడల్ జస్వంత్‌ను నామినేట్ చేశారు. వీజే సన్నీని, లోబోను షణ్ముఖ్ నామినేట్ చేశారు. షణ్ముఖ్‌ను, సరయును వీజే సన్నీ నామినేట్ చేశారు. షణ్ముఖ్‌ను హమీదాను ప్రియాంక సింగ్ నామినేట్ చేసింది. యాంకర్ రవిని, జస్వంత్‌ను నటరాజ్ మాస్టర్, సిరి హన్మంతును, కాజల్‌ను ప్రియ నామినేట్ చేసింది. నటి ప్రియను, యాంకర్ రవిని లోబో నామినేట్ చేశాడు. మానస్ నామినేట్ ప్రక్రియలో పాల్గొంటూ యాక్టర్ విశ్వను, సరయును నామినేట్ చేశాడు. హమీదాను, నటి ప్రియను సిరి హన్మంతు నామినేట్ చేసింది. ఉమాదేవిని, సరయును ఆర్జే కాజల్‌ నామినేట్ చేసింది. హమీదాను, కాజల్‌ను శ్వేతా వర్మ నామినేట్ చేసింది.

లోబో హాస్యంతో ఆకట్టుకొంటూ..

లోబో హాస్యంతో ఆకట్టుకొంటూ..


నామినేషన్ ప్రక్రియలో లోబో తనదైన మార్కు హాస్యాన్ని పండించాడు. షణ్ముఖ్ జస్వంత్ పాకెట్‌ను చూసి వీడి చిన్న పోరడు అంటూ కామెంట్ చేశాడు. తన షార్ట్‌ను లాగుకొంటూ, గోక్కుంటూ అందర్నీ నవ్వించాడు. అలా చేయకూడదంటే నాకు అలా అలవాటైంది అంటూ చెప్పారు. రవి నీవు నాకు బాగా తెలుసు. నీ యాటిట్యూడ్ చూపకు అంటూ నామినేట్ చేస్తూ అందర్నీ తనదైన శైలిలో నవ్వించాడు.

ఆర్జే కాజల్‌ను టార్గెట్ చేస్తూ..

ఆర్జే కాజల్‌ను టార్గెట్ చేస్తూ..

ఇక రేడియో జాకీ కాజల్‌ను ఎక్కువ మంది టార్గెట్ చేశారు. బిగ్‌బాస్ ఆట గురించి బాగా తెలుసు. అందుచేత ఈ ఫార్మాట్‌లో ఆమె ఫర్‌ఫెక్ట్‌గా ఫాలో అవుతున్నది. ఆమెకు ఈ గేమ్ గురించి బాగా తెలుసు కాబట్టి కాజల్‌ను నామినేట్ చేస్తున్నానని కొందరు చెప్పారు. అయితే చిన్నతనం నుంచి నాకు బిగ్‌బాస్ చూడటం అలవాటు. అందువల్ల నన్ను అందరూ కాంపిటీటర్ అనుకోవడం హ్యాపీగా ఉంది అంటూ కాజల్ ఎమోషనల్ అయ్యారు.

Recommended Video

Tollywood Stars Unbelievable Support To Vihayy Devarakonda | Filmibeat Telugu
నామినేట్ అయిన 6 గురు కంటెస్టెంట్లు

నామినేట్ అయిన 6 గురు కంటెస్టెంట్లు

నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మొత్తం ఆరుగురు ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లే వారిలో ఒకరి కోసం నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన వారిలో యాంకర్ రవి, మానస్, సరయు, కాజల్, హమీదా, జస్వంత్ ఉన్నారు. శనివారం, ఆదివారం రోజుల్లో హోస్ట్ నాగార్జున వేదికపైకి వచ్చి ఆరుగురిలో ఒకరిని ఇంటి నుంచి పంపించేందుకు నిర్ణయం తీసుకొంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X