Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పులిహోర కలపడంలో RGV తరువాతే ఎవరైనా.. యాంకర్ అందానికి ఫిదా.. ఇంటర్వ్యూలోనే ఆఫర్!
అందమైన అమ్మాయిని ఎలా బుట్టలో పడేయలో కొంత మంది మగవాళ్లకు వెన్నతో పెట్టిన విద్య అనే మాట రామ్ గోపాల్ వర్మకు బాగా సెట్ అవుతుందేమో... ఎందుకంటే అప్పుడప్పుడు మోడల్స్ తో పార్టీలు జరుపుకునే వర్మ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చి షాకిస్తుంటాడు. అయితే వర్మ లాంటి వ్యక్తికి అసలు అలాంటి గర్ల్స్ ఎలా ఎట్రాక్ట్ అవుతారు అంటే ఆయన పులిహోర కలపడంలో చాలా నేర్పరి అని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వర్మ ఒక యాంకర్ తో మాట్లాడిన విధానం వైరల్ గా మారింది.
Recommended Video
వరుస ఇంటర్వ్యూలు..
ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా మారారు. కేవలం రెండు వారాల్లోనే 20కి పైగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎవరు వచ్చినా కూడా కుదరదు అనకుండా తన కంపెనీలోనే వివిధ అంశాలపై ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇక అందమైన యాంకర్స్ వస్తే.. ఏ మాత్రం లైట్ తీసుకోవడం లేదు. మధ్యమధ్యలో వాళ్ళని ఫ్లట్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు.
ఆ యాంకర్ అందానికి ఫిదా..
చందన అనే ఒక టెలివిజన్ యాంకర్ కు ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ ఆమెతో వివిధ రకాల అంశాలపై స్పందించాడు. అనంతరం మెల్లగా ఆమె అందం గురించి మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఒక కాలేజ్ కుర్రాడు అమ్మాయిని పడేయడానికి వాడే అస్త్రాలను కూడా ఇక్కడ మాటలతో గట్టిగానే వాడేశారు.
పులిహోర గట్టిగానే కలుపుతున్నాడు..
వర్మ మాట్లాడిన విధానం చూస్తుంటే మనోడు పులిహోర గట్టిగానే కలుపుతున్నాడు అని సోషల్ మిసియాలో ఒక రేంజ్ లో మీమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆమె అందానికి ఆకర్షితుడైన వర్మ వెంటనే సినిమా ఆఫర్ కూడా ఇచ్చేశాడు. అసలు మీరు ఇక్కడ ఉండాల్సిన వారు కాదు.. సినిమాల్లోకి వెళ్ళాలి.. చాలా అందంగా ఉన్నారంటూ పొగిడేశారు.
ఎప్పుడైనా రెడీ..
మీరు ఎప్పుడు అంటే అప్పుడు రెడీ అంటూ.. తప్పకుండా ఒక మంచి సినిమా చేద్దామని వర్మ భారీ ఆఫర్ ఇచ్చేశాడు. ఇటీవల కాలంలో నేను చూసిన అందమైన అమ్మాయి మీరే అంటూ.. ఇంత సేపు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం కూడా మీరే అని వర్మ తనకు తోచిన విధంగా యాంకర్ ని ఆకర్షించే ప్రయత్నం చేశాడు. గతంలో కూడా వర్మ చాలా మంది యాంకర్స్ తో ఈ రేంజ్ లోనే కలరింగ్ ఇచ్చాడు. ఏదేమైనా వర్మ ఫ్లట్ చేసే విధానం బావుంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.