For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu Non Stop నాగ్ హోస్ట్‌గా గ్రాండ్‌గా ప్రారంభం.. కంటెస్టెంట్లు ఎవరు?. ఫుల్ లిస్టు ఇదే!

    |

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో కొత్త ఫార్మాట్ గ్రాండ్‌గా లాంచ్ అయింది. హోస్ట్ నాగార్జునగా ఈ బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఓటీటీ షో అభిమానులు భారీ అంచనాల మధ్య ప్రారంభమైంది. ప్రారంభ వేడుకలో నాగార్జున గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్లను పరిచయం చేశారు. దాదాపు 18 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్న ఈ షోలో ఎవరెవరు పాల్గొంటున్నారంటే..

    17వ కంటెస్టెంట్‌గా అఖిల్ సార్థక్

    17వ కంటెస్టెంట్‌గా అఖిల్ సార్థక్

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4‌లో రన్నరప్, యాక్టర్ అఖిల్ సార్థక్ బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లోకి అడుగుపెట్టాడు. సింగర్‌గా స్టేజ్‌పైకి వచ్చిన అఖిల్ 17వ కంటెస్టెంట్‌గా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు రెడీ అయ్యారు. అయితే నాగార్జునతో మాట్లాడుతూ.. ఈ సారి ట్రోఫి గెలుచుకొని వస్తాను అంటూ చెప్పారు. అలా ఇంటిలోకి అఖిల్ సార్థక్ ఇంటిలోకి అడుగుపెట్టగానే.. బిందుమాధవితో కలిసి స్టెప్పులు వేసి ఆకట్టుకొన్నారు. ఇంటిలో సెలబ్రిటీలందరూ పాటలకు జోష్‌తో స్టెప్పులేసి ఆకట్టుకొన్నారు.

    16వ కంటెస్టెంట్‌గా హమీదా ఖాతూన్

    16వ కంటెస్టెంట్‌గా హమీదా ఖాతూన్

    బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లో సింగర్ శ్రీరామచంద్రతో ఫుల్ రొమాన్స్ చేసిన హీరోయిన్ హమీదా ఖాతూన్ తొందరగానే ఇంటి నుంచి ఎలిమినేట్ అయింది. అయితే బిగ్‌బాస్ తర్వాత లైఫ్ చాలా మారిపోయింది. ఇప్పుడు మళ్లీ బిగ్‌బాస్ నాన్ స్టాప్ షోలోకి 16వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. అయితే గతంలో నాగార్జున ఇచ్చిన షర్ట్‌ వేసుకొని స్టేజిపైకి అడుగుపెట్టింది. సింగర్ శ్రీరామచంద్ర నాకు ఫ్రెండ్ మాత్రమే అని చెప్పారు. తగ్గేదేలే అనే హ్యాష్ ట్యాగ్‌తో ఇంటిలోకి అడుగుపెట్టింది.

    15వ కంటెస్టెంట్‌గా బిందు మాధవి

    15వ కంటెస్టెంట్‌గా బిందు మాధవి

    బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విషయానికి వస్తే.. ఒక విశేషం గురించి చెప్పుకోవాలి. తమిళ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ను తెలుగు బిగ్‌బాస్‌లోకి తీసుకొన్నారు. ఆవకాయ బిర్యాని చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బిందు మాధవి బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో 15వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. అయితే తమిళ బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టే సమయానికి లవ్ ఫెయిల్యూర్ అయింది. అయితే అలాంటి పరిస్థితుల్లో బిగ్‌బాస్ తమిళంలోకి వెళ్లి చివరి వారం వరకు ఉన్నాను అని చెప్పారు. మదనపల్లి గ్రామానికి చెందిన తాను తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడానికి వెళ్తున్నాను అని చెప్పారు. మస్తీ అనే హ్యాష్ ట్యాగ్‌తో ఇంటిలో మస్తీ చేస్తాను అని చెప్పారు

    14వ కంటెస్టెంట్‌గా యాంకర్ శివ

    14వ కంటెస్టెంట్‌గా యాంకర్ శివ

    బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లోకి యాంకర్ శివ అడుగు పెట్టాడు. అనేక అవమానాలు, కష్టాల తర్వాత యాంకర్‌గా మారినట్టు చెప్పారు. అయితే ఎప్పుడు వివాదాస్పద ప్రశ్నలతో వార్తల్లో నిలిచే శివను బిగ్‌బాస్ పలకరించాడు. అయితే తన చెల్లెల్లి పెళ్లి చేయడానికి బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టానని చెప్పాడు. అయితే ఇంటిలోకి వెళ్లిన తర్వాత డిమాండ్ చేసే పరిస్థితులను బట్టి నేను ఎవరో ఒకరిని ఇంటర్వ్యూ చేస్తాను అని చెప్పారు.

    13వ కంటెస్టెంట్‌గా 7 ఆర్ట్స్ సరయు

    13వ కంటెస్టెంట్‌గా 7 ఆర్ట్స్ సరయు

    బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లో పాల్గొన్న సరయు తొలివారంలోనే ఎలిమినేట్ అయింది. అయితే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లోకి అడుగుపెట్టింది. అయితే సరయూతో నాగ్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ తెలుగు 5లో ఇలా వచ్చి అలా పోయావు.. ఈసారి ఏమిటి అన్నారు. దాంతో సరయూ మాట్లాడుతూ.. జీవితం ప్రతీ సారి రెండో అవకాశం ఇస్తుంది. దానిని బాగా యూజ్ చేసుకొంటే గట్టిగా కొట్టొచ్చు అని చెప్పింది. ఇంటిలోకి వెళ్లే ముందు ఫైర్ అనే హ్యాష్ ట్యాగ్‌తో వెల్లింది. ఇంటిలో సరిగ్గా మంటపెడుతాను అంటూ ఇంటిలోకి అడుగుపెట్టింది.

    తేజస్విని మదివాడ 12వ కంటెస్టెంట్‌గా

    తేజస్విని మదివాడ 12వ కంటెస్టెంట్‌గా

    12వ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ తెలుగు 2లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న తేజస్వి మదివాడ బిగ్‌బాస్ నాన్ స్టాప్ షోలోకి అడుగుపెట్టింది. ఎల్లో బికినీ స్ట్రాప్‌లో డ్రెస్‌లో గ్లామరస్‌గా కనిపించింది. అయితే బిగ్‌బాస్‌లోకి ఎందుకు వచ్చావంటే.. ఆడియెన్స్‌కు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో నేను ఇంకా రుణపడి ఉన్నాను. గతంలో ఆరోవారంలో నేను ఎలిమినేట్ అయ్యాను. మరోసారి మంచి వినోదాన్ని పంచడానికి వచ్చాను అని చెప్పింది. టాలీవుడ్ హిట్ పాటలకు రీల్స్ చేసినట్టు డ్యాన్స్‌లు, స్టెప్పులతో ఆకట్టుకొన్నది. మ్యాడ్‌నెస్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ఇంటిలోకి అడుగుపెట్టింది.

    11వ కంటెస్టెంట్‌గా మిత్రా శర్మ

    11వ కంటెస్టెంట్‌గా మిత్రా శర్మ

    ముంబైకి చెందిన నటి మిత్రా శర్మ బిగ్‌బాస్ తెలుగు నాన్‌స్టాప్‌లోకి 11వ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. తన తల్లిదండ్రుల బ్రేకప్ గురించి చెప్పి ఎమోషనల్ అయింది. తన కోసం తండ్రి రెండో పెళ్లి చేసుకొన్నాడని చెప్పింది యాక్టింగ్‌పై ఆసక్తితో ట్రైనింగ్ తీసుకొన్నాను. ఆ సమయంలోనే మా నాన్న మరణించడంతో ముంబైని వదిలి ఏడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాను.

    చాలాసార్లు ఆఫర్ల కోసం ట్రై చేయడంతో రిజెక్ట్ సమాధానంగా దొరికింది. చివరకు తొలి సంధ్యవేళలో సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమయ్యాను. ఆ తర్వాత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించి బాయ్స్ అనే సినిమాను నిర్మించాను అని చెప్పారు.

    పదో కంటెస్టెంట్‌గా అనిల్ రాథోడ్

    పదో కంటెస్టెంట్‌గా అనిల్ రాథోడ్

    బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ షో నాన్ స్టాప్‌లోకి మోడల్ అనిల్ రాథోడ్ అడుగుపెట్టాడు. ఇంటిలో అందరూ పోలీస్ ఆఫీసర్లుగా ఉంటే.. అనిల్ మోడలింగ్‌పై ఆసక్తితో వినోదరంగంలోకి అడుగుపెట్టారు. అయితే నేషనల్ స్థాయిలో మోడలింగ్‌లో రాణించాలని అనుకొన్నాను అని చెప్పారు. అయితే ఇంటిలోకి వెళ్లే ముందు బిగ్‌బాస్ చిన్న టాస్క్‌ ఇచ్చారు. చేతిలోకి ఓ ఫ్లాగ్ ఇచ్చి.. ఇంటిలో ఉండే అమ్మాయిల్లోని ఏ అమ్మాయి పెదవిని గుర్తుపట్టాలి అని చెప్పారు. దాంతో అనిల్ రాథోడ్ ఇంటిలోకి అడుగుపెట్టారు.

    తొమ్మిదో కంటెస్టెంట్‌గా శ్రీ రాపాక

    తొమ్మిదో కంటెస్టెంట్‌గా శ్రీ రాపాక

    బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లోకి ఛాలెంజర్స్ టీమ్ నుంచి రాంగోపాల్ వర్మ చిత్రంలో శృంగార తారగా నటించిన శ్రీ రాపాక తొమ్మిదో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. అయితే తాను ఫ్యాషన్ డిజైనర్‌నని, అయితే అనుకోకుండా నటిగా కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. గోదావరి జిల్లాకు చెందిన దానిని. బాల్యంలో కబాడీ, ఖోఖో గేమ్స్‌లో నేషనల్ స్థాయిలో పతకాలు గెలుచుకొన్నాను. నా ఫ్యామిలీలో పిల్లలు బిగ్‌బాస్‌లోకి వెళ్లాలని కోరుకొన్నారు. ఈ రోజు వారి ప్రార్థనలు ఫలించాయి. ఈ విధంగా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టాను అని శ్రీ రాపాక అన్నారు. రేసు గుర్రం అనే హ్యాష్ ట్యాగ్‌ను బోర్డుపై పెట్టి ఇంటిలోకి అడుగుపెట్టింది.

    ఎనిమిదో కంటెస్టెంట్‌గా నటరాజ్ మాస్టర్

    ఎనిమిదో కంటెస్టెంట్‌గా నటరాజ్ మాస్టర్

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో నాలుగు వారాలకే ఎలిమినేట్ అయిన నటరాజ్ మాస్టర్ మరోసారి బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లోకి ఎనిమిదో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. గతంలో నా భార్య కోరిక కోసం నేను బిగ్‌బాస్‌కు వచ్చాను. ఇప్పుడు నా పాప కోసం వచ్చాను. ఎందుకంటే.. నా బిడ్డకు నేనే హీరోగా అనిపించాలి. అందుకే బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లోకి వచ్చాను. ఇక పులి మాదిరిగా గాండ్రిస్తాను అని చెప్పాడు. ఇంటిలోకి వెళ్తుండగా తన కూతురు ఫోటోను గిఫ్గుగా ఇచ్చారు.

    ఏడో కంటెస్టెంట్‌గా అరియానా గ్లోరి

    ఏడో కంటెస్టెంట్‌గా అరియానా గ్లోరి

    బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లోకి బిగ్‌బాస్ తెలుగు 4 కంటెస్టెంట్‌ అరియానా గ్లోరి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా అరియానా మాట్లాడుతూ.. నా పేరులోని గ్లోరి నా జీవితంలోకి వచ్చింది. అరియానా అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిశాను. అయితే బిగ్‌బాస్ నన్ను వదలడం లేదు. సీజన్ 4 తర్వాత ఐదో సీజన్‌లో బిగ్‌బాస్ బజ్‌కు హోస్ట్‌గా వ్యవహరించాను. ఇప్పుడు బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లోకి అడుగుపెట్టబోతున్నాను. ఇది నాకు అదృష్టంగా భావిస్తాను. ఈ షోలో కూడా బోల్డ్ అండ్ డేరింగ్‌గా ఉంటాను అని చెప్పింది. అలా బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లోకి వెళ్లగానే అందరూ గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు.

    ఇక ఆరో కంటెస్టెంట్‌గా ఆర్జే చైతూ..

    ఇక ఆరో కంటెస్టెంట్‌గా ఆర్జే చైతూ..

    బిగ్‌బాస్ తెలుగు నాన్‌స్టాప్‌లోకి ఆరో కంటెస్టెంట్‌గా రేడియో జాకీ ఆర్జే చైతూ అడుగుపెట్టాడు. శ్రీముఖికి మంచి స్నేహితుడు. ఇంటిలోకి వెళ్లిన తర్వాత వెయిట్ తగ్గేందుకు ప్రయత్నిస్తాను. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అని అన్నాడు. అయితే వేదిక మీదకు వచ్చిన ఆర్జే చైతుకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. చైతు తల్లిని పిలిచి ఆశ్చర్యపరిచారు. చైతుకు ముద్దుల పెడుతూ ప్రేమను చాటుకొన్నది. నాగార్జునకు కూడా హగ్ ఇచ్చి సంబరపడిపోయింది. చైతుకు పిజా తినిపించి నాగార్జున లోపలికి పంపించాడు.

    ఐదో కంటెస్టెంట్‌గా స్రవంతి చొక్కారపు..

    ఐదో కంటెస్టెంట్‌గా స్రవంతి చొక్కారపు..

    ఐదో కంటెస్టెంట్‌గా యాంకర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్యూయెన్సర్ స్రవంతి చొక్కారపు వేదికపైకి అడుగుపెట్టింది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఆమెతో నాగార్జున మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి? అంటే.. నా స్మైల్ గురించి చాలా మంది చెబుతారు.. నన్ను బాధపెట్టిన ట్రోల్ ఏమిటంటే.. నా బాడీ షేమింగ్ అని చెప్పారు. అయితే ప్రేక్షకులకు తెలియని విషయం చెప్పమంటే.. నాకు రెండుసార్లు పెళ్లి అయింది. ఒకసారి లేచిపోయి పెళ్లి చేసుకొన్నాను.. ఆతర్వాత నా ఫ్యామిలీ పెళ్లి చేసిందని చెప్పారు. అయితే నీకు పెళ్లి అయిందనే విషయం ప్రేక్షకులకు చెప్పావుగా అంటూ నాగ్ షాక్ ఇచ్చాడు.

    నాలుగో కంటెస్టెంట్‌గా అజయ్ కుమార్ కథ్వురార్

    నాలుగో కంటెస్టెంట్‌గా అజయ్ కుమార్ కథ్వురార్

    బిగ్‌బాస్‌లోకి ఛాలెంజర్స్ టీమ్‌ నుంచి అజయ్ కుమార్ కథుర్వార్ ఎంట్రీ ఇచ్చాడు. తాను రెండు మూడు సినిమాల్లో నటించానని చెప్పారు. ఇక సినిమాను స్వయంగా రాసుకొని డైరెక్ట్ చేస్తున్నాను అని చెప్పారు. హార్డ్ వర్క్, లక్‌‌లో దేనిని నమ్ముతావు అని హోస్ట్ నాగార్జున అడిగితే.. ఆ రెండు నా జీవితాన్ని ఆడుకొన్నాయి అని చెబుతూ.. నా తొలి సినిమా అవకాశం వస్తే.. లక్ బాగా పనిచేస్తుందని అనుకొన్నాను.

    సినిమా రిలీజ్‌కు ముందు నాకు యాక్సిడెంట్ జరిగి నేను 8 నెలలు మంచానికి పరిమితమయ్యాను అని చెప్పాను. కానీ హార్డ్ వర్క్‌తో ఎక్సర్‌సైజ్‌ చేసి మామూలు మనిషి అయ్యాను అని చెప్పారు. వేదిక మీద వస్తూ.. డీజే టిల్లు పాటకు డ్యాన్స్ చేస్తూ నాగ్‌ను ఆకట్టుకొన్నాడు.

    మూడో కంటెస్టెంట్.. ముమైత్ ఖాన్

    మూడో కంటెస్టెంట్.. ముమైత్ ఖాన్

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1లో పార్టిసిపెంట్‌గా పాల్గొన్న సినీ తార ముమైత్ ఖాన్ అడుగుపెట్టింది. నాగార్జున ఆమెతో మాట్లాడుతూ.. ఫస్ట్ సీజన్‌లో ఒకసారి బయటకు వెళ్లి మళ్లీ వచ్చావు.. మళ్లీ మూడోసారి బిగ్‌బాస్ నాన్ స్టాప్‌గా వెళ్తున్నావు అని అంటే.. అవును.. ఈ సారి గెలిచేందుకు ప్రయత్నిస్తాను అంటూ ముమైత్ చెప్పారు.

     సెకండ్ కంటెస్టెంట్ మహేష్ విట్టా

    సెకండ్ కంటెస్టెంట్ మహేష్ విట్టా

    బిగ్‌బాస్ తెలుగు నాన్ స్టాప్ సెకండ్ కంటెస్టెంట్‌గా కమెడియన్, యాక్టర్ మమేష్ విట్టా వేదికపైకి అడుగుపెట్టాడు. నా భాషలో చెప్పాలంటే.. బిగ్‌బాస్ అనేది పెదనాన్న ఇల్లు అంటూ కామెంట్ చేశాడు. గతంలో నేను నాకు పోటీ. ఎన్ని రోజులు ఉంటాననే భయంతో ఉన్నాను. కానీ ప్రేక్షకులు 12 వారాలు ఇంటిలో ఉంచారు. కానీ ఈసారి నేను కంటెస్టెంట్లతో పోటీ పడటమే కాదు.. కప్ పట్టుకొని బయటకు వస్తాను అని మహేష్ విట్టా అన్నాడు. మీ ఆశీర్వాదం ఇస్తే.. నేను విజేతగా నిలుస్తాను అంటూ రిక్వెస్ట్ చేశాడు. దాంతో నాగార్జున తథాస్తు అంటూ ఇంటిలోకి పంపించాడు. ఇంటిలోకి వెళ్తూ ఊరమాస్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి లోనికి వెళ్లాడు. ఇంటిలోకి వెళ్లిన మహేష్ విట్టాను అశురెడ్డి ఆహ్వానించింది.

    ఫస్ట్ కంటెస్టెంట్ అశు రెడ్డి

    ఫస్ట్ కంటెస్టెంట్ అశు రెడ్డి

    బిగ్‌బాస్ తెలుగు నాన్ స్టాప్ షోలోకి తొలి కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ సీజన్ 4 లో పార్టిసిపేట్ చేసిన అశురెడ్డి గ్రాండ్‌గా వేదికపైకి ఎంట్రీ ఇచ్చింది. స్టేజ్ మీద వచ్చి రావడంతోనే హోస్ట్ నాగార్జునకు ఝలక్ ఇచ్చింది. ఎర్రటి పెదాలకు రెడ్ లిప్‌స్టిక్ పెట్టుకొన్న ఈ శృంగార భామ నాగార్జున బుగ్గపై ముద్దు పెట్టింది. ఆ తర్వాత నాగార్జున అనుమతితో ఇంటిలోకి అడుగుపెట్టింది. పిచ్చిక్కిస్తా అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ఇంటిలోకి అడుగుపెట్టింది.

    వారియర్స్.. ఛాలెంజర్స్ టీమ్‌లుగా

    వారియర్స్.. ఛాలెంజర్స్ టీమ్‌లుగా

    బిగ్‌బాస్ తెలుగు నాన్ స్టాప్ షోలో మొత్తం 18 మంది కంటెస్టెంట్లను రెండుగా విభజించారు. ఒక టీమ్‌కు వారియర్స్, రెండో టీమ్‌కు ఛాలెంజర్స్ అని పేర్లు పెట్టారు. వారియర్స్ టీమ్‌లో బిగ్‌బాస్ తెలుగు షోలో పార్టిసిపేట్ చేసిన వాళ్లు ఉంటారు. కొత్తగా బిగ్‌బాస్‌లోకి వస్తే.. ఆ కంటెస్టెంట్లను ఛాలెంజర్స్‌గా పిలుస్తారు అని హోస్ట్ నాగార్జున చెప్పారు.

    English summary
    Bigg Boss Telugu Non Stop show started on Disney+Hot Star app. Here is the full list of contestants.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X